గత కొన్ని రోజులుగా సెవ్తీ కి ఒంట్లో నలతగా ఉంది. ఆమె తన మంచం మీద నుంచి లేవలేకపోతోంది. ఆడుకోవడానికి బయటకు వెళ్ళలేకపోతోంది.
భోండూ ఆమె తమ్ముడు. సెవ్తీ త్రాగడానికి మంచినీళ్ళు కావాలని అడగగానే,అతను పరుగెత్తి వెళ్ళి,చెంబుతో మంచి నీళ్ళు తెస్తాడు.
వాతావరణం వేడిగా ఉండడం వలన సెవ్తీకి అసౌకర్యంగా అనిపిస్తే, వాడు ఆమెకి విసనకర్రతో వీస్తాడు.తన ప్రియాతిప్రియమైన అక్క తొందరగా కోలుకోవాలని అతని కోరిక. తను ఒక్కడే ఆటలాడుకోలేడు కదా!
బండి వదలగానే, వాడు అక్క ప్రక్కకి పరుగెడతాడు. ఆమె ప్రక్కన కూర్చుని కథలు చదివి, వినిపిస్తాడు. సెవ్తీ ఆ కథలన్నీ ఆసక్తిగా వింటుంది,సంతోషిస్తుంది.
నిన్న సాయంత్రం సెవ్తీ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె బిగ్గరగా మూలగడం ప్రారంభించింది. భోండూ కి భయం వేసింది. దేవుడు చాలా దయామయుడని తన తల్లిదండ్రులు చెప్తుంటే, అతను విన్నాడు. ఒక చిన్న బాలుడి ప్రార్థన అతను ఆలకించడా?
కోవెలలో పూజలు ప్రారంభం కాగానే, వాడు అక్కడికి చేరుకుని, దేవుడి విగ్రహం ముందు మోకరిల్లేడు. “ దేవుడా! నువ్వు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటావు. దీంతో చేసి, మా అక్కయ్య కి తొందరగా నయం చెయ్యి.”




















