ఇప్పుడిక ప్రయాణంలో వెనకడుగే వేయాల్సిన సందర్భంలోకి వచ్చి చేరాము. చిన్న కథనాలకు parallelగా చాలా విస్తృతి వుంటుంది. విభిన్నతే విస్తృతికి మూలం కూడా. ఆ విభిన్నతలో పాత్రల విశిష్టమైన యాక్షన్ వల్లనే పాత్రల రూపురేఖలు unique గా బయటపడి వుంటాయి. అప్పుడే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన అస్తిత్వంతో ఆకర్షించడం మొదలుపెడతాడు. ఇండ్ల చంద్రశేఖర్ కథలలో స్పష్టంగా అవగతం అయ్యే పాత్రల్లాగా. ఈ పాత్రలు ప్రపంచానికి చెందిన పాత్రలు. అవి ఎంత దిగువ జీవిత వాస్తవాలను మూటగట్టుకొని వచ్చాయో అంత విలువైన సత్య ఖనిజాల లాంటి వాస్తవాలు. అందుకే ఇవన్నీ అల్ప కథనాలలోని అనల్ప జీవన వాస్తవాల కథలని కూడా అంగీకరించక తప్పదు.
ఈ కథలలో మనం పాఠక సావాసం చేసే క్రమంలో ఏం ఒనగూడుతుంది అన్నది ప్రధానమైన చర్చ. చర్చ అంతా అంతరంగం నుంచి వాకిలి గడప మీద కూర్చొని పాఠకుడు ఔట్సైడ్ వరల్డ్ తో సోషియా పొలిటికల్ senses తో ముచ్చట్లు పెట్టుకునే చర్చగా నాకు తెలిసొస్తుంది అనివార్యంగా రచయితకిక్కడ ఏ అస్తిత్వమూ లేదు. అతని శూన్యం కూడా వుండదు.
ఈ కథలన్నీ నాకు రక్తమాంసాల ప్రవాసం ఉన్న జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. మంచి వచనాన్ని చదివి అందులో మునిగిపోయి ఈతలు కొడుతున్నప్పుడు కవిత్వానుభవము వచనానుభవము కలగలసి గొప్ప వాచకానుభవాన్ని అందిస్తున్నాయి. తద్వారా కలిగే పఠనానుభవం మనను michro histories వైపు దారి పట్టేలా Grand narretives ని పగులగొట్టుకొని బయటకు వచ్చేలా దారిని సుగమం చేస్తున్నాయి, “మ్యాజిక్ ఇఫ్” కథల్లోని శక్తి అంతా అధ్వితీయానుభవ జీవశక్తి అని నేను అనుకుంటున్నాను. ఈ కథలు inversion తో మనల్ని చకితపరిచే మానవానుభవాలకు తలుపులు తెరుస్తున్నాయి. కథల్లోని సంభాషణలన్నీ invesion లోనే వెలుగులను మూస్తుంటాయీ కూడా. మనకు అవగతం కావాలంటే మనకు కొంత ఆధునిక నాటకంలోని ప్రేక్షకానుభవం ఉంటే ఇంకా ఎక్కువ immersion కి లోనవుతామని అనిపించింది కూడా. అందుకే ఇందులో కథలు, నాటకం, గానం, నెత్తురు నిప్పులతో మూడు కాలాలను పేని magicle గా అల్లుకుంటూ నేసిన కథల నేత అని అనిపిస్తుంది.
ఒక్కో కథ చదువుతున్న కొద్ది పాఠకుడు గాఢంగా పారదర్శకంగా తయారవుతూ ఉండాలి. మన లోపల వ్యక్తమవ్వకుండా వదిలి వుంచిన భాగాలన్నీ, ఆ కథలో అనేక Art Forms ద్వారా కదిలి జీవస్థిత్వాన్ని పునర్లిఖించగలగాలి. అది వాస్తవ పఠనంలోని self consuming Act గా రూపొందుతూ మనిషి లోపలి వైబ్స్ ని జీవయోగ్యంగా మారుస్తూ మనిషిని ఉన్నతంగా మారుస్తూ పోతుంటుంది మంచి పఠనం వాచకాన్ని నిరంతరం శుభ్రపరుస్తూనే వుంటుంది.
కథలు michro histories నీ గడప గడపకూ వెలిగిస్తూనే పోవాలిపుడు, కళాకారుల చారిత్రక కల్పనలో michro చరిత్రలు పెద్ద పాత్ర నిర్వహిస్తాయి. ఊరి ఊరికి ఒక వ్యక్తిలోని జ్ఞాపకాలతో కథా కల్పన ఉంటుంది. చెరువుంటుంది చెల్క ఉంటుంది, పని ముట్ల జీవముంటుంది. వాడి నాడి భాష వుంటుంది. మన సమూహాల ఏకరూప వచనముంటుంది. దిగువ గాథల కథనముంటుంది. ఈ కథలన్నీ కూడా Michro histories నీ గురిపెడుతూ గ్రాండ్ కథనాలకు ( అగ్రకులీన పాలక) నిప్పు పెడుతూనే ఉంటాయి.
ఈ సంపుటిలోని కథలన్నీ కూడా జీవభూమిలోంచి అడుగులు వేస్తూ రావడం వల్ల దిగువ కుల సమూహ అనుభవాల్లోంచి ముచ్చట్లు పెడుతుండటం వల్ల మైక్రో హిస్టరీస్ లోని పుటలుగానే భావించాలి. ఈ కథల సారం కేవలం జ్ఞాపక జ్వరాలలోని మూలుగు కాదు. ఒక స్థలానికి ఒక ఊరుకు ఒక నిశబ్దానికి ఒక నమ్మకానికి ఒక beingness కీ సంబంధించిన కథలు. ఏ కథకు ఆ కథ ప్రత్యేకమైన భాష కలిగివున్న కథలు. ఎంచుకున్న కంటెంట్ ను అనుసరించి భాషను ఎంచుకుంటూ పోతుంటాడు ఇండ్ల చంద్రశేఖర్. ఆయా స్థలకాలాలో భాగమైన గ్రామీణతలోని కుల జీవం తొణికిసలాడుతూ ఉండటం ఈ కథల ప్రత్యేకత.
“మన కుటుంబాల్లో మనకు కావాల్సిన మనుషులెందుకు ఎడతెగకుండా గుర్తుకు వస్తుంటారు. గుండెలో గరిటపెట్టి తిప్పుతున్నట్టు, బాధలో పేగులు కోసుకు పోతున్నట్టు ఎన్ని కన్నీళ్లు కారుతున్న దూప పెరుగుతుంది కానీ అన్నం తిన్నా తినకపోయినా గుర్తుండదెందుకు” అనే అనుభవాన్ని తెరగట్టి ఆరవేస్తాడు ముళ్లు వంటి కథతో చంద్రశేఖర్. అందుకే his essence is true self అని అనాలనుంటుంది. అందుకే మనలోని rational arguments ని కూడా బద్దలు కొట్టే short narratives ఇదంతా. ఇందులో రచయిత కాఫ్కా లాగా మనలో బలంగా వుండే emotions paradox నీ గాయం చేస్తూ వుంటాడు pure irrationality తో.
ఆధునిక నాటకం యొక్క జీవకృతిని ఆకృతపరిచి నిలిపే వాస్తవ సన్నివేశాలను బహు వాస్తవంగా staging చేస్తుంటాడు కథకుడు. Paradox నీ కళాత్మకంగా వెలిగిస్తుంటాడు. మనలోని విచ్ఛిన్న రూపాలకు సాధికారత కలిగించపూను కుంటాడు. కథల్లో అతివాస్తవముంటుంది. individuel wholeness లోకి సమూహ వాస్తవాల వికేంద్రీకరణ ఉంటుంది. కనుమరుగయ్యే మనిషి తాలూకు విశ్వ విస్ఫోటనం వుంటుంది. పాఠకుడిలోని social and politicle prophesis ని తగలబెట్టే అతి వాస్తవ వ్యగ్రత ఉంటుంది. అన్ని కథల్లో మ్యాజిక్ ఇఫ్ వంటి కథను చదివిన తరువాత అనిపించింది.
అదే కాకుండా రంగుల చీకటి, నాటకాలయనింట్లో పాము, సారి ఇలవరసన్ వంటి కథలు మన గత తెలుగు పాఠకానుభవాన్ని వినిర్మాణం చేసి తిరిగి మన పాఠక జ్ఞానాన్ని జీవరసవంతం చెయ్యగల కథలు అని అనిపించడంలో Hyperbole expression వుందని అనిపించినా నేనేమీ అనుకోను. ఈ కథలను చదివిన తరువాత పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారివంటి, మా గోఖలే వంటి, రంధి సోమరాజు, అల్లం రాజయ్య, నాగప్పగారి సుందరరాజు, కేశవరెడ్డి, శప్తభూమి స్వామి వంటి, లోయ అజయ్ ప్రసాద్, మెహర్ ల దాపు మీదుగా వెళ్తూ, జూపాక సుభద్ర వైపు తిరిగి కరిగీ, కృపాకర్ మాదిగ కక్క వేముల ఎల్లయ్య వరకు వచ్చి తొవ్వలో నిలబడి ఎదురు చూస్తుంటే తన జీవ భాషతో ఇండ్ల చంద్రశేఖర్ ఎదురొస్తూ కనపడుతున్నాడు. ఇండ్ల చంద్రశేఖర్ ని మన సాంస్కృతిక మూలాల్లోకి కథాగానం చెయ్యమని నూతన జీవ పాఠకులమై సన్నద్ధంగా ఆహ్వానించాలి.
But the tool he uses in order to recollect himself is strangely, the very element of forgetfulness: writing.
The Essential Solitude Maurice – Bralanchot.

కవి సిద్ధార్థ
కవి సిద్ధార్థ తెలంగాణ అగ్రశ్రేణి కవులలో ఒకరు.
గతంలో దీపశిల, బొమ్మలబాయి కవితా సంపుటాలు తెచ్చారు. సినిమారంగంలో పని చేస్తున్నారు.
స్వగ్రామం నల్గొండజిల్లా పోచంపల్లి దగ్గర చినరావులపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
