శూన్యమూ, నిశ్శబ్దమూ కంటే
వాటి ఉనికిని గూర్చి ఊహే
వ్యాకులపరుస్తోంది
తెలీని అలజడేదో
అస్థిరంగా ఉంచుతోంది
ఏదో ప్రసవానికి
సిద్ధమౌతున్నట్టు
వేదనామయ యాతన
చేయాల్సిన పనుల జాబితా
విడవని పాశంలా బిగుస్తోంది
అనేకానేక
అకారణాలతో
కళ్లు చెమరిస్తూనే ఉన్నాయి
విరామాల నడుమ
వాంఛ పడగ విప్పుతోంది
చీకటిని పీల్చుకున్న గోడలు
చెప్పే ఓదార్పు కథలు
వింటోంది ఆగిపోయిన గడియారం
గతరాత్రి అశాంతిని
అనిద్రనీ చెత్తబుట్ట మింగేసింది
ముసురు పట్టినపుడు…
