నేనో కవితా పాదం చెప్పాను
మెచ్చుకుంటావని ఆశించాను
నువ్వేమో 'నువ్వు చాలా అందంగా ఉన్నావ్' అన్నావు
నేను కవిత చదివి వినిపించాను
చప్పట్లు మోగుతాయనుకున్నా
నువ్వన్నావూ.. ఈ రంగు నీ ఒంటికి బాగా నప్పిందని
ఎప్పుడైనా కళ్ళు మూసుకుని చెవులతో మాత్రమే విని చూడు
నా మాటలకూ విలువైన అర్థాలున్నాయి
నేనెలా ఉంటానో చెప్పేందుకు
నా ఇంట్లో చాలా అద్దాలున్నాయి
హిందీ మూలం : మేరే ఘర్ మే బహుత్ సే ఆయినే హై
మూల కవి : నేహా రోడా
తెలుగు అనువాదం: ఫణిమాధవి కన్నోజు
నా ఇంట్లో చాలా అద్దాలున్నాయి…
