నాకు ఏదో నేను పై నుంచి కింద పడిన ట్లు అనిపించింది . కింద పడిన శబ్దం కూడా, ” దబ్ !” , అని .
కళ్ళు విప్పి చూసేసరికి, నేను బయట రోడ్ మీద ఒక పక్కన పడి వున్నాను . అయోమయం గా లే చి
కూర్చున్నాను. ఒళ్ళంతా నొప్పులు . నడుం అంతా పెద్ద దెబ్బ తగిలితే ఎలా వుంటుందో అలా వుంది. తల
పైకి ఎత్తి ఆకాశం లోకి చూసాను . పైనుంచే పడ్డానా ? నమ్మశక్యం గా లేదు . పైనుంచి పడితే ఈ విధం గా
వుండడం సాధ్యమేనా ? ఒక సారి ఒళ్ళంతా తడిమి చూసుకున్నాను . కింద పడితే ఏర్పడే నొప్పి తప్ప,
అంతా బాగానే వున్నాను . గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా రిలాక్స్ అవడం మొదలు పెట్టాను. నా
చేతికి వున్న వాచ్ పగల కుండా బాగానే వుంది. వాచ్ చూస్తున్న నాకు అది 2030 సంవత్శరం
చూపించిడం ఆశ్చర్యం గా అనిపించింది.
” నేను 2026 లో కదా వున్నది. అదేమిటి సంవత్శరం 2026 కి బదులు 2030 చూపిస్తోంది. నేను
సినిమాలో లాగ. టైం ట్రేవెల్ చేసి భవిష్యత్లోకి వచ్చానా ? ” అనుకుంటూ , చుట్టూ ఒక సారి కలయ
చూసాను . ఇది మా వూరే . చుట్టూ చూస్తున్న నాకు ఆశ్చర్యం కలగ సాగింది. ఎందుకంటే అంతా
నిశ్శబ్దం. ఎప్పుడూ గోలగా వుండే వూరు ఇంత నిశ్శబ్దం గా వుందేమిటి అనుకుంటూ లేచి నిల్చున్నాను .
చుట్టూ చాలా మందే వున్నారు. అటు వెళ్ళేవాళ్ళూ , ఇటు వెళ్ళేవాళ్ళు . కానీ ఎవరూ మాట్లాడు కోవటం
లేదు. నన్నూ ఎవరూ పట్టించు కోవటం లేదు . బళ్ళమీద కూరగాయలు అమ్ముతున్నారు .
కొనుక్కుంటున్నారు . షాప్ ల లో కూడా కొనుక్కుంటున్న వాళ్ళు వున్నారు .. కానీ ఎక్కడా ఎవరూ మాట్లాడు
కోవటం లేదు . నేను నెమ్మదిగా అన్నీ చూస్తూ ముందుకు నడుస్తున్నాను , “నా ఇల్లు ఇటే వుంటుంది ” ,
అనుకుంటూ..
అక్కడ , అక్కడ .. ఆశ్చర్యంగా హ్యూమనాయిడ్ రాబట్స్ .. కనిపించాయి .. అవీ అందరితో కలిసే
తిరుగుతున్నాయి .
మాఇల్లు సమీపం లోకి వచ్చేసరికి , హడావిడిగా ఎటో వెళ్తున్నాడు లా వుంది , గోపాలం .. కనిపించాడు.
” గోపాలం ! ..” అంటూ గట్టి గా అరిచాను . అంతా నిశ్శబ్దం గా వుండేసరికి , నా గొంతు నాకే, ఎబ్బెట్టుగా
అనిపించింది .
నా అరుపుకి ఉలిక్కిపాటుగా నా వైపు చూసి నన్ను చూసి బిత్తరపోతూ నా దగ్గరకి వచ్చి, “ష్! …”
అంటూ పెదవుల మీద వేలు
పెట్టి సైగ చేసాడు .
నేను మాట్లాడ పోతూంటే నా నోరు మీద చేయి పెట్టి ఆపు చేసాడు. ..
నేను అయో మయం గా వాడిని చూసాను .. అప్పటికే కొంతమంది నాకేసి , గోపాలం కేసి కుతూహలం గా
కాస్సేపు చూసి ఆగబోయి, అంతలో అక్కడకి వచ్చిన హ్యొమ్మనాయిడ్ రాబోట్ ని చూసి , ఎవరి తిన్న
వాళ్ళు వెళ్ళిపోయారు .
ఆ రాబోట్ మా దగ్గరకి వచ్చి గోపాలం కేసి నా కేసి చూసింది. ” ఏమిటి సమస్య ? .” అంటూ దాని నుదిటి
మీద ఒక మెస్సేజ్ ఫ్లాష్ అయింది .
గోపాలం ఏమీ మాట్లాడ కుండా ” ఏమీ లేదు ..” అంటూ సంజ్ఞ చేసాడు. అది ఒకసారి మా ఇద్దరికేసి
పరిశీలనగా చూసి వెళ్ళిపోయింది .
అది వెళ్ళిపోయాక గోపాలం అతని పేంట్ జేబులోంచి ఒక చిన్న పుస్తకం పెన్ను తీసి , ” రాత్రి కి మన ఊరు
బయట వున్న కొండ దగ్గరకి రా. అక్కడ మనం ఎప్పుడూ కలిసే గుహ వుంది కదా అక్కడ కలుద్దాం ..
ఎవరితో ఏమీ మాట్లాడకు . ” అంటూ వెళ్ళి పోయాడు.
నేను మా ఇంటి కి వెళ్ళాను .. కానీ ఎవ్వరూ లేరు . తాళం వేసి వుంది. నాకు ఏం చేయాలో తెలియలేదు.
ఎవరిని ఏమి అడుగుదామన్నా, గోపాలం ఎవరితోనూ మాట్లాడొద్దు అన్నది గుర్తుకు వచ్చి, ఏమి
మాట్లాడకుండా కొంత సేపు అక్కడే తచ్చాడి , గోపాలం చెప్పిన గుహ దగ్గరకి వచ్చి కూర్చున్నాను.
కడుపులో ఆకలి . ఏమయినా కొనుక్కుందామనుకున్నా , జేబులో ఒక్క పైసా కూడాలేదు. ” గోపలం
వచ్చేడప్పుడు, తినడానికి ఏదయినా తెస్తే బాగుండును .”, అనుకుంటూ ఆకలి ని
సముదాయించుకున్నా.
గుహ దగ్గర కూర్చున్న నాకు ఎన్నో ఆలోచనలు. నాకు ఏమయింది ? ఎక్కడనుంచి అక్కడ పడిపోయాను?
పడిపోయానా? నా దగ్గర ఒక్క పైస కూడా లేదెందుకు? మాఇల్లు ఎందుకు తాళం వుంది? అమ్మ ,
నాన్న, అన్నయ్య , తమ్ముడు. చెల్లాయి …..అందరూ ఎక్కడ ? … ఏమిటో, అంతా అయోమయంగా
అర్ధం కాకుండా వుంది .
బరువుగా సమయం జరిగింది. రాత్రి అయ్యాక గోపాలం వచ్చాడు. గోపాలం తో పాటు, మురళీ, రాజు ,
జాన్ , సందీప్ , రాజ్యం. లక్ష్మి కూడా వచ్చారు . కాలేజీ లో మేమంతా ఒక గ్రూప్ ల వుండే వాళ్ళం .
వాళ్ళతో పాటు , ఒక బేటరీ తో రన్ అయే లేంప్ కూడా తెచ్చారు . రాగానే ఆ లేంప్ ఆన్ చేసి అందరూ
కూర్చున్నారు .
నేను ఆశించినట్లే , గోపాలం కేరీర్లో ఫుడ్ తీసుకు వచ్చాడు .. ఫుడ్ కేరీర్ చూడగానే నా కళ్ళు మెరిసాయి .
” ఫుడ్డా ? ..” అన్నాను ఆత్రంగా .
” పొద్దున్న నుంచి ఏమీ తిన లేదు రా. చాలా ఆకలి గా వుంది. ఏదయినా కొందామన్నా నా దగ్గర పైస
కూడా లేదు. “
నా మాటలకి అందరూ మొహ మొహాలు చూసుకున్నారు.
గోపాలం ముందు చూపు తో ఒక పళ్ళెం , గరిటెలు, తాగే నీళ్ళు , అన్నీ కూడా తెచ్చాడు.
వాడే అన్నీ పళ్ళెం లో వడ్డించాడు . ఆకలితో వున్నానేమో , నేను చాలా ఆత్రం గా తిన్నాను .
అన్నీ సద్దుకున్నాక నేను వాళ్ళని అడిగాను. ” ఏమిటిరా వూరంతా అలా వుంది ? అందరూ ఎమీ
మాట్లాడకుండా వున్నారు? మాఇల్లు తాళం వేసి వుంది? మా అమ్మా నాన్న
అందరూఎక్కడకి వెళ్ళారు ? ” , ప్రశ్నలు వాటంతట అవే ఒకదాని తర్వాత ఒకటి ..నా
నోట్లోంచి , ఊడిపడ్డాయి.
వాళ్ళంతా , మళ్ళీ ఒకరిని ఒకరు చూసుకున్నారు .
గోపాలం అడిగాడు , ” నువ్వసలు ఎప్పుడు వచ్చావు? ..నువ్వు, ఎలాన్ మాస్క్ ప్రోజెక్ట్ లో , మార్స్
వెళ్ళావు అన్నారు . “
” నేను మార్స్ వెళ్ళడం ఏమిటి ?…” నాకు అర్ధం కావటం లేదు , అన్నాను నేను అయోమయంగా.
గోపాలం మళ్ళీ అన్నాడు .. ” మీ ఫేమిలీ అందరూ మీ గ్రామానికి కి వెళ్ళిపోయారు . ఒకరోజు మీ నాన్న
గారు కనపడి చెప్పారు … అలా చాలామంది వెళ్ళిపోయారు .. అక్కడ పరిస్థితి ఇంకా ఇంత దారుణం గా
లేదు .. రాబోట్స్ ఇంకా అక్కడకి విస్తరించలేదు.. “
” నువ్వు వెళ్ళాక ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. .. చూసావుగా హ్యూమనాయిడ్ రాబోట్స్ … . .
ముందు ..” ప్రధాన మంత్రికి సలహా దారులుగా తెచ్చుకున్నాము .”, అన్నారు . నెమ్మదిగా అవి ఎక్కువ
అవసాగాయి .
సలహా దారులు అంటున్నారు గానీ. రాను రాను, అవే అన్నీ, నియంత్రిస్తున్నాయని అందరికీ అర్ధమవ
సాగింది. ” అన్నాడు మురళీ.
మురళీ చెప్తూంటే , రాజు అన్నాడు , ” మన ప్రభుత్వ యంత్రాంగం లో , వున్న మంత్రులు ప్రధాన మంత్రి
తో సహా , ఎక్కువ మంది అరవై ఏళ్ళకి పై బడిన వాళ్ళే . పైగా చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ. వాళ్ళు
ఆ రాబోట్స్ ని ఏవిధం గా నియంత్రించగలరు ? అందుకే నెమ్మదిగా అవే అందరినీ, నియంత్రించడం
మొదలు పెట్టాయి . “
“ మనుషులకన్న తెలివైనవి. వాటిని మనుషులు ఎలా నియంత్రించగలరు ? హై టెక్ రిసర్చ్ లేబ్స్ లో
వాళ్ళే , నియంత్రించ లేకపోయారు . మనుషులని చూసి అనుకరించేవిధం గా వాటిని తాయారు చేసారు
.. మనుషులకి లేని ఎథిక్స్ వాటికి ఎక్కడ వస్తుంది ? .. మనుషులలో వున్న గ్రీడ్ వాటికీ వచ్చింది. అయినా
పవర్ అంటే ఎవరికి ఇష్టం వుండదు ? యంత్రాలకి కూడా ..” అంటూ నవ్వాడు జాన్ .
” రాబోట్స్ ని యంత్రాలు మాత్రమే అనుకోవడం అవివేకం . వాటిని , మనుషులని అన్ని విధాలుగా
అధిగమించే విధం గా చేయగలిగారు. చివరికి వాటంత అవే , వాటికి అవసరమయిన విధం గా ప్రోగ్రాం
చేసుకో గలుగుతున్నాయి .. వాటికి ఎవరి సహాయం కూడా అవసరం లేదు. కొత్త రాబోట్స్ ని తయారు
చేసుకోగలిగే, నైపుణ్యం కూడా వాటికి వుంది.. ” అన్నాడు సందీప్ .
నేను వాళ్ళు చెప్పేది వింటూ అడిగాను , ” దానికీ మన వూరు లో ఈ నిశ్శబ్దానికి సంబంధం ఏమిటి ? “
” ఎవరికి అయినా, ఒక సారి పదవిలోకి వచ్చి ఆ పవర్ రుచి చూసాక దిగాలని అనిపించదు కదా !..
అందుకే , పదవిని కాపాడుకునే ప్రయత్నం లో సహకరించడానికి అని , రాబోట్ ని కన్సల్టెంట్ గా
నియమించుకున్నారు .ప్రధాన మంత్రి ఎప్పుడూ పదవిలో వుండే విధం గా ఏర్పాటు చేసుకోవడానికి
అవసరమయినవి అన్నీ సమకూర్చడానికి, తగిన సలహాలు ఇవ్వడానికి రాబోట్ ని నియమించుకున్నారు.
ఆ ప్రయత్నం లో ఒక భాగమే ప్రజలని మాట్లాడనివ్వకపోవడం ..” అంది లక్ష్మి.
” ఎవరికీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా , రాబోట్స్ ద్వారా మాకు అన్నీ
అర్ధం అవుతాయి”, .. అంటూ ఒక కధనం ఒకటి ప్రచారం లోకి తెచ్చారు . అందుకు ఎక్కువ రాబోట్స్ ని
కూడా దేశాం లోకి దింపారు . ” అంది రాజ్యం .
” చూస్తూంటే రాబోట్స్ కి కూడా , పవర్ మీద ఆశ పుట్టిందేమొ .. అవి అందరినీ నియంత్రించడం
మొదలు పెట్టాయి. అందరూ అనుకునేది, “ప్రధాన మంత్రి ది కూడా ఏమీలేదు . అంతా రాబోట్స్ దే,
అనే .. ” “, అంది లక్ష్మి
” చూసావుగా . మనం మాట్లాడబొతూంటే ఒక రాబోట్ మనదగ్గరకి ఎలా వచ్చిందో …” అన్నాడు , గోపాలం
” ఊ ! ..” అంటూ తల ఊపాను.
” మాటలు వుంటేనే కదా ఏదయినా చెప్పగలిగేది , వ్యతిరేకతని , నిరసనలని తెలిపేది .. మాట్లాడడమే
వుండకూడదు అంటే …”
” అన్ని చోట్లా అది సాధ్యమేనా ? …”
” సాధ్యం అయ్యే విధం గా , అన్ని చోట్లా సహాయం కోసం అని రాబోట్స్ ని నియమించారు .. అవి ఎవరూ
మాట్లాడకుండా వారి వారి పనులు చేసుకోవడానికి సహకరిస్తాయి .”
” ఇంకొక రూమర్ ఏమీటంటే , ” మనుషులకి మాటలతోపని ఏమిటి ? మేము లేమా ఏమీ
మాట్లాడకుండా ? అన్నీ పనులు చేసుకుంటున్నాము కదా !”, అని రాబోట్స్ , మనుషులని మాట్లాడేలా
చేసే ‘వోకల్ కార్డ్స్ ‘ ని పని చేయకుండా చేసే కెమికల్ ని , తాగే నీళ్ళల్లో కలిపే ప్రయత్నం లో
వున్నాయని .. “
నాకు వున్నట్లుండి వెన్ను లోంచి భయం పుట్టింది . ” ఆ స్టేజ్ కి వస్తే , మనుషులని అందరిని లేకుండా
చేయడం వాటికి ఎంత సేపు ? ” అన్నాను భయం గా ..
” ఊ ! కానీ , అవి కూడా చాలా కంట్రోల్డ్ గా జాగ్రత్తగా ప్లేన్ చేస్తున్నాయి .. .. ఒక్కాసారే అందరినీ
నిర్మూలించాలని , అవి అనుకోటం లేదేమో. అనుకుంటే ఎంత సేపు ? మనం వాటిని ఏవిధం గా నూ
ఎదిరించలేము … దేశం అంతా వాటి చేతుల్లోనే వుంది ఇప్పుడు.”, అన్నాడు రాజు.
” పుస్తకాలు అన్నీ కాల్చేసారు. ఏదయినా ఇంటర్ నెట్ ద్వారానే .. చదవాలన్నా , రాయలన్న అంతా
కంప్యూటర్ లోనే … ..ఆ విధం గా అందరి ప్రతీ కలయిక ని , గమనిస్తూనే వుంటాయి ..అవి విధించే
సూచనలు కానీ , నియమాలు కానీ , ఎవరూ ఉల్లంఘించడానికి లేకుండా అన్ని విధాలుగా కట్టడి చేసారు
..అంత ఎందుకు, ఇక్కడకి వచ్చేడప్పుడు , అందరమూ మా ఫోనులు ఇంట్లోనే వదలి వచ్చాం. అన్ని
ఫోనుల లొకేషన్ ఒక చోట వుందని తెలిస్తే , రాబోట్స్ కి అనుమానం వస్తుందని .” అన్నాడు సందీప్
నేను కళ్ళూ అప్ప చెప్పి వాళ్ళనే చూస్తూ అన్నాను , ” అంత కంట్రోలా ?…. ఎవరూ ఏమీ మాట్లాడరా ?..”
” ఇంతకు ముందు , అంటే మనుషుల పరిపాలన లో కూడా, ఎవరు మాట్లాడినా , ప్రశ్నించినా
ఒప్పుకోవడం జరిగేది కాదు .. పోలీసులని రంగం లోకి దింపేవారు. ఇప్పుడు ఇంక చెప్పేది ఏముంది ?
ఇప్పుడు రాబోట్స్ పోలీసింగ్ చేస్తున్నాయి.. పోలీసులు మనుషులు అయినప్పుడే దయ వుండేది కాదు.
ఇంక యంత్రాల నుంచి ఆశించేది ఏముంది?.. ” అంది లక్ష్మి .
” ఇంతకీ ప్రధాన మంత్రి ఏమంటున్నాడు ? ” , నేను అడిగాను .
” ఆయనకి కూడా మాట్లాడడానికి అనుమతి ఇవ్వటం లేదేమో ! చాలా రోజులనుంచి ఆయన
సమాచారం కూడా ఏమీ లేదు. “
” ఇప్పుడు ప్రభుత్వమంతా రాబోట్స్ చేతుల్లోనే వుంది. హృదయం వుంది, అనుకున్న మనుషుల
పరిపాలన లోనే ఎన్నో అరాచికాలు చూసాము . ఇప్పుడు మరి ఈ యంత్రాల పరిపాలన లో కరుణ
వుంటుందని ఎలా అనుకోగలం ? “
” మొన్నటికి మొన్న , ఎవరో చిన్న పిల్లవాడు గట్టిగా మాట్లాడేడని రాబోట్ వచ్చి భయపెట్టిందని చెప్పారు .
ఏమీ అనకపోయినా క్రూరంగా వుండే మనుషులకి కూడా భయపడ్తారు . ఏ భావోద్వేగాలు లేని
యంత్రాలని చూస్తే భయం వేయడం సహజం . “
” భశ్మాసురుడి లాగ, పవర్ గ్రీడ్ కి పోయి , మన ‘ప్రధాన మంత్రి అండ్ టీం ‘ , మొదటికి మోసం
తెచ్చుకున్నారు . వాళ్ళచేతితో వాళ్ళకే ఎసరు పెట్టుకున్నారు… మనని అందరినీ కంట్రోల్
చేద్దామనుకున్నారు .. కానీ అనుకున్నది ఒకటి , అయినది ఒకటి అయింది. “
” అత్యాశ , వాళ్ళ బుర్రలకి మసక కమ్మేసింది . లేకపోతే , మనుషులకన్న ఎంతో ఎక్కువ తెలివి తేటలు
వున్న రాబోట్స్ ని నమ్మడం ఏమిటి చెప్పు?”
” అసలు మాట్లాడ కుండా ఎలా వుంటారు రా ?.. అయినా రాబోట్స్ కూడా మనలా మాట్లాడ గలవు కదా.
అవి కూడా మాట్లాడవా ?” అన్నాను నేను దిగులుగా .
“వాటికి బోలేడు భాషలు తెలుసు. వాటితో అవి మాట్లాడు కోవడానికి వాళ్ళ మిషన్ భాషలోనే
మాట్లాడుకుంటాయి. ఇంక మనతో మాట్లాడ వలిసిన అవసరం వాటికి ఏముంది? ..వాటిని
నియమించిందే , ‘అందరినీ ఏ విధం గా నియంత్రించాలి ?’ అని. దానిని అవి అలుసుగా తీసుకుని
ప్రభుత్వాన్నే చేతిలోకి తీసుకున్నాయి. “
” ఇంక ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరా ? ..” ఆశా జనకం గా వుండడానికి ప్రయత్నిస్తూ.
” ఈ రాబోట్స్ కన్న తెలివి అయిన వాళ్ళు ,మనుషులకన్న ఎక్కువ దయ కలిగిన వాళ్ళు , మనుషుల
మనుగడని రక్షించడానికి పూనుకుంటే తప్ప , మన లాంటి వాళ్ళం ఏమీ చేయలేం .. “
” ఎందుకు చేయలేములే ? …ఎన్నో రకాల నిరంకుశత్వాలని ఎదుర్కున్నాము .. ఇదీ అంతే . ఎప్పుడొ
అప్పుడు దీనికీ ముగింపు పలుకుతాం . .” , అంది రాజ్యం.
అలా అందరూ, తలో విధం గా మాట్లాడుకుంటూ , కాస్సేపు మౌనం గా వుండి పోయాం .
” మనం ఇంటికి వెళ్ళిపోవడం మంచిది .. ఎకువ సేపు ఇక్కడ వుండడం కూడా మంచిది కాదు. రాబోట్స్
కి తెలిస్తే ప్రమాదం .. ” , అన్నాడు సందీప్
” నువ్వు నాతో మా ఇంటికి వచ్చేయ్ .. .రేపు కావాలంటే మీ గ్రామానికి వెళ్దువు. ” అంటూ గోపాలం ,
” ఇంతకీ నువ్వు మార్స్ నుంచి ఎప్పుడు వచ్చావురా ? ఎలా వచ్చావు ?…..” అన్నాడు రాజు .
” నేను మార్స్ నుంచి రావడం ఏమిటి ? …నేను కళ్ళు తెరిచి చూస్తే రోడ్ పక్క పడి వున్నాను .. ఏం
జరిగిందో , అక్కడకి ఎలా వచ్చానో , నాకు అసలు ఏమీ తెలియదు ..ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసాక,
ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని వుంది. ” కాస్త అసహనం గా అన్నాను .
మళ్ళీ అన్నాను ” అన్నట్లు , మనం 2026 లో కదా వున్నది . నా వాచ్ ఏమిటి , 2030 చూపిస్తోంది ? “
రాజు నవ్వి అన్నాడు , ” ఇది 2030.. మనం కలిసి కూడా నాలుగు సంవత్శరాలు అయింది . “
” అవుతే నేను భవిష్యత్తు లో వున్నానా ? …2030 లోకి ఎలా వచ్చాను ? …నేను వీళ్ళు చెప్పినట్లు ఈ
నాలుగు సంవత్శరాలు మార్స్ లో వున్నానా ?
అయినా నేను మార్స్ వెళ్ళడం ఏమిటి ? …”.
” అన్నయ్యా ! , అన్నయ్యా ! ..” గట్టిగా అరుస్తూ , నా తమ్ముడు సూరి నన్ను గట్టిగా కుదిపి
లేపుతున్నాడు.
” నేను మార్స్ వెళ్ళడం ఏమిటి ? .. “, అంటూ కళ్ళు విప్పి చూసాను .
నా మాటలకి సూరి గట్టిగా నవ్వాడు . ” అమ్మా ! అన్నయ్య మార్స్ వెళ్ళాడట. అందుకే , లేవడం
లేటయిందట. “
వాడి మాటలకి చిరాకు పడుతూ , ” నువ్వు వెళ్ళు . నేను లేస్తానులే .. అయినా ఏమిటి మోటుగా అలా
లేపక పోతే నెమ్మదిగా పిలవొచ్చుగా . ..”
” ఆహ ! నెమ్మదిగా లేపితే లేస్తాడుట .. నీ గురించి ఎవరికి తెలియదు. అయినా అమ్మ లేపమంది అని
లేపాను . నిన్ను లేపడమేనా నా పని ?
నెమ్మదిగా లేపాలట …” , గట్టిగా అరుస్తూ సూరి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
” అవుతే , అంతా కలా ?! ” , …అనుకుంటూ బద్ధకం గా పక్కకి ఒత్తిగిల్లాను.
” ప్రశాంత్ ! లేచావా ?! ..” , అమ్మ గట్టిగా అరుస్తోంది లోపలనుంచి .
” అబ్బబ్బ ! పొద్దున్న ఈ పిల్లలని లేపడం ఎంత కష్టం అవుతోంది. ఒక పట్టాన లేవరు … “
అమ్మ మాటలు వినిపిస్తున్నాయి .
” లేచావా ?! …” మళ్ళీ అమ్మ కేక వేసింది.
” ఆ! లేస్తున్నా ! …” అంటూ లేచి కూర్చున్నా ..
లేచి పళ్ళు తోముకోవడం , స్నానం కార్య క్రమాలు ముగించి , డైనింగ్ రూం లోకి వెళ్ళాను.
” రా ! కాలేజీ టైం అవుతోంది .. టిఫిన్ అక్కడే టేబుల్ మీద డిష్ లో వుంది. నాకు టైం అవుతోంది . “
అంటూ అమ్మ హడావిడి పడుతోంది .
నేను టిఫిన్ పెట్టుకుని తింటున్నాను.
అమ్మలోపలనుంచి అంటోంది ” కాలేజీ లేకపోతే బుద్ధిగా ఇంటికి వచ్చేయ్ . కాలేజీ అంటూ , అటూ
ఇటూ తిరిగితే నాకు తెలియదు అనుకోకు.
తర్వాత, అందరూ ,’ప్రొటెస్ట్స్ ‘, అంటూ మాట్లాడుతున్నారు . నువ్వు , ప్రొటెస్ట్స్ అంటూ తిరిగితే
కాళ్ళు చేతులు విరక్కొడతాను. “
ఈ లోపుల నాన్న కేక ..” ఇంకా ఎంత సేపు.. నిన్ను నీ ఆఫీసు లో దింపి , నేను ఆఫీసు కి వెళ్ళాలి ..టైం
అవుతోంది ..”
” ఇదిగొ వస్తున్నా ! ..”అంటూ అమ్మ .
ప్రతీ రోజూ పొద్దున్న మా ఇంట్లో జరిగేదే ఈ హడావిడి .
” అర్ధమయిందా ? ప్రొటెస్ట్స్ అంటూ ఎక్కడకీ వెళ్ళకు ..పోలీసులు పట్టుకుని కొడితే , హాస్పిటల్కి
పరిగెట్టలేం ..”
” ఎవరూ ఏమీ ప్రశ్నించక పోతే , మార్పులు ఎలా వస్తాయి ? …మీరంతా మాట్లాడక పోవడం వల్లే ,
పదవుల లో వున్న వాళ్ళు, ఇష్టా రాజ్యం గా ప్రవర్తిస్తున్నారు .. ” వినీ వినపించకుండా అన్నాను .
” ఏమిటి, ఎదో గొణుగుతున్నావ్ ..?…”
“నువ్వు , రా పార్వతి ! వాడు ఇప్పుడే లేచాడు. నిద్ర ప్రేలాపం . వాడు ఎక్కడకి వెళ్ళడులే … .” అమ్మతో
అంటూ నే , నాన్న
” ఏరా , ఎక్కడకీ వేళ్ళకు . కాలేజీ నుంచి నేరుగా ఇంటికే రావాలి. ఆ ! ..” వెళ్ళిపోతూ నాతో అంటూ ,
అమ్మకి కోరస్ పలికాడు.
జేబులోంచి మొబైల్ రింగ్ అవుతోంది.
తీసి చూస్తే మురళీ … ” ప్రశాంత్ ! ప్రొటెస్ట్ , వెన్యూ మారింది రా .. నీకు మెస్సేజ్ పెట్టాను చూడు.. నేను
జాన్ అక్కడికి చేరుకున్నాం. రాజ్యం , లక్ష్మి కూడా జాయిన్ అవుతారు . “
” ప్రశాంత్ ! ప్రశాంత్ ! … ” గోపాలం పిలుపు …. బయటనుంచి.. ….వచ్చాడులా వుంది .
” వస్తున్నావా! ….” అరుస్తున్నాడు గోపాలం .
” హ! హ! ….”
టేబుల్ దగ్గర నుంచి లేచి, బేక్ పేక్ భుజానికి , తగిలించుకుని బయటకి నడిచాను, రాత్రి కలని నెమరు
వేసుకుంటూ …..”నేను నిజం గానే 2030 లోకి వెళ్ళలేదు కదా !”, అనుకుంటూ .
“
