నశించి పోవు కృశించి పోవు
అక్షరాలా నూరులక్షల వరాలు
లక్షణంగా కోటానకోటి తరాలు
అంతరించవు అంతం కావు
నిరంతరము వెలుగే దివ్వెలు
దగదగ సెగల నిప్పు రవ్వలు
అలసి పోవు సొలసి పోవు
ఎడనెడ కలలకు సాకారాలు
కొండొకచో కళలకు రూపాలు
కసరుకోవు ఈసడించుకోవు
గణనీయత గల్గిన గమ్యాలు
గమనానికి వెలుగు దారులు
అక్షరాలు అనంత రూపాలు
ఔగదే.. జ్ఞానానికి సోపానాలు
ఓ రూప కల్పనకు ఆధారాలు
