కలలు కనే కళ్ళు -1

Spread the love

కలలు కనే కళ్ళు – 1
పిల్లలు ఆలోచించాలి, తమ జీవితాలను మెరుగు పరుచుకోవడానికి తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోగలగాలి. మార్కెట్ నియంత్రణకు చిక్కకుండా తమను తాము కాపాడుకుంటూ వ్యక్తులుగా ఎదగగలగాలి. తమకేం కావాలో వివరించగల స్పష్టత వారికి చేకూరాలి. సామూహికంగా ఆలోచించగల శక్తిని వారు సంపాదించగలగాలి. అందుకే కలిసి ఆలోచించడానికి, కలిసి చర్చించుకోవడానికి, తమను తాము వ్యక్తీకరించుకోవడానికి ఈ చిన్నారులు ‘షార్ట్ ఫిలిం’ అనే మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఒక బృందంగా ఏర్పడి తమ ఆలోచనల వ్యక్తీకరణ కోసం, తమను తాము
కనుగొనటానికి చేసిన ప్రయత్నమే ఈ ‘కలలు కనే కళ్లు’ శిర్షిక సెప్టేంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. తమకు ఏ భయాలు, జడ్జ్మెంట్లు లేకుండా
తోడుగా నిలిచే నేస్తం కావాలని, తమలోని అలజడులను గుర్తించమని అభ్యర్ధిస్తూ ఈ చిన్నారులు మూడు నిముషాల ఈ షార్ట్ ఫిలిం ద్వారా మనందరినీ ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు. వినగల శక్తే ఉంటే బండరాయి సైతం తన కథ వినిపిస్తుంది. విశాల ప్రపంచంలోకి ఇంకా పూర్తిగా అడుగుపెట్టని ఈ భావి
భారత పౌరులు, ఇంకా పూర్తిగా ప్రపంచ స్వార్ధం అంటకుండా తమలోని లాలిత్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నఈ రేపటి తరం తమకేం కావాలంటున్నారో వినండి మరి….
రైల్వే జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా చేసిన షార్ట్ ఫిలిం ఇది. భాష కన్నా భావవ్యక్తీకరణ ముఖ్యం అని నమ్మి తమకొచ్చిన మూడు భాషల్లో షూట్ చేసిన షార్ట్ పిలిం ఇది.

ఈ షార్ట్ ఫిల్మ్ కు పని చేసిన టీమ్
సాహస్ ప్రిన్స్
అభినాష్
నితిన్
పవన్
లోకేష్
పాండ్యన్
అక్షర
వైష్ణవి

ఎడిటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ – సాహస్ ప్రిన్స్


షార్ట్ పిలిం కోసం ఈ లింక్ చూడండి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *