రాకిట్ల పున్నమకు రంగుల ఎన్నీల

Spread the love

రాకిట్ల పున్నమ
అన్నదమ్ములు వాకిట్ల కూసుండి
అక్కసెల్లెండ్ల కోసం
ఆనందంగ ఎదిరిసూత్తరు...
లగ్గం కాని సెల్లెల్లు
ఇంటి నిండా పట్టపగ్గాల్లేని
మమతల మల్లెలు కురిపిత్తరు...

అన్నదమ్ములందరికీ
మట్ట కాడికెల్లి మోసేతు దాంక
ఇట్టమైన రంగుల
పామురపు రాగాలు మొలుస్తయి.‌..
అన్నకు ఆ అనురాగపు దారం కట్టంగనే
సెల్లె గుండెల్లో ధైర్యపు
ద్వారాలు తెరుచుకుంటయి...
అమ్మోల్ల ఇంటికోయి
తమ్మునికి రంగుల బంధనమేయంగనే
అక్క మొకం ఎక్కడ లేని
సంబురం పూసుకుంటది...

ఇయ్యల్ల
అన్నదమ్ముల కాన్నుంచి
సీరెలో సారెలో సిల్లెర పైసలో కాదు
అక్క సెల్లెండ్లు కోరుకునేది...
అచ్చేటి మున్నూట అరువై ఐదు రోజుల
ఆప్యాయతానురాగాల వారెంటీ
గీ రాకిట్ల పున్నమ ఇయ్యాలే
అక్క సెల్లెండ్లకు
ఆత్మీయతాభిమానాల గ్యారెంటీ...
అల్లాడి శ్రీనివాస్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *