మండిపోతున్న ప్రాథమిక సంబంధాలు, రోజురోజుకీ ఇరుకుదేరుతున్న సహచర్యాలు. యాంత్రిక జీవితాలు. నిస్సహాయత. నిస్సంగత. ఏకాకిబోధ. శిలాస్తిత్వం వీటన్నిటి ఫలితం – ఒక Intellcetual melody. Sence of the absurd. అందుకే నీషే జరతృష్ట, హెడెగ్గర్, సార్త్ర్‌ల గుండా కామూ దాకా వచ్చేసరికి సిసిఫస్గా మారిపోతాడు.
కాలస్పృహ మీటే అవిరామ స్మృతులు కవితకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతుంటాయి. కళ్ళెదుటి కటు వాస్తవికతలకి కవిత్వం Crued Spectator అవలేదు. భయానక మీ కాలం. కవి ఉద్విగ్నుడు, విషణ్ణుడు. సంశయం, విశ్వాసం, జీవితం, మృత్యువు, ఆశ-నిరాశ, స్వేచ్ఛ- బాధ్యత లాంటి పరస్పర విరుద్ధాలమధ్య కవి తన చుట్టూ తను తిరుగుతూ, ఒరుగుతూ ఏదో ఒక ప్రశ్న రచించబూన్తాడు. ఏదో ఒక పరిష్కారం వెతికే ప్రయాసపడతాడు. జీవితం నుంచి మరో జీవితం కోసం ఎదురు చూస్తాడు. కోలాహలం నుంచి ఒక్కసారి స్థాణువుల్ని చేసే స్తబ్తత వైపు వెళ్ళదలుస్తాడు. ఆ స్తబ్తత, నిశ్శబ్దత నెత్తురులో ముంచిన పాలపిట్ట శవం లాంటివే కావచ్చు. అధివాస్తవికుల సంక్షుబ్ద సౌందర్యంలా సంక్షుభిత నిశ్శబ్దాలు ఉండొచ్చు.
‘దీపశిల’ కావ్యనాయకుడు తన పోరాటాలకీ వీరోచిత నిష్క్రమణలకీ మధ్య ఎవరి పహరానో ఓదార్పు చేసుకుంటున్నాడు. తన కలలకీ ఉషాంత స్థలాలకీ మధ్య ఎవరి కాలిబాటనో పడవ ప్రయాణం చేసుకుంటున్నాడు. అలా Struggle నుంచి Struggle వరకు (in a will of battles) వేసే ఆడుగులో విశ్రాంతిగా స్రవించే ఒక్క నెత్తుటిబొట్టు కాగోర్తున్నాడు. ఉద్యమించి విఫలత్వాల ఉరికొసల్లోంచి జారిపడి గాయపడ్డ విప్లవకారుడు కాగో కి నీషే Rebellion of the masses, కామూ The Rebel తరహా పాత్ర నిర్వహణలో సంతృప్తి వెతకనారంభిస్తున్నాడు.
అయినా ఏదో తపన. ఏదో ఉద్విగ్నత, ఆరాటం, అలజడి. వీటి లోంచి తన కావ్యతత్వంలో ఏదో ఒక ప్రశ్న ఉత్థాపితం చేయగోర్తున్నాడు కవి. అందుకోసం ఒక అపరిచిత ప్రధాన నడక సాగిస్తున్నాడు. అస్పష్ట భవిష్యత్తుపట్ల ప్రీతి పడుతున్నాడు. కొత్త జడివానల్నీ, కొత్త ఆగమ్యాల్నీ ఆరాధిస్తున్నాడు. “నా ఎంచుకున్న మార్గం తప్పు. నా స్వేచ్ఛ సరయింది కాదు” అని కామూ Caligula లా ఒప్పుకోవలసి వొచ్చినాసరే, చివరికి blunder గా ఋజువైనా సరే “The right to make it” ని ఎంచుకుంటున్నాడు. ఒక దుస్సాసాసిక పధికుడు కాగోరుతున్నాడు.
వ్యవస్థలు కూలిపోతున్న కాలాన, దేశాల రూపాలు ముక్కలయిపోతున్న కాలాన, కొత్త electronic highway Culture లు పుట్టుకొస్తున్న కాలాన కవి విభ్రాంతుడు, విచలితుడు. సగం ఆకృతిలోనే గర్భాశయాలు ఛిద్రమయిపోతున్నాయి. తాత్విక నేరాల ఉరులు బహిరంగంగా ప్రకటించబడుతున్నాయి. ఆశ పెట్టుకున్న సంభాషణలు ఆగిపోతున్నాయి. ప్రదర్శనలు మెల్ల మెల్లగా తొలగిపోతున్నాయి వాయిద్యం తీగల్లోకి ముడుచుకుపోతున్నది. మేధస్సులు ఒలికిన విషాదపు జీరలో ఉత్త వాఙ్మత మాత్రమే మిగుల్తున్నది. ఎటుచూసినా నీరపత. సంశయం. సైద్ధాంతిక దిక్కుతోచని తనం. ఈ దుస్థితిలో పుట్టిన ‘దీపశిల’ కవిలాంటి కవులు ఎవరికివారే కొత్తగా పుట్టి చెరోదిశా నడక సాగించకపోరు. అనేకానేక తాత్విక నదుల్లో దోనెల్లా దొర్లుకుపోయి మానసిక అలజడులకి గురయి “Ii is ideological hunts చేయక మానరు. It is almost impossible to be logical to the bitter ead” అన్న కామూ సిసిఫస్ “to be too Concious is an illness” అన్న దోస్తావిస్కీ ‘పాతాళ కేకలు’, “The highest form of reason borders on Unreason” అన్న మెర్లో పోంటీ అభిప్రాయాలు, ఇంకా రోజిర్ గూడీ, ఎరిక్ ఫ్రోం, విల్హెల్మ్ రీచ్ లాంటివాళ్ళ మాటలు మార్గదర్శకాలు కాకుండాపోవు. ఫ్రాంక్ ఫర్ట్ నవ-మార్క్సిస్టులు, సార్త్ర్, మన శేషేంద్ర శర్మ మాటలు పాటించకపోరు. ఏదో ఒక సంస్థకి, వర్గానికి కట్టుబడి ఉండలేరు. పార్టీ రహిత పార్టీలో సభ్యులు అవగోర్తారు. అనిబద్ధ నిబద్ధత పాటిస్తారు.
ఆత్మాశ్రయ, పస్త్వాశ్రయాల మధ్య సామరస్య ప్రయత్నం చేసారు అధివాస్తవికులు. ‘దీపశిల’ కవి ల రెంటి పరిధుల్ని ధ్వంసించగా ఏర్పడిన ఒకే ఒక్క అయస్కాంత క్షేత్రంలోకి తనదైన ప్రయాస, ప్రణాళిక లోంచి వినూత్న కవితాసృష్టి చేయగలిగాడు. (సరిగ్గా ఇలాంటి పరిస్థితే తనకి ఎదురవ్వగా బోద్లేర్ మహాకవి ఆ రెంటిని ధ్వంసించి తన ‘మలిన పుష్పాలు’లో విశిష్టమయిన ధ్వంసకవితా రచనచేసి కవిత్వంలో వింత ఆధునిక కావ్యశోభ బంధించగలిగాడు.) సైద్ధాంతిక సూత్ర జాలాలకీ! జాగీలాలకీ దూరంగా నిలిచి నైతిక సూత్రాల నేల కొసలకి లొంగి పాదాలాడించే కవిత్వం తెలివి మీరిన తెలుగు కవితా పాఠకుల్ని (అందులో ఎక్కువ మంది కవుల్ని) కదిలించగలుగుతుందవి ఆశాన్వితుడవుతున్నాడు. అంతకు మునుపటిలా గట్టిగా కవిత్వం చెప్పక మెల్లగా చెప్పదలుస్తున్నాడు.
“Revolution has become dystopiar”. కానీ Revolutionaries Withont utopia are Inconceivable”. కనుక అనివార్యంగా చాపుదాకా స్వప్నాల్ని వెలిగిస్తూనే పోవాలి. స్వప్నం తాళం చెవి. అన్వేషణల కొలిమి. ఒకనొక కల దిక్కుగా వర్షంలా పడుతునే ఉండదలుస్తున్నాడు ‘దీపశిల’ కవి. అయితే ఆ కల అస్తిత్వ అన్వేషణ సంబంధి అయినా అవ్వొచ్చు లేదా ఆయుధాల్ని చల్లబరిచే నెత్తుటి బండల దగ్గరిదయినా అవొచ్చు.
“Subject everything to doubt” అనే ప్రశస్తమైన మాట ఉంది. 19వ శతాబ్ది ఆరంభం నుంచే Age of Reasondmg మొదలయింది అంటారు. సమస్తమూ ప్రశ్నలకి గురి అయ్యాయి. ఉనికి, చావు కేంద్రకాలుగా కూడా పరిపరి ప్రశ్నలు లేచాయి. కనక ప్రశ్నల్ని ఎన్నటికీ మానొద్దు. ప్రశ్నలతోనే మనం జన్యుగర్భాల సానువుల్లోకి స్వేచ్ఛగా ప్రసరిస్తాం. ప్రశ్నేకదా మన ఉనికి లోతులోతుల్లో అలుముకుపోయింది అంటాడు కవి. అస్తిత్వాన్ని విద్యుత్తులో స్నానం చేయిస్తాడు. అస్తిత్వ స్పృహ క్రిమిచేత దొలచబడతాడు. “నేను మొదలుకు చేరిన తన దశ” గుర్తించగలిగాడు.
నగర నారకీయం జీవితాల వీపుల మీద చరుస్తున్న కొరడా దెబ్బల నుంచి, నగర జీవన బలిదానం నుంచి తప్పించుకోలేక గింజుకుంటున్నప్పుడు, నగర Multitudeలో సాయంకాలాల సహించరాని Solitudeల రుచి చూస్తున్నప్పుడు, మాయానగరి మహాజన సముద్రంలో కవి బహిష్కృతుడు, నిర్వాసితుడు, అపరిచితుడు అయి మిగుల్తున్నప్పుడు క్షణికం కోసమయినా ఉపశమన కాంక్షతో ఊరిలో పారేసుకొచ్చిన శైశవ స్మృతుల్ని లాగితెచ్చుకుంటాడు ఊర్నించి వలసొచ్చిన నగర కాందిశీక కవి. చిననాటి ఊరి వానలో కాసేపు తడుస్తాడు. మైసమ్మ గుట్ట వెనకాలి వెన్నెల పొడుపులు తిలకిస్తాడు. మరోసారి పిల్లవాడయిపోయి అమ్మతనం రుచిచూస్తాడు. అమ్మ చెప్పిన గుర్రంకధ వింటాడు. ఎర్రమల్లి వాగులో నడుస్తున్నప్పుడు కాలి మడమలపై నుంచి జారిపడే తడి ఇసుక తంత్రులు గుర్తుతెచ్చుకుంటాడు. నీలిపిట్ట, పాలపిట్ట, గోరింక, బాతుపిల్ల, రెల్లుపూలు తంగెడు పొదలు మనసులో మెదుల్తాయి. జాతర్లలో తెగే బలిపశువుల మొండాలపై కట్టే దిష్టిదారాలు, చిన్నప్పటి రైలు పొగలు, కూతలు గుర్తుకొస్తాయి. ఆ సంచిత స్మృతుల ఆవిర్లు కవి అంతరంగ ఆవరణలో ఒక తీగని ఎప్పుడూ మీటుతుంటాయి. సుదూర అతీతాలదాకా సాగిపోతాయి. వేలయుగాల జ్ఞాపకాల అదృశ్య ప్రస్తారాలు, సుమార ఆతీకాల చీకటి పక్షులదాకా చేరి పురాతన దహనాలు పడుతుంటాయి.
ఆలా నగర నృకంస బీభత్సం నుంచి స్మృతుల్లోకి జారిపోయే తాత్కాలిక ఉపశమనాభిలాష మధ్య ఉంటున్న పరిసరాలు, భౌగోళిక సరిహద్దులు దాటిపోయి జుహు సముద్రతీకాలు, కాశీ హరిశ్చంద్ర ఘాట్ పై సగం కాలిన శవాల్ని చూస్తూపోతూ సుదూర కలహరీ ఎడారి లోగిళ్ళు, ఆఫ్రికా చీకటి లోయలు, మధ్యధరా సముద్ర నడిమి దీవులు, చివరికి ఉత్తరధృవ ప్రాంతాలు చూడబోతాయి. ఆవీ ఉపశమనం కలిగించలేనప్పుడు ఆదృశ్యాలు, ఆశ్ళబ్డాలు, అజ్ఞాతాలు, అస్పష్టాలు, అగోచరాలు, అవ్యక్తాలు, అనామకాలు, అపరిచితాలు, అనాత్మలు, అలిఖికాలు లాంటి అసంఖ్య అరూప్య రహస్యాల్లో క్షుధార్తుడయి విలపిస్తాడు.
కనబడనివి కనాలి. వినబడనివి వినాలి. తెలియనివి తెలియాలి. కనక పాయలు పాయలుగా ఊపిరిని చిత్రిస్తూ, ప్రశ్నిస్తూ నిరాశ, సంశయం, దుఃఖాల్ని అతీంద్రియంలోకి మార్చుకుంటూ ఒక “అలౌకిక పరిశుద్ధత”, ఒక “పవిత్ర శుద్దత” కవిత్వంలోకి తెచ్చుకుంటూ తన కావ్యంలో ఒక వినూత్న, అపురూప కవితా తత్త్వాన్ని స్థాపించబోతాడు కవి. అనుకరణకాని తనదయిన సొంత ధోరణి ఎంచుకుంటాడు. చెప్పే రీతిలో స్వాతంత్ర్యం, భావనారీతిలో అతినవ్యత్వం అనుసరిస్తాడు. ఒక అనార్కిక్ విచ్చలవిడితో, ఒక ఉన్మాద పదప్రయోగ విధానంతో అప్పటికి అలవాటయి ఉన్న కవిత్వాన్నికాక తన పద్యాల రక్తంలోకి మరికొన్ని బొటనవేళ్ళ చిత్ర ప్యూహాల్ని తీసుకోబూన్తాడు. అలా విముక్తిలేని అన్వేషణలో కొత్తగా ఒక దేహాన్ని, కలల్తో చలించే ఒక ప్రాణిని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకు పచ్చని అగ్నిగోళాల ఆలోచనల మీదుగా నెత్తుటి రెల్లుపూలు విరబూయిస్తాడు. కనుగుడ్ల తోలు సంచిల్లో కదలాడ్తున్న గడియారపు చేతుల్తో మెలమెల్లగా చీకటిని తెరవ ప్రయత్నిస్తున్నాడు. గండు చీమ కన్నుల్లో వెన్నెల్ని తడిపిస్తాడు. ఊగే కాలండర్ల లోంచి కొవ్వొత్తుల్ని కరిగించి, కలల యుగాలు జార్పించి, ఆ కలల్తో మౌనం తీగెల్ని శబ్దింపించి ఛిద్రమయ్యే ప్రాయిడీయ అంతర్ తృష్ణల్ని పరికించబోతాడు. చచ్చిపోయిన నాగుపాము కమిలిన శరీరం లాంటి అరుంతుద పదచిత్రాలు, జిరాఫీ చర్మం కప్పుకున్న తాబేలు లాంటి అతి వాస్తవిక చిత్రాలు; కిరాతక ప్రియుడు, నేత్తుటి వేణువు, శబ్దించే మౌనం, ఇటుకల నదిలాంటి Synaesthetic శబ్దచిత్రాలు సృష్టిస్తాడు. అభిష్యక్తి ఆ వేగానికి పదాల సీమిత సామర్థ్యం చాలక రెండు మూడు రూపకాల్ని కలిపి వాడుకుంటాడు. (ఒంటరి పావురపు మేఘం, చీకటి కన్నీటి నెత్తురు ఇరుసు, ఆనాచ్ఛాదిత అవయవ మైదానాలు మొ॥) క్రియపదాలు చాలక నామవాచకాల్ని క్రియాకరించుకుంటాడు. “36 వేల రాత్రులు” లాంటి Expressionist, Dada ప్రయోగాలు చేస్తాడు. “రెండు అపరిచిత దేహం రాల్చిన రక్తం చుక్కలు” లో “రెండు”కి Proximity నియమం నుంచి తప్పించగలుగుతాడు.
మొనాలిసా మృదుహాసంలో దాగిన విషాదాన్ని డావించీ విద్యుత్ ద్రవంలోకి మార్చేయగలిగాడంటారు. ‘దీపశిల’ కవి తన కవిత్వాన్ని నిశ్శబ్ద ఎలక్ట్రానిక్ ద్రవంలోకి మార్చే సఫల ప్రయత్నుడయ్యాడు. ద్రవానికి నిశ్చిత రూపముండదు. పరిచయకర్తలు, పాఠకుల పాత్రల బట్టి అదీ బహురూపాలు ధరించగలుగుతుంది కొందరికి జీవిత సత్యసార అన్వేషణ కవిత అనిపిస్తుంది. కొందరికి అధిభౌతిక తాత్విక కవిత అనిపిస్తుంది. మరికొందరికి శుభ్ర వేదనాకవిత అనిపిస్తుంది. అయితే అందరికీ అంతుపట్టని అస్పష్ట, అభేద్యకవిత అనిపించసాగింది.
దెగాకి మీలార్మే తెలిపిన ‘గూడత’ ఆధునిక కవితకి విలువ పెంచే మూలకాల్లో ఒకటిగా ‘దీపశిల’ కవి గుర్తించగలిగాడు. జీవితానుభవం సంక్లిష్టం. కనక కవిత్వం కూడా విధిగా సంక్లిష్టం అయితీరుతుందనే నియమం లేకపోయినా సంక్లిష్టత నుంచి స్పష్టమయిన జీవితం బయటపడొచ్చేమో! కనక ఆస్పష్టత తాలూకు Anthropology లోని relics ని పట్టుకోగలిగితే కవిత్వం కూడా సున్పష్టం కాగలుగుతుందని భావిస్తాడు. కవి. అందుకే కవిత్వంలో స్పష్టా స్పష్టతలమీద కవికి నమ్మకంలేదు-
యావత్ జీవితానుభవాల్నీ, అపశీలనల్నీ ఒకే జీవితలో ఇమడ్చాలనే అనే అత్యుత్సాహంవల్ల ఆ అతిగతిశీల భావపరంపరలు, శబ్దచిత్రాలు సరి అతుకుళ్ళు పడక కళ్ళెం తెంచుకుంటాయి. అప్పటికీ పాఠకులకి మచ్చిక పడిన కల్పనలు, రచనా విధానాల నుంచి కనీస అంగీకారం, స్వీకృతి పొందని పదచిత్రాలు, కల్పరీతులు కవితలో అబోధకత పెంచేవవుతాయి కవిత్వంలో అనిశ్చితత, నిశ్శబ్దం, అంధకారాలు కవితకి నీషే “పరిశుద్ద జటిలత” తెచ్చిపెట్టేవవుతాయి.
ప్రపంచం ధ్వంసమయం, అసంబద్దం, కాఫ్కా, సార్త్ర్‌ల్లా కాక ఆ ధ్వంసం, ఆసంబద్ధాలలోంచే ఒక ఆశ, ఆకాంక్ష మేల్కొన్నాయి కామూలో, (ఆదిలో కామూ కమ్యూనిస్టు, రహస్య ఉద్యనూల్లో పాల్గొన్నాడు. స్టాలిన్ ‘గాధలు’ విన్నాక మనసు మార్చుకున్నాడు). నీషే Heroic pessionism / tragic heroism లో ఆశా నిరాశల మేళవింపు ఉంది. ‘దీపశిల’ కవికి ఈ ప్రపంచం ధ్వంసమయం అనిపించినా (ధ్వంసం కాదు ముఖ్యం. ఆ భావన ముఖ్యం) “నువ్వు భయపడేంత పిరికిగా లేదిక్కడ జీవితం” అంటాడు. The Flagve లోని డాక్టర్లా జీవితమంటే అపరిమితమయిన ప్రేమ. దాన్ని పగిలిపోకుండా కాపాడుకోవాలనే ఆతురత పడుతున్నాడు కవి. ఆస్తిత్వవాదం వైపు ఆ కృష్ణుడయినా కామూ పూర్తిగా అస్తిత్వవాది కాని ఆసంబద్దవాది. కామూ ‘జీవనవాదం’ కామూ అసంబద్ధతకంటే మరింత ప్రాచుర్యం పొందింది. ‘దీపశిల’ కవికి తన జీవనవాదముంది,
మైకంతో ఊగిపోయే అపక్రమ దృశ్యచిత్రాలు, భాషా వినిమయాలు భయదవిభ్రమాలు, ప్రశంసనీయ అంకనలు.
అటు Apollonic స్వేచ్ఛ, ఇటు జీవిత బాధ్యతల ఇరుకులు. వీటి సంఘర్షణలో పుట్టిన Angst, ప్రతిక్షణం విచ్ఛిన్నతా బోధవల్ల కలిగిన అసహాయ అనుభవం, అభద్రత. వీటి నుంచి ఉద్భవించిన దుఃఖాన్ని స్పృహించి ఇంకా మెరుగయిన జీవితానికి కలలుకంటూ సృజన కేంద్రంలో విస్ఫోటన తీసుకరాదలుస్తున్నాడు కవి. తనదయిన జీవనతత్వపార స్థాపనకి సృజన సామర్ధ్యాన్ని వినియోగించదలుస్తున్నాడు. అయితే “ఇంతా చేసి ఇదంతా శూన్యాలని పొగలాగా ఊదే చూపుల కధ. రాత్రి దారివెంట వేకువల వలయాలదాకా వచ్చి ఫట్మని పగిలిపోయే చూపుల కధ” అనిపించుకోవలసి వచ్చింది.
తెలుగు కవితా ప్రస్థానంలోని ఉత్తర ఆధునిక దశలో (1985 సరిహద్దు అనుకుంటే) అతినవ్య స్పృహ పోదలుస్తున్న దిశా సూచకంగా ‘దీపశిల’ ఒక సరికొత్త ఉదాహరణ కాగలుగుతుంది.
