దుత్తలో చందమామ

Spread the love

గోపిని కరుణాకర్

గోపిని కరుణాకర్ చిత్తూరు జిల్లాలోని తిరుమలకొండ మీద పుట్టారు. తల్లిద్రండ్రులు గోపిని కళ్యాణమ్మ, గోపిని హనుమంతు నాయుడు. అకాడమిక్ చదువులకన్నా లోకాన్నీ, సాహిత్యాన్ని, సినిమాల్ని ఎక్కువగా చదివారు. అధ్యయనం చేశారు. సినిమాలు చూడటం, పుస్తకాలు చదవటం చిన్నప్పటినుంచి ఉన్న ఆసక్తి. ఆ ఊపులోనే ఎనిమిదో తరగతిలోనే ఓ నవల రాశారు. ఇంటర్లో ఉండగా ప్రేమ కవిత్వం రాశారు. సినిమా అంటే ఉన్న తపన, ఆసక్తి, ఆర్తి జీవితాన్ని అనేక మలుపులు తిప్పింది. కాలేజీ రోజుల్లో నాటకం రాసాడు. తర్వాతి రోజుల్లో మాత్రం కథ, కవిత్వం అతని రచనా వ్యాసంగంలో ప్రధాన భాగమయ్యాయి. సినిమా అతని వృత్తి, ప్రవ్రుత్తి అయ్యింది. ఆయన కథలు మరల మరల చదవాలనిపించేవి. విమర్శకుల మన్ననలు పొందాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *