నువ్వు ఒక స్వేచ్ఛా స్త్రీలా నేను నీ నమ్మదగిన స్నేహితుడిలా ఎలా ఉన్నామో అలాగే పోదాం పద
వేర్వేరు దారుల్లో మనం కలిసే పోదాం పద విడి విడిగా ఉన్నా ఒక్కటిగా వెళ్దాం పద
ఏ బాధా లేకుండానే పోదాం!... పావురాలు విడిపోవడము రెండు చేతుల నడుమ గడ్డ గట్టిన శీతలము చర్చి చుట్టూ తిరిగే పవనమూ ఏదీ... బాధించదు!
అరకొరగా విచ్చుకున్న ఈ బాదాం పూల వికాసము సరిపోలేదు అందుకే నువ్వు నవ్వు!
నీ రెండు చెక్కిళ్ల నొక్కుల నడుమ రెక్కలు విప్పే సీతాకోకల కోసం బాదాం చెట్లు నిండుగా పూసేలా నువ్వు నవ్వు!
ఇక త్వరలోనే మన కొత్త వర్తమానం రాబోతోంది!
వెనక్కి తిరిగి చూస్తే నీకు కనిపించేది వెలివేతల గుండెకోతల జ్ఞాపకాలే! నీ పడక గది పెరటి చెట్టు అద్దాల భవనాల అవతలి నది మన రహస్య కలయికల కేఫ్... అన్నీ అన్నీ... ప్రవాసమవడానికి సిద్ధమవుతున్నాయి, అందుకే మనం దయగా ఉందాం
ఏ ఆంక్షలు లేని స్త్రీలా నువ్వు నీ వేణు గానానికి హృదయాన్నిచ్చే స్నేహితుడిలా నేనూ ఎలా ఉన్నామో అలాగే పోదాం పద!
కలిసి వృద్దాప్యాన్ని చేరడానికి, అలసిన నడకతో సినిమాకెళ్ళడానికి, ఏథెన్స్ యుద్ధ ముగింపుకు సాక్షులమవడానికి, మొదలవబోయే రోమ్ - కార్తేజ్ శాంతి విందును చూడడానికి సమయం ఎక్కువ లేదు మనకు ; పక్షులు ఒక శకం నుండి మరో శకానికి రెక్క విప్పుతున్నాయి!
అర్థవంతంగా కనిపిస్తూ మనల్ని నడిపించిన ఈ దారి ఒట్టి దుమ్మేనా? మనం రెండు పురాణాల మధ్య ప్రయాణాలమా? కనుక, ఓ అపరిచితుడు ఇంకో అపరిచిత అద్దంలో తనును తాను చూసుకొన్నట్లుగా ఈ మార్గం మనకు అనివార్యమా? మన ఈ జీవితమూ అనివార్యము?
"కాదు, ఇది నన్ను నేను చేరే దారి కాదు అస్తిత్వ వేదనకు సాంస్కృతిక పరిష్కరాలు లేవు"
నవ్వెక్కడున్నా నా ఆకాశానివి, ఇది నిజం అయినా, నిన్న అస్తమించిన సూర్యుణ్ణి మొన్న వెలిసిపోయిన చంద్రుణ్ణి నీకు తిరిగివ్వడానికి నేనెవ్వరిని?! అందుకే దయగా ఉందాము ఎలా ఉన్నామో అలాగే వెళ్దాము నువ్వొక ప్రేయసివి నేను నీ కవిని
జనవరిలో కురిసిన ఈ మంచు సరిపోలేదు కనుక నువ్వు నవ్వు క్రైస్తవ ప్రార్థనపై దూది రాశుల మంచు కురిసేలా!
షేక్స్పియర్ భాషను నేర్చుకుంటూ రోమియో జూలియట్ ఆటాడుకుంటూ తొలి ప్రేమలో యవ్వనంగా ఉంటూ మన వెనుకే ఉండిపోయిన రేపటిలోకి తొందర్లోనే తిరిగొస్తాం!
నిద్రలేచిన సీతాకోకచిలుకలు ఎగిరి పోయినవి చంచలమైన ఈ శాంతి, ఒక మాయ అది మన కళ్ళ ముందు రెండు నక్షత్రాలను అలంకరిస్తుంది పేరు కోసం జరిగిన పోరులో భిన్న ధృక్కోణ గవాక్షాల మధ్య నిన్నూ నన్నూ చంపేస్తుంది కనుక మనం పోదాం ఇంకా దయగా ఉందాం నువ్వు ఒక స్వేచ్చా స్త్రీవి నేను నీ నమ్మదగిన స్నేహితుడిని ఎలా ఉన్నామో అలాగే పోదాం పద
గాలితోబాటు ధూళిలా మనం బాబిలోనియా నుంచి వచ్చాం కాలంతో పాటు కవాతు చేస్తూ తిరిగక్కడికే చేరుకుంటాం
నా పాదాల గుర్తులు దక్షిణ ప్రాంతాన్ని కీర్తిస్తూ ఊగే పైన్ చెట్లు కావడానికి నా ప్రయాణం ఇంకా సరిపోలేదు
ఈ గాలేమో ఉత్తరం మన ఆత్మ గానమేమో దక్షిణం అయినా మనమిక్కడ దయగానే ఉందాం
నేను ఇంకో నువ్వా? నువ్వు మరో నేనా? నా స్వేచ్ఛానేలను చేరే దారి ఇది కాదు నన్ను నేను చేరే మార్గం ఇది కాదు నేను రెండు సార్లు 'ఒకే నేను' కాలేను ఇప్పుడు నా నిన్నటి జీవితం నా రేపటి ఆశగా మిగిలింది
నేను ప్రవాసిని తూర్పు పడమరల మధ్య ఇద్దరుగా చీలిన స్త్రీని అయినా నేను తూర్పుకూ చెందను పడమరకూ చెందను లేదా రెండు ఖురాన్ ప్రవచనాలకు నీడనిచ్చే ఆలివ్ కొమ్మనూ కాను కనుక పోదాం పద! "వ్యక్తి గత వేదనకు సామూహిక పరిష్కారాల్లేవు"
కలిసుండడానికి, మనం కలిసి ఉన్నది సరిపోదు...
మనమెక్కడున్నామో చూడడానికి మన వర్తమానాన్ని కోల్పోయాము
నువ్వొక స్వేచ్ఛా స్త్రీలా నేను నీ పాత స్నేహితుడిలా ఎట్లా ఉన్నామో అట్లాగే పోదాం రెండు వేర్వేరు దారుల్లో ఒక్కటిగా వెళ్దాం మనం దయగా ఉందాం
మూలం : దర్వీష్ స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
Spread the love నీ కళ్ళు నా గుండెకు చిక్కుకొని వేలాడే ముళ్ళుముల్లును కూడా ఇష్టంగా పెంచుకున్న ప్రేమ నాది!నా దేహ కండరాలను కప్పిద్వేష గాలుల నుండీచీకటి రాత్రుల చిక్కని వేదన నుండీఆ ముల్లును కాపాడుకున్న!నీ చూపుల ముల్లు చేసిన గాయం నిప్పురవ్వై గుండెను కాల్చుతున్నా ఆ వెలుగురవ్వలు నాలోపలి చీకటి తరుముతూవేల లాంతర్లను వెలిగిస్తున్నాయిఇప్పటి నొప్పి లోంచే రేపటి హాయి ఉదయాలను చూస్తున్న! వెచ్చని ఆ గాయమే నాకిప్పుడు ఊపిరి […]
Spread the love నేనొక స్త్రీనిఅంత కన్నా ఎక్కువా కాదుఎంత కన్నా తక్కువా కాదు యథాతథంగా జీవితాన్ని స్వీకరిస్తానుగాలిదారాలతో కాకమ్మ కథలు అల్లనుపోగు వెంట పోగుఓపిక నూలుతో బతుకు వస్త్రాన్ని అల్లుకుంటున్న మహిళనుపాలేవో, నీళ్ళేవో నా కళ్లతోనే పోల్చుకుంటానునిజాల నీడ పట్టుకొని ఓటమి నాడిని తెలుసుకుంటానునిన్నటి అనుభవం అద్దిన కాగితం మీద రేపటి రూపం గీస్తానునిశ్శబ్దాల ప్రతిధ్వనులే తప్ప నా దగ్గర ఏ శబ్ద ఆడంబరాలూ లేవు ఎగిరే పక్షుల జాడ […]
Spread the love ఈ పాస్ పోర్ట్ లోనినా రంగుని పీల్చేసిన నీడల్లో వాళ్ళు నన్ను గుర్తించలేరు!వాళ్లకు,ఓ పర్యాటకుడు సేకరించే ఫొటోల్లా నా గాయం వినోదాన్ని పంచే ఒక ప్రదర్శనా వస్తువు,అంతకుమించి వాళ్ళు నన్ను గుర్తించలేరు!సూర్యుడు లేకుండా నా అరచేతిని వదలకండినన్నో పాలిపోయిన చంద్రునిలా వదలేయకండి!ఎందుకంటే నా స్థానికతను నా నేల మీది చెట్లన్నీ గుర్తిస్తాయి!పక్షులన్నీ నా చేతిసైగను అనుసరిస్తూవిమానాశ్రయం గేటుదాకా వొచ్చాయిపండే గోధుమ చేలుఇరుకు జైళ్ళూతెల్లని సమాధి రాళ్ళుఆంక్షల ముళ్ళు […]