దృశ్యం నిశ్చలం అయినప్పుడు
పాత్రలు మాయమవుతుంటాయ్.
ఏ పగుళ్ళలోంచో
వెలుగు రేఖ మిణుక్కుమంటోంది.
ఒక్కోసారి ఊహాగానపు
రాజకీయాలన్నీ
శ్వాస కోసం
తడబడుతుంటాయ్.
ఇష్టంతో ఊసులాడుకున్న మాటలన్నీ
ధైర్యం లేక
ఉరి పోసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయ్.
నిజం గర్భాన్ని మోస్తున్న ప్రపంచం
ప్రాణం ఒడ్డి పోరాడుతూనే ఉంటుంది.
దేన్నైనా ప్రయత్నించే
ధైర్యం లేక
నా దేహంలోకి నేనే
నడిచి వెళుతుంటాను.
లోపలికెళ్ళటం సులువే కానీ
అడుగు తగలటం
అంత సులువు కాదు.
కళ్ళు నులుముకొని జీవితాన్ని
విప్పార్చి చూడటం
నేర్చుకున్నాక
మేఘం గిలిగింతలతో
నన్ను ముద్దు పెట్టుకున్నట్టనిపిస్తుంది.
ఏ పోరాటం ఎక్కడ ఆపాలో
తెలియని వాడ్ని కదా!
నాలో నేనే నడుస్తూ
