దానికన్నా గొప్ప మాట

Spread the love

ఉన్నపళంగా మనిషి
తన జీవితాన్ని విడిచి ' వెళ్లిపోవడం ' గురించి
ఒక తీరిక సాయంత్రం
లోతైన చింతన కలిగింది అతనికి


రాత్రంతా నిద్రపోనివ్వని చింతన అది


తెల తెలవారుతుండగా-
పక్షుల శబ్దాలతో పాటు
మనుషుల మాటలు కూడా
కొంచెం కొంచెంగా అతని చెవిని తాకసాగాయి


పుట్టి బుద్ధెరిగినప్పటినుండి
ఆ రోజు వరకు అతను విన్న
మనుషుల మాటల్లో
' ఎప్పుడు పోతామో తెలియదు'
అనే మాటను మించిన గొప్ప మాట
మరొకటి లేదు అనిపించింది
అతనికి


ఆ రోజునుండీ
అతనితో కలిసి జీవించడం
అతని దినచర్యకు చాలా తేలిక అయింది
భగవంతం

భగవంతం అసలు పేరు మైసా నరసింహారావు. 20, మే 1970 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) కొత్తగూడెంలో జన్మించారు. ప్రస్తుతం స్వంత ఊళ్ళోనే భారతీయ జీవిత భీమా సంస్థలో ఉద్యోగం.  కథలు కవిత్వం రాస్తారు. తన మొదటి కథా సంకలనం 'లోయ చివరి రహస్యం' పేరున ఈ సంవత్సరం (2024) ప్రచురించారు. ఫోన్ నెం - 9399328997


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *