మనిషి ఎక్కడ?
మనసు ఎక్కడ?
అనుకుంటూ
మధ్య ముడిలో చిక్కుకొని వుంటావు.
అయినా,
బుద్ధి బురదగుంటలో పడకుండా పుష్పించే తనంతో
దేహాన్ని ధరించాలనుకుంటావు.
హృదయాన్ని తడుపుకుంటూ పక్షిలా
పాడుకుంటూ ప్రకృతిలో మమేకం కావాలను కుంటావు.
హాయిగా హాయి హాయిగా..
అణువణువునా పసితనంతో
నిప్పులను ఆర్పుకుంటూ శాంతంగా
నడుస్తుంటావు, ఆకర్షణల అగాధాలను దాటుకుంటూ
రెక్కలను విప్పార్చుకొని
ఊరటగా -
కలల పునాదులను వేసుకుంటుంటావు
ధీమాగా -

