యుద్ధం వద్దు

Spread the love

రాజకీయ నాయకులు యుద్ధాన్ని పండిస్తారు పోషిస్తారు 
ప్రజల్ని మృత్యు ముఖాన పడేస్తారు
చచ్చేది చెడేది రెండు దేశాల అమాయకులు
ఉపాధి పేరా నియమితమైన దేశ రక్షణకులూ, పేద ప్రజలు
అంతా కావాలి ఆహుతి

నిన్నటి వరకూ ఆత్మీయ మిత్రులు
నేడు మతాల
మత్తులో మారిన బధ్ధ శతృవులు
దేశమంతా ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ
జీవితాన్ని నరకం చేస్తూ
లాభం పొందే ఇరు దేశాల నాయకులు
ఇరు దేశాలకూ క్షిపణులు అందించే అగ్ర రాజ్యాలు

యుద్ధం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు
జబర్దస్త్ షో అసలే కాదు
దేశాలను ధ్వంసం చేసే మారణకాండ
హిరో‌షీమా నాగాసాకీల అనంత శోకం
యుద్ధం ఇప్పుడు అణ్వాయుధాల ప్రయోగశాల

యుద్ధం ఎప్పుడూ చివరి అస్త్రం కావాలి
రోజువారి జీవితంలో యుద్ధం ఎప్పటికీ ప్రమాదమే
ప్రజల ఆరోగ్యం, విద్య దేశ ఆశయం కావాలి
ఆరోగ్యం విద్య
దేశాభివృద్ధికి మూలం కావాలి
యుద్ధం ఒక వినాశనం యుద్ధం ఒక విధ్వంసం
యుద్ధం అమానవీయం అసలే వద్దు
సర్వమంగళ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *