నింద

Spread the love

చేజారిన తైలాన్ని ఒలికిన సమయాన్ని 
తీసి ఇవ్వగలరా?
గిరగిర తిరిగి కళ్ళు బైర్లు కమ్మినా
వడివడిగా తిరిగి ఎముకలు విరిగినా
శక్తిని పీల్చేసినా
కట్టేసిన కొయ్య చుట్టూ గానుగెద్దులా
తలవంచి నిందల తైలం చల్లి అపనిందల పాలు చేసి
గిరి గీసిన ఆ నూనె మడుగు వలయంలో
చతికిల పడుండమని
చేతులు కడిగేసుకు కూర్చున్న లోకానికి

తైలాన్నే రంగరించి
ఇంద్రధనస్సునే సుమగుచ్చము చేసి
శ్వేతాంబర సోయగాలతో
ఆత్మాభిమానపు ఆభరణాలతో
కాంతిపుంజపు ఆసరా అందుకుని
స్వచ్ఛత వెలుగును
నలుమూలలా చాటి చెప్పాలని ఉంది!
హిమబిందు.టి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *