తుపాకులు మొరగడం ఆగిపోతుంది
యుద్ధ విరమణ జరిగిపోతుంది
నాయకులు కరచాలనం చేసుకుంటారు
శాంతి ముసుగు చాటున
రక్త పు కోరలు కప్పబడతాయి
శిథిల నగరం మీద
పొద్దుపొడుపు..
ముసలి తల్లి మాత్రం
అమరుడైన తన కొడుకు కోసం
ఎదురు చూస్తుంటుంది
అక్కడ ఒక అమ్మాయి
తన ప్రియమైన భర్త కోసం
గాబరా పడుతుంటది
బిక్క ముఖాలు వేసుకున్న పిల్లలు
సగం తెగిన చందమామలు
యోధుడైన తండ్రి కోసం
ఎదురు చూస్తుంటారు
నా దేశాన్ని అమ్మిన వారెవరో
తెలవదు
కానీ ధర మాత్రం
ఎవరు చెల్లించారో చూశాను..
**
మూలం..మహమ్మద్ ధర్వేష్
యుద్ధ విరమణ
