మధురరాగసమం

Spread the love

” వింటున్నావా?”,

అమృత తండ్రి కనుబొమ్మలు పైకెత్తి నెమ్మదిగా అడిగినప్పుడు నాకు ఆ ప్రశ్నకు ఉన్న అర్థం తెలియలేదు. నాన్న వినడానికి నేను, ఏమీ మాట్లాడలేదు. నా ముఖం వైపు చూస్తూ సమాధానం కోసం ఎదురు చూస్తున్న అయనకి ఏమి చెప్పాలో తెలియక నేను తల ఊపాను.

నాన్న మంచం మీద కూర్చున్నారు.

చాలాసేపు నుండి మౌనంగా ఉన్నారు.

అమృత ఇంటికి నేను మొదటిసారి రావడం ఇదే. నేను తన నాన్నను చూడటం ఇదే మొదటిసారి.

అమృత టీ తీసుకొని వచ్చింది. అప్పుడే ఆమె తన నాన్న గురించి వివరంగా చెప్పింది.

“నాన్న ‘వింటున్నావా’ అని మాత్రమే అడుగుతారు. వేరే వార్త ఏమి లేదు. నాన్న మనం చెప్పేది ఏమి వినరు. నాన్నక్కి లోపల సంగీతం మాత్రమే నిండి ఉంది. అయన ఒక్కప్పుడు మంచి గాయకుడు. మంచి హార్మోనిస్ట్ కూడ! చాలా వేదికలపై పాడారు. రెండు సంవత్సరాల క్రితం నుండి చెవులు పనిచెయ్యట్లేదు. నాన్న వినికిడి కోల్పోయినప్పుడు నుండి మాట్లాడటం కూడ మానేశారు. నాన్న అందరితోనూ ‘వింటున్నావా’ అని మాత్రమే అడుగుతారు.

అందరికీ కాదు, ఆయనికి నచ్చిన వారితో మాత్రమే.  ప్రజీష్ అంటే నాన్నకి ఇష్టమనుక్కున్నాను. అందు కే ‘వింటున్నావా’ అని అడిగారు. కొన్నిసార్లు  చేతులుతో తట్టేవారు. తల ఊపేవారు. ఆనందంగా నవ్వేవారు.

నాన్న పాటలు మాత్రమే వింటుంటారు. ఎప్పుడూ లోపల ఏదో పాట ఉంటుంది. అది ఏదో  నాన్న చెప్పరు.  వింటున్నావా అని అడిగినప్పుడు, వింటున్నానని చేప్తే చాలా సంతోషాపడతారు. అన్నీ పాత పాటలే. త్యాగరాజ భాగవతార్, మహమ్మద్ రఫీ మరియు ఏ.ఎమ్. రాజా పాటలు నాన్నకి నిజంగా నచ్చుతాయి.”

“నువ్వు వింటున్నావా?”,

 అని అమృత తండ్రి మళ్ళీ అడిగినప్పుడు,

నేను నమ్మకంగా తల ఊపాను. అప్పుడు అయన బుగ్గలపై మృదువైన చిరునవ్వు వ్యాపించింది. లోపల పాట పూర్తయ్యే వరకు నాన్న కళ్ళు మూసుకుని కూర్చున్నారు. అది ఏ పాట అవుతుందో అని నేను ఆలోచిస్తు ఆయనకి ఎదురుగా కూర్చున్నాను.

తన నాన్నకు, అమృతతో నాకున్న సంబంధం గురించి ఏమీ తెలియదు. ఆయనకి ఆ విషయం నేను ఎందుకో చెప్పలేకపోయాను. అమృత తల్లి చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యింది. అమృత ఉద్యోగానికి వెళ్ళినప్పటి నుండి, ఒక హోమ్ నర్సు తన నాన్నని చూసుకుంటుంది. ఆమె ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. తన తండ్రి ఎప్పుడూ ఆమెతో ‘వింటున్నావా’ అని అడగలేదని చెప్పి అమృత నవ్వింది.

“ఇప్పుడు మీ నాన్న లోపల ఏ పాట వింటున్నారో?”

“అది మనకు ఎలా తెలుస్తుంది? నాన్న హమ్ కూడ చేయ్యరు. లోపల ఉన్న పాటలో నాన్న మునిగిపోతారు. నాన్నకు సంగీతం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఉంది. నాన్న మాత్రం ఇక్కడే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు. కానీ…” అమృత మాటలు తడబడ్డాయి.

అమృత తండ్రి నెమ్మదిగా మా సంబంధాన్ని అర్థం చేసుకుంటారు అని నేను భావిచాను. నాన్న ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండే, మా పెళ్లి కుదుర్చేలా చేసేవారేమో.

“మీ నాన్నకి సంతోషాన్నిచ్చేది ఏదైనా చేయనివ్వు! మంచి జ్ఞాపకాలలో

జీవించనివ్వండి! ఎల్లప్పుడూ అయనకి లోపల పాడటానికి అవకాశాలను సృష్టించండి!”

“డాక్టర్ చెప్పింది అదే”.

అమృత చెప్పింది.

” నాన్న తరచుగా బయటకు వెళ్తారా?”

” ఎవరైనా తోడుంటే….. ఎవరైనా సరిపోరు. నాన్నకు నచ్చిన వ్యక్తి.”

“చూద్దాం. నేను మీ నాన్నని ఒక రోజు బయటకు తీసుకెళ్తాను.”

“ప్రజీషకి ఇబ్బంది అవుతుంది.”

“ఏ ఇబ్బంది?”

“మీ నాన్నగారి హృదయం పాడనివ్వండి. నేను దానిని బాగా వింటాను.”

” నాన్నని పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాలి.”

అమృతకు ఆదివారం సెలవు కాబట్టి, ఆ రోజు నర్సు రావడం లేదు. అమృత తన తండ్రితో కలిసి కూర్చుంది. లోపల పాట వింటోంది.

 నేను, ఇంకో ఆదివారం అక్కడికి వెళ్ళాను. నాన్నగారు నా వైపు చూసారు. అయన నవ్వలేదు. ‘వింటున్నానా’ అని అడగలేదు. నేను ఆ మాటకోసం వేచి ఉన్నాను. కానీ అడగలేదు. లోపల పాట తగ్గిందా అని నేను ఆశ్చర్యపోయాను.

అప్పుడు అమృత ఇలా అంది:

“రెండు మూడు రోజులుగా నాన్న నాతోకూడ ఏమీ అడగలేదు.”

“మీ నాన్నగారిని బయటకు తీసుకెళ్దామా?, అయితే నువ్వు కూడా రా.”

“నాన్న ఇంకా స్నానం చేయలేదు. మామూలుగా సాయంత్రం స్నానం చేస్తారు.”

“నేను మీ నాన్నకి సముద్రం చూపిస్తాను. తిరికి వచ్చినప్పుడు స్నానం చేయొచ్చులే. నువ్వు రెడీ అవ్వు.” అమృత తన నాన్నగారి షర్ట్, దొతి మార్చుకుని, జుట్టును దువ్వింది. అప్పుడు ఆ మృదువైన చిరునవ్వు తిరిగి వచ్చింది.

నేను కారు తీసుకున్నాను.

అమృత, ఆమె తండ్రి వెనుక కూర్చుని ఉన్నారు. రష్ బాగానే ఉంది.బీచ్‌లో ఫుడ్ ట్రక్కుల పెద్ద క్యూ వరుసలో ఉంది. ఖాళీ స్థలం కోసం వెతుకుతూ, నేను కారును ఎడమ వైపుకు తీసుకెళ్లాను. ఆమె తన తండ్రి చేయి పట్టుకుని  దింపే సమయానికి, ఆకాశంలో చీకటి పడటం ప్రారంభించింది.

నాన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఆకాశం సముద్రాన్ని తాకే పడమదిక్కులో సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. అప్పుడు నాన్న నుండి మళ్ళీ ఆ ప్రశ్న వచ్చింది.

“నువ్వు వింటున్నావా?”

ప్రశ్న నా కోసమే. నేను గట్టిగా తల ఊపాను.

నేను వింటున్నానని చెప్పాను. పాట నాన్న హృదయాన్ని నింపుతున్నట్లు మేము భావించాము.

అది ఏ పాట అవుతుంది?

“అరేబియా సముద్రం ఒక వరుడు…” అనే వయలార్ రామవర్మ రాసిన పాట్టేనా?

“సముద్రం… ఒనీలి సముద్రం….” అనే శ్రీకుమారన్ తంబీగారు పాటేనా?

“సాగరము… నిశ్శబ్దమయి పాడవే నువ్వు …. ” అనే ఏసుదాస్ పాటేనా?

వీటిలో ఏది అవుతుంది?”  నేను అమృతను అడిగాను.

“అది కాదు. రఫీ పాటల్లో ఏదైనా అవుతుంది. ఒకవేళ,  ‘అస్తమయం… అస్తమయం… సూర్యస్థమయం….’ కావొచ్చు”.

అమృత తండ్రి మరింత ఉల్లాసంగా నవ్వడం ప్రారంభించారు. మరో ప్రశ్న వచ్చింది.

“నువ్వు వింటున్నావా?”

సలీల్ చౌదరిగారి ‘సముద్ర చాకర ఉత్సవం… ‘ కాక వేరే ఏమికాదని నేను ఫిక్స్ అయ్యాను.సిమెంట్ బెంచ్ మీద నాన్న చేతుల వేగవంతమైన లయ చూసాను.

అప్పుడు సముద్రం చీకటితో నిండిపోయింది.

ఇప్పుడు అక్కడే అలల శబ్దం మాత్రమే

ఉంది. ఒడ్డుకు చేరుకునే వెండి అలలు మాత్రమే ఉంది.

నేను నాన్న భుజంపై చేయి వేసాను. నేను నాన్నని నెమ్మదిగా లేపాను.

అమృత తండ్రి చాలా ఉత్సాహంగా మా చేతులు పట్టుకుని కారు ఎక్కాడు.

రెండు రోజుల తర్వాత, అమృత పిలిచింది. “నాన్న ప్రజీష్ కోసం వెతుకుతున్నారు – మా నాన్న సైగ చేసి ఎక్కడ అని అడుగుతున్నారు.అది నిన్నెనని నాకు బాగా తెలుసు.”

 నాకు అమృత మాట చాలా సంతోషం కలిగిచింది.

“ఎవరున్నారు అక్కడ?”

“నర్స్ ఉంది.”

“నేను వొచ్చి నాన్నను బయటకు తీసుకెళ్తాను. నర్సుకు చెప్పు.”

నేను మధ్యాహ్నం అమృత ఇంటికి వెళ్ళాను. నాన్న నా కోసం సిద్ధంగా వేచి ఉన్నారు.

నాన్న కారు ముందు సీట్లో బెల్టు కట్టుకుని కూర్చున్నారు. ఎదో ఒక అజ్ఞాత బలం వచ్చినట్లుగా.

నేను ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నా. నగరంలో పార్టీ సమావేశం జరుగుతోంది. ట్రాఫిక్ జామ్ అయింది. చిన్న ఊరేగింపులు మమ్మల్ని దాటి వెళ్ళాయి.  దాన్ని పూర్తిగా

చూసి నాన్న ఇలా అడిగారు:

“నువ్వు వింటున్నావా?”

 నాన్న తన లోపలి పాటలు వింటూ ఎదో జ్ఞాపకాల్లో మునిగిపోయింది.

“బలి సమాధులు…” అనే వయలార్ పాట అది. నా మనస్సు నాతో చెప్పింది.

అమృత పిలిచింది.

“తండ్రి పూర్వీకుల ఇల్లు ఉంది అక్కడ. ఆలువ రాకముందే. పిలకండి అనే ఇల్లు కోసం అడుగుతే చాలు, ఎవరైనా చెవుతారు. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు. నాన్న కొంతకాలంగా అక్కడే ఉన్నారు. వీలైతే, అక్కడికి వెళ్ళండి.”

ట్రాఫిక్ జామ్ నుండి విముక్తి పొంది నేను కారును ఆలువ రూటుకి తీసుకువెళ్లాను.

ఇల్లు కనుక్కోడానిక్కీ కష్టమేం కాలేదు. అది అంతనికి తెలిసిన ఇల్లే.

అక్కడే ఉన్న కొంతమంది కారులో ఉన్న వ్యక్తిని గుర్తించారు. గేటు లాక్ చేయలేదు. కారు లోపలికి తీసుకెళ్లాను.

ఇల్లు చుట్టూ రాలిన ఆకులతో నిండి ఉంది. పొలం చెట్లతో దట్టంగా ఉంది.

నేను నెమ్మదిగా నాన్న చేయి పట్టుకుని కిందకు దించాను, జాగ్రత్తగా చూస్తున్నాను, నాన్న చీమలపై కాలు వేయకుండా జాగ్రత్తగా నాతో నడిచారు. వెళ్లి వరండాలో ఉన్న

పురాతన, వాసనతో, దుమ్ముతో కప్పబడిన చెక్క కుర్చీపై కూర్చున్నారు. ఎదో నది ప్రవాహములో నుండి వొచ్చినట్టు ప్రవహించే జ్ఞాపకాలు ఆ ముఖంలోకి వచ్చి నాన్నని సంతోషపెట్టాయి.

“నువ్వు వింటున్నావా?”

ఆ ప్రశ్న విన్న వెంటనే నేను ఆలోచించాను.

ఇక్కడ ఏ పాట అవుతోంది?

“ఈ మూక వేదికపై ఏ గాజుల శబ్దం వినీపించింది….”

నా మనసులో చాలా పాటలు ఉన్నాయి. నేను వింటున్నాను. అవును నేను వింటున్నాను.

పెరట్లో ఉన్న జామ చెట్టు కాకులతో నిండి ఉంది. నాన్న సూచించిన దిశలో, వైర్ మెష్‌తో కప్పబడిన బావి ఒక్కటి ఉంది. నేను నాన్నని అక్కడికి నడిపించాను. నాన్న బావిలోకి చూసి నిశ్చలం నిలబట్టారు.తిరిగి వెళ్ళేటప్పుడు, మళ్ళీ ప్రశ్న వచ్చింది.

అది ఏమిటి? జ్ఞాపకాలు ఎలాంటి శ్రావ్యంగా ఉండవచ్చు?

“ఇంకా మీ నాన్నకి చూడవలసిన ప్రదేశం ఎక్కడ ఉంది?”

అమృత బదులిచ్చింది.

“బార్,  అక్కడక్కిమాత్రం ఈ పరిస్థితిలో నాన్నని తీసుకెళ్లకండి.”

“మీ నాన్న తాగుతారా?”

“రోజుకు రెండు పెగ్గులు. మా నాన్న బార్‌కి వెళ్లి ఒంటరిగా తాగేవారు. నాన్నకి అనారోగ్యం పాలైనప్పుడు ఆగిపోయారు.. కానీ అప్పుడప్పుడు బార్‌కి వెళ్లేవారు. తన జ్ఞాపకాలను పునరుద్ధరించుకోవడానికి. నాన్న సాధారణ నీరు మాత్రమే తాగి తిరిగి వచ్చేవారు. బార్లో ఉన్న వ్యక్తి మా నాన్నని చూసినప్పుడు, గ్లాసులో మంచినీళ్లు పోసి ఇచ్చేవాడు.”

నేను మళ్ళీ అమృత తండ్రికి సముద్రాన్ని చూపించాను. ఆలువ పట్టణము చూపించాను.

పాత విమల టాకీస్ ఉండే ప్రదేశాన్ని చూపించాను. కూల్చివేసిన టాకీస్ ఎక్కడ ఉందో అని అమృత తండ్రికి వెంటనే

అర్థమైంది. అప్పుడు పాట వచ్చింది! ప్రశ్న వచ్చింది!

నాన్న గతంలో విమల టాకీస్ నుండి చూసిన సినిమాల్లోని ఏ పాట అది?

‘ఆలువ నది….’

‘వసంతం పోయే సమయం….’

‘యవనసుందరి….’

కారులో కూర్చుని, చాలా సేపు లోపల పాట వింటున్నప్పుడు నాన్న కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.

మా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసింది అమృత మామ. అప్పుడు నాన్నగారు ఆ గుంపులో నిశ్శబ్దంగా,సంతోషంగా కూర్చుండిపోయారు. అప్పుడు నాన్న

‘వింటున్నావా’ లేదా అనే ప్రశ్నే అడగలేదు. రాబోయే తుల మాసంలో పెళ్లి నిర్వహించాలని వారు నిర్ణయించారు. అప్పటికి, నేను త్రిషురర్ కి బదిలీ అయ్యాను. నేను వారం చివరిలో  వచ్చేవాడ్ని. అమృత ఎప్పుడు పిలిచినా, ఆమె తన తండ్రి నా కోసం వెతుకుతున్నాడని సంజ్ఞా భాషలో చెప్పేది.

నాన్నగారు చాలా కాలంగా లోపల పాట వినలేదు. అమృత నాన్నకి గుండెపోటు వచ్చిందని, ఆసుపత్రిలో ఉందని ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను సెలవు తీసుకుని వెంటనే వొచ్చేసాను.జ్ఞాపకాలు ఇంకా తగ్గలేదు. ఐసియులోకి వెళ్లి నాన్నని చూసే ధైర్యం నాకు లేదు. ఆయన ‘వింటున్నావా’ అని అడిగితే?

ఆయన లోపల విన్న చివరి పాట ఏమిటి?

నేను అమృత ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న గదికి దక్షిణం వైపు తల పెట్టి, పాట వినకుండా, చాప మీద నిశ్చలంగా పడుకుని ఉన్నారు.

అమృత నా దగ్గిరకు వోచ్చేటప్పుడు, నేను అడిగాను.

“నాన్నగారికి పాట వినీపించాలా?”

“వినిపించాలి! నాన్న ఇంతకు ముందు అలాంటి కోరికే ఒకటి పెట్టుకున్నారు. నేను చనిపోయినప్పుడు ‘ఆ పాటను’ నా తల దగ్గర ఉంచుకోవాలని కోరుకుంటున్నారు.”

“అది ఏ పాట?”

అమృత ఆ పాట చెప్పింది.

నేను నా ల్యాప్‌టాప్ పెన్ డ్రైవ్‌లో రిపీట్ మోడ్‌లో పాటను రికార్డ్ చేసి నాన్న తలపైన మండుతున్న దీపం పక్కన ఉంచాను.

గది మొత్తం పెద్ద శబ్దంతో ఆ పాట్ట నిండిపోయింది.

అప్పుడు నేను నిశ్శబ్దంగా లోలోపల అడిగాను.

‘మీరు వింటున్నారా?’

వి. ఆర్. సుధీష్
రాజీవన్ ముడియాడ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *