కడలిని చీల్చుకుంటూ
తూర్పు వేదికపై
రోజుకో రసోదయం
సౌర దేహం ముక్కలు
ఒక్కోటీ ఒక్కో
ఎండమాటలా తాకుతున్నాయి
ఎక్కుపెట్టిన
ఎండబాణాలు తగిలి
దేహమంతా స్వేదస్రావం
మలిన బిడారాలపైన
మరకలు చెరిపేస్తూ సౌరచాలనం
చెట్టుకి హరితాంశను తాపే
పత్ర ప్రాణ సంయోగం
గడియారాల కొలువు
మొదలుపెట్టే దివాసంరంభం
నిజానికి, గోళాల చలన భ్రమణాలే
దివారాత్రాల కంచెలు,
కాలానికి కొలతలు.
కాంతిదూత
పడమటి ప్రయాణమన్నది
ఒక భ్రాంతి మాత్రమే
సౌరయానం
