నలుగురు అమ్మాయిలు తరవాత. సారాకి అబ్బాయి పుట్టాడు. అతని తండ్రి అమోస్ కి ఎంతోసంతోషం వేసింది. ఆ అబ్బాయి నామకరణం రోజున మూడు పేర్లు జాన్ చికిస్ ఓబియాజులు అని పెట్టేరు.
ఆఖరిపేరు అర్థం, ఆఖరికి మనసుకి విశ్రాంతి కలిగిందని. యీ పేరు విన్న ఎవరికైనా వెంటనే తెలుస్తుంది. ఎవని దాని ఓనరు ఒక్కడే కొడుకు అని. చికె ఒక్కడే కొడుకు.
వాడి అక్కలలగే వాడు కూడా తెల్లవాళ్ళ పద్ధతిలో పెంచ బడ్డాడు, అంటే సంప్రదాయానికి విరుద్ధంగా చాలా ఏళ్ళకి ముం అతను దానితో. కుటుంబంలో అందర్నీ పొద్దున్నే, మొదట రాత్రి ఆఖరిని ప్రార్ధనలకి పిలిచేవాడు. తెల్లవాడి విధానాల్లో ఇది ఒకటి. పొరుగు ఇళ్లల్లో ఏవి తినవద్దని సారా తన పిల్లలకి నేర్పింది ఎందుకంటె వాళ్ళు వాళ్ళ విగ్రహాలకు ఆహారం పెడతారు పిల్లల బాధ్యత అందరిదీ అన్న పాత ఆచారాన్ని పాటించింది.
ఓనాడు పక్కింటావిడ చీకే కి జున్ను ముక్క ఇచ్చింది అప్పుడు వాడికి నాలుగు ఏళ్ళు. వాడు తల అడ్డంగా ఊపి మేము పైవాళ్ళు ఇచ్చినది తిన్నాము అన్నాడు ఆవిడకి చాల కోపం వచ్చిన అణుచుకుంది తనలో తనే యీ రోజుల్లో తెల్లవాడి ధర్మవా అని, ఓసు లకి గర్వం ఎక్కువ ఐంది అనుకుంది.
ఆవిడ రైట్, ఇదివరకు ఒసు వాళ్ళు మాములు వాళ్ళ దగ్గర తల ఎత్తేవారు కాదు. ఆ తెగ వాళ్ళ దేవుళ్ళకి వాడు దాసుడు వాడు మామూలువాళ్ళని పెళ్లి చేసుకోకూడదు వాళ్ళ, జాతిలో ఏ బిరుదులూ తీసుకోకూడదు వాడు చనిపోతే వాళ్ళ వళ్లే పాతిపెట్టాలి.
ఇప్పిడు అదంతా మారిపోయింది మారడం ప్రారంభం ఐంది. ఓసు పిల్లడు మామూలు వడివేపు చూసి మిగిలిన వాళ్ళ తిండి గురించి మాట్లాడుతాడు. తెల్లవాడు చాలా విషయాలు సాధించేడు. చికె నాన్న వాస్తవాని కి ఓసు కాదు కానీ క్రిస్టియన్. ఓసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆరకంగా ఓసు ఐనవాళ్ళని అంతవరకు వినలేదు. అమోస్ పిచ్చివాడు కాదు కొత్త మతం అతని తలకి ఎక్కింది అది తాటి కల్లు లాటిదీ కొంతమంది దాన్ని తాగినా
తెలివిగా ఉంటారు. మిగిలినవాళ్ళకి మతి ఉండదు
అమోస్ పెళ్ళికి మద్దతు ఇచ్చినవాడు తెల్ల మిషనరీ మిస్టర్ బ్రౌన్. అతను ఒక తాటాకు పాకలో ఉంటాడు జనం అతన్ని చాల గౌరవిస్తారు అతని ప్రవచనాలు వల్ల కాదు అతని డిస్పెన్సరీ వల్ల. కొన్నిరోజుల తరవాత అతను తన విధవ తల్లికి చెప్పేడు ఆవిడ యీమధ్యనే క్రిస్టియానిటీకి మారి ఎలిజబెత్ అన్న పేరు పెట్టుకుంది అని. ఆ షాక్ సుమారు ఆవిడని చంపేసింది.
కోలుకున్నాక ఆవిడ అమోస్ ని ఆపని చెయ్యవద్దని బతిమాలింది. కానీ అతను వినలేదు.
ఆఖరికి ఆవిడా ఒక దైవజ్ఞుడుని. సలహా అడిగింది. అతను చాల తెలివైన వాడు. అతను తన గుడిసెలో తాబేలు చిప్ప మీద కొడుతూ ప్రస్తుతం కాక ఏవి జరిగిందో ఏవి జరగబోతోందో చూసేడు. అతన్ని నాలుగు కళ్ళ వాడు అని పిలుస్తారు.
ఎలిజబెత్ వెళ్లగానే ఆవిడ ఎందుకు వచ్చిందో చెప్పేడు. నీ కొడుకు తెల్లవాడి మతంలో చేరెడు నువ్వు కూడా యి ముసలితనంలో చేరేవు వాడికి పిచ్చి పట్టింది అంటే నీకు ఆశ్చర్యంగా ఉందా? ఆఖరికి అతను చికిత్స చెప్పేడు. మీ పూర్వులు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళని ఒక మేక తో శాంత పరచాలి అన్నాడు. ఆముసలి ఎలిజబెత్ ఆ తంతులన్నీ జరిపించింది. కానీ కొడుకు ఏవి మారలేదు. సారా అనే ఒక ఒసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎలిజబెత్ తన కొత్త మతం వదిలేసి పాత దానికిమారిపోయింది.
మనం అసలు కథ నించి తప్పిపోయెమ్ కానీ చీకే వాళ్ళ నాన్న. ఒసు ఎలా అయ్యేదన్నది తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటె ఇప్పటికి అన్ని తారుమారు ఐన కథ అరుదు ఇప్పుడు మళ్ళీ పొరుగింటి తిండి కాదన్నా నాలుగేళ్ళ చీకే దగ్గరకి వద్దాం.
రెండేళ్ల తరవాత వాడు ఊరిలో ఉన్న స్కూల్ కి వెళ్ళేడు ఇప్పుడు వాడి కుడి చెయ్యి తల మీదుగా ఎడమ చెవి పట్టుకోగలడు అంటే వాడు తెల్లవాడివి నేర్చుకోవడమ్ అలవాటు పడతాడని అర్థం. వాడికి కొత్త పలక పెన్సిల్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా. స్కూల్ యూనిఫారం తెల్ల షర్ట్, బ్రౌన్ ఖాకి నిక్కరు అంటే మరీ ఇష్ఠం. కొత్త టర్మ్ మొదటి రోజు వచ్చినప్పుడు వాడి బుర్రలో టీచర్ ల గురించి. వాళ్ళ బెత్తం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాడికి వాడి అక్కలు పాడిన పాత గుర్తుంది.
ఇబోలో టీచర్లు పిల్లల్ని చావ కొడతారన్న వార్త ఉంది కానీ అతను వాళ్ళని కొడతాడు అనడంలో సందేహం లేదు. చికె వాటిగురించి ఎక్కువ ఆలోచించేవాడు.
చాలా చిన్నవాడు అవడం వల్ల చికె ని మతం క్లాసుకి పంపేరు అక్కడ పాటలు డాన్సులు ఉండేవి వాడికి అక్షరాలు శబ్దం లయ ఇష్టం క్లాస్ గుండ్రంగా ఏర్పడి టీచర్ వేసిన సీజరు ఎవరు?
అన్న ప్రశ్నకి డాన్స్ చెయ్యాలి వాళ్ళ డాన్సుకి ఏవి ఉండదు. ఇరవై శతాబ్దంలో సీజర్ ప్రపంచాన్ని ఏలడం లేదు. అప్పుడప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో పాడేవారు. చిక్ ‘కి టెన్ గ్రీన్ బాటిల్స్ ‘ అన్నది ఇష్టం. వాళ్ళకి మాటలు నేర్పేరు కానీ మొదటిది ఆఖరిది గుర్తున్నాయి. మధ్యవి కేవలం గొణగడమే. యి రకంగా మొదటి ఏడాది అయిపోయింది చికె ని ఇంఫంట్ స్కూల్ కి ప్రమోట్ చేసేరు.
అక్కడ కొంచెం సీరియస్ గానే ఉంటుంది ఆస్కూల్ గురించి మనం రాయనవసరం లేదు.అది పెద్ద కథ అవుతుంది. ప్రైమరీ స్కూల్ లో అతని స్వంత వ్యక్తిత్వం ఎదగడం ప్రారంభించింది. వాడికి లెక్కలు అంటే విపరీతమైన అసహ్యం వాడికి కథలు పాటలు ఇష్టం ముఖ్యంగా ఇంగ్లీష్ మాటలు ఇష్టం ఏవి అర్థం కాకపోయినా కొన్ని చాలా ఉల్లాసంగా ఉండేవి. పెరివింకలే అన్నది ఒక మాట వాడు దాన్ని ఎలా నేర్చుకున్నాడో కానీ దాని అర్థం మరిచిపోయేడు వాడికి స్వంత అర్థం ఉంది అది ఫెయిరీ ల్యాండ్ కి సంబంధించినది.
చికె టీచెర్కి పొడుగు మాటలు అంటే ఇష్టం. అతను చాలా తెలివైన వాడని అంటారు. అతని ఇష్టమైన హాబీ ఛాంబర్స్ డిక్షనరీ లోని పెద్ద పెద్ద మాటలు కాపీ చెయ్యడం అవెలా క్లాస్ అంత అతన్ని పొగిడేరు. లేట్ గ వచ్చి జవాబులేని ఒక కుంటి సాకు చెప్పిన కుర్రాడిని పడగొట్టేసేడు వాయిదా వెయ్యడం అనేది సామాన్యుడి క్షమాపణ అన్నాడు అతను చెప్పే ప్రతి పాఠం లోను అతని పాండిత్యం తెలిసేది ప్రతి పాఠం మరిచిపోలేనిది. విత్తనం తాలూకు పంపకం మీద పాఠం చికె కి ఎప్పుడు గుర్తు ఉంటుంది టీచర్ ప్రకారం అది ఐదు రకాలు. మనుషులాద్వారా, జంతువుల ద్వారా, నీటి ద్వారా, గాలిద్వారా, పేలుడు ద్వారా పిల్లలు అందరు అన్ని మరిచిపోయినా పేలుడు గుర్తు పెట్టుకున్నారు.
న్యూ మెథడ్ రీడర్ లోని మొదటి వాక్యాలు సులువుగా ఉన్న అవి వాడి అస్పష్టమైన ఉల్లాసంతో నింపేయి. ఒకప్పుడు ఒక మాంత్రికుడు ఉన్నాడు అతను ఆఫ్రికా లో ఉండేవాడు అతను ఒక లాంతరు కోసం చైనా వెళ్ళేడు చికె దాన్ని ఇంటి దగ్గర పదే పదే చదివేడు. తరవాత దాన్ని పాట చేసేడు అది అర్థం లేని పాట పెరియింకాల్స్ దానిలో వచ్చేయి డెమాస్కస్ కూడా వచ్చేడు. అది వాడికి కొత్త మాజికల్ ప్రపంచం చూపించే కిటికీ లాటిది. ఏది ఏమైనా వాడు సంతోషంగా ఉన్నాడు.