మహిళా నీకిదే వందనం…

Spread the love

ఎక్కడ సమానత్వం..
ఎక్కడ సమున్నత్వం..
ఏ తరమైనా ఎక్కడుంది
తరుణికి విలువ..
అంతరిక్ష విజేత అయినా
అంతర్జాతీయ అణచివేతే కదా..

మాటల్లోనే మహిళా చట్టాలు..
అవి మగవాళ్ళకే చుట్టాలు..
శైశవంలో తల్లిదండ్రుల వీక్షణలో..
బాల్యంలో గురువుల శిక్షణ లో..
కౌమారాన  అన్నదమ్ముల పర్యవేక్షణలో..
యౌవనంలో తన పతి రక్షణలో..
వృద్ధాప్యాన బిడ్డల పోషణలో...
తన ప్రతిపయనంలోను
స్వేచ్ఛేలేని పరాధీనే...


..స్వేచ్ఛా విహంగమై
ఎగరాలనుకున్న   ఆమె రెక్కలను
మనుధర్మపు కట్టుబాట్లతో కట్టేసి
స్త్రీ అంటే ఇలాగే ఉండాలని శాసించినా
బాల్యాన్ని బలిచేసి పసుపు తాడుతో
బంధించినా...

తాను మాత్రం నమ్ముకున్న బంధాలకై
తన వాళ్ళ చిరునవ్వులకై
తాను మాత్రం క్రొవ్వొత్తిలా కరుగుతూ
తనువుకు మనసుకు అయిన గాయాలనుసైతం
చిరునవ్వుగా మార్చుకుని
కుటుంబాన్ని నడిపే మహిళకు
వందనం చేద్దాం
కనకదుర్గ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *