జాతి హత్యాకాండకు సాక్ష్యంగా ఉన్న కేలండర్!

Spread the love





2024 సంవత్సరం ఒకేసారి జాతి హత్యా కాండను, ఏ ప్రతిఘటనా లేని ప్రపంచ నిశ్శబ్దాన్ని చూసిన కాలం !
** రక్తంతో కడిగిన చేతులతో ఫలహారం చేస్తున్నారు
బడా రాజకీయ నాయకులు!
*
మానవత్వం ఎలా మంటగలిసిందో,
నరసంహారం ఎలా ఉదాసీన ధోరణిలో ఖండించబడడమే శాంతికి కి ఉపమానంగా ఉండిందో
అదిగో అలాంటి సంఘటనల కి సాక్ష్యం గా ఉంది ఈ 2024వ సంవత్సరం!
ఇంకా మేధావులు అత్యంత ఎక్కువగా అంచనా వేయబడ్డ జాతులుగా గుర్తించబడ్డ సంవస్తరమది!
*
2024 కి చెందిన 12డబ్బాలను వెనక్కి తిరిగి చూసినప్పుడు,
ప్రతీ డబ్బా ఒక శవ పేటికై చిన్నిచిన్ని చేతులు ,బహుశా ఇంకా పెద్ద శరీర భాగాలు మోసేవిగా కనపడ్డాయి.
*
2024 అనేది ఒక కాలెండర్ అయ్యి,నిత్యం మా మొహాల మీద వేలాడుతూ
క్రూరమైన జాతి హత్యాకాండ ఎలా నిజ జీవితంలో మా ముఖాల మీద ఘోర నేరమై నిలిచినపోయిందో చెబుతుంది!
ఈ హత్యల్లో ఉన్న మా అందరి వైఫల్యాన్నీ ఒక గ్నాపికలాగా గుర్తు చేస్తూనే ఉంటుంది !

Moumita Alam
గీతాంజలి

Dr. Bharati : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). ''బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం ' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.


Spread the love

One thought on “జాతి హత్యాకాండకు సాక్ష్యంగా ఉన్న కేలండర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *