“అతను యూటోపియా అని అన్నాడు , గ్రీకుబాషలో దానర్ధం ‘ఎక్కడా లేని స్థలం” అని. – క్వెవెడో
ప్రతి కొండ ఒకేలా ఉండదు, కానీ భూమి మీద ఎక్కడైనా సమతల భూములు ఒకేలా ఉంటాయి. నేను అలాంటి ప్రాంతంలో ప్రయాణిస్తున్నాను, ఇది ఒకలాహోమా లేదా టెక్సాస్ లేదా సాహిత్యకారులు పంపా అని పిలిచే అర్జెంటీనా భాగమా అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. అయినా పెద్ద విషయం కాదు. నా కుడి లేదా ఎడమ వైపు ఎటువంటి కంచె కనిపించలేదు. ఇతర సందర్భాల్లో లాగానే, నేను కవి ఎమిలియో ఒరిబే యొక్క ఈ పంక్తులను నెమ్మదిగా పునరావృతం చేశాను:
“అంతులేని అద్భుతమైన సమతలపు యొక్క హృదయంలో బ్రెజిల్
సరిహద్దుకు దగ్గరగా, ఇది నిరంతరం పెరుగుతూ, ఎప్పటికీ విస్తరిస్తూ ఉంటుంది.”
దారి గతుకులగా ఉంది. వర్షం పడటం ప్రారంభమైంది. రెండు లేదా మూడు వందల గజాల దూరంలో ఒక ఇంటి వెలుగును చూశాను, అది దీర్ఘచతురస్రాకారంగా, చెట్లతో చుట్టబడి ఉంది. తలుపు తెరిచిన వ్యక్తి చాలా పొడవుగా ఉన్నాడు, తను నాకు దాదాపు భయం కలిగించాడు. తను బూడిద రంగు బట్టలు ధరించాడు. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు నాకు అనిపించింది. తలుపుకు తాళం లేదు.
మేము చెక్క గోడలతోఉన్న పొడవైన గదిలోకి వెళ్ళాము, అక్కడ ఒక టేబుల్, కుర్చీలు ఉన్నాయి. పైకప్పు నుండి పసుపు రంగు వెలుగును విడుదల చేస్తూ దీపం వేలాడుతోంది. టేబుల్, ఏదో కారణంగా, నాకు విచిత్రంగా అనిపించింది. దానిపై ఒక నీటి గడియారం ఉంది, నేను ఎప్పుడూ అటువంటిది చూడలేదు. ఆ వ్యక్తి సైగతో నాకు కుర్చీ చూపించాడు.
నేను వివిధ భాషలను ప్రయత్నించాను, కానీ మేము ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. చివరికి అతను లాటిన్‌లో మాట్లాడాడు. నాకు ఇప్పుడు దూరమైన పాఠశాల రోజుల నుండి నాకు గుర్తున్న జ్ఞాపకాల దుమ్ము దులిపి, సంభాషణకు సిద్ధమయ్యాను.
“ మీ బట్టల వల్ల మీరు వేరే కాలం నుండి వచ్చారని నాకనిపిస్తోంది.,” అని అతను అన్నాడు. “భాషల వైవిధ్యం దేశాల వైవిధ్యానికి కారణమైంది. యౌద్ధాలకుకూడ; ప్రపంచం మళ్లీ లాటిన్‌పై ఆధారపడింది. కొందరు ఇది మళ్లీ ఫ్రెంచ్, లెమోసి, లేదా పాపియామెంటోగా క్షీణించవచ్చని భయపడతారు, కానీ అది తక్షణ ప్రమాదం కాదు. ఏది ఏమైనా, గతం లేదా భవిష్యత్తు నాకు ఆసక్తి కలిగించవు.”
నేను ఏమీ అనలేదు, అతను ఇలా అన్నాడు, “మరొకరు భోజనం చేయడం చూడటం మీకు అభ్యంతరం లేకపోతే, మీరు నాతో బోజనం చేయవచ్చు.”
అతను నా అసౌకర్యాన్ని గమనించటంచూసి, నేను సరే అన్నాను. మేము రెండు వైపులా తలుపులతో ఉన్న ఒక కారిడార్ గుండా వెళ్ళాము, అది పూర్తిగా లోహంతో తయారైన చిన్న వంటగదికి దారితీసింది. మేము ఒక ట్రే మీద మా భోజనంతో తిరిగి వచ్చాము – కార్న్‌ఫ్లేక్స్ గిన్నెలు, గుత్తులుగా ఉన్న ద్రాక్షలు, నాకు అంజీర్‌లను గుర్తు చేసే ఒక అపరిచిత ఫలం, ఒక పెద్ద నీటి కూజా. నాకు గుర్తుననంత వరకు అక్కడ బ్రెడ్ లేదు.మాకు అతిథ్యమిస్తున్న వ్యక్తి ముఖ కవళికలు తీక్షణంగా ఉన్నాయి, అతని కళ్ళలో ఏదో అసాధారణమైనది ఉంది. నేను అతని పాలిపోయిన, కటొరంగా ముఖాన్ని ఎప్పటికీ మరచిపోలేను. , అది నేను మళ్లీ ఎప్పటికీ చూడలేనిది. అతను మాట్లాడేటప్పుడు ఎటువంటి సైగలు చేయలేదు. లాటిన్‌లో సంభాషించాల్సి రావడం నాలుక నన్ను నిరోధించింది, కానీ చివరికి నేను ఇలా అన్నాను, “నా ఆకస్మిక రాక మిమ్మల్ని ఆశ్చర్యపరచలేదా?”
“లేదు,” అని అతను చెప్పాడు.
“శతాబ్దానికి ఒకసారి ఇలాంటి సందర్శనలు మాకు వస్తాయి. అవి ఎక్కువ కాలం ఉండవు. రేపటికి, ఆలస్యంగా అయినా,మీరు మీ ఇంటికి తిరిగి వెళ్తారు .”
అతని స్వరంలోని ఖచ్చితత్వం నాకు ఉపశమన కలిగించింది. నన్ను నేను పరిచయం చేసుకోవడం సముచితమని భావించాను. “నేను యూడోరో ఆసెవెడో. నేను 1877లో, బ్యూనస్ ఎయిర్స్ నగరంలో పుట్టాను. నాకు డెబ్బై ఏళ్ళు. నేను ఇంగ్లీష్ , అమెరికన్ సాహిత్యాల ప్రొఫెసర్‌ని, ఊహాత్మక కథల రచయితని.”
“నాకు ఇబ్బంది లేకుండా రెండు ఊహాత్మక కథలను చదివిన గుర్తు ఉంది, అవి చదవడం సంతోషకరంగా ఉంది,” అని అతను చెప్పాడు. “కెప్టెన్ లెమ్యూల్ గుల్లివర్ ప్రయాణాలు, చాలా మంది నిజమని భావిస్తారు, అలాగే సమ్మా థియోలాజియా. అయితే వాస్తవాల గురించి మాట్లాడకుండా ఉందాం.”
“వాస్తవాలు ఇప్పుడు ఎవరికీ పట్టవు. అవి కేవలం సృజనాత్మక క్రీడలు, ఊహాలకి ప్రారంభ బిందువులు మాత్రమే. మా పాఠశాలల్లో సందేహం, మరచిపోయే కళను నేర్పేవాళ్ళు – ముఖ్యంగా, వ్యక్తిగతమయిన, స్థానికమైన వాటిని మరచిపోవటాన్ని. మేము కాలంలో జీవిస్తాము, అది క్రమానుగతంగా ఉంటుంది, కానీ మేము శాశ్వతత్వం అనే భావన క్రింద జీవించడానికి ప్రయత్నిస్తాము. భాష మర్చిపోయినా, గతం నుండి మేము కొన్ని పేర్లను మాత్రమే ఉంచుకుంటాము, మేముచ్చి అర్ధరహిత ఖచ్చిచితత్వాన్ని పట్టించుకొము. మాకు తేదీలు లేదా చరిత్ర లేదు. గణాంకాలు కూడా లేవు. మీరు మీ పేరు యూడోరో అని చెప్పారు. నా పేరు మీకు చెప్పలేను, ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కళ్ళు ‘ఎవరో ‘ ‘ నువ్వు’ అని పిలుస్తారు.”
“మరి మీ తండ్రి పేరు ఏమిటి?”
“అతనికి ఏ పేరూ లేదు.”
ఒక గోడపై నేను ఒక బుక్ షెల్ఫ్ చూశాను. నేను అందులోంచి ఒక పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరిచాను; అక్షరాలు స్పష్టంగా, అర్థం కానివిగా ఉన్నాయి, అవి చేతిరాతలో ఉన్నాయి. వాటి కోణీయ రేఖలు నాకు రూనిక్ అక్షరమాలను గుర్తు చేశాయి, అయితే అవి కేవలం శాసనాల కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి. భవిష్యత్తులో మనుషులు ఎక్కువ ఎత్తుగలవారే కాక, మరింత నైపుణ్యం కలిగి ఉన్నారని నేను ఆలోచించాను. సహజస్పందనతో నేను అతని పొడవైన, సన్నని వేళ్లను చూశాను.
“ఇప్పుడు నీవు ఎప్పుడూ చూడనటువంటి దాన్ని చూడబోతున్నావు,” అని అతను అన్నాడు. అతను నాకు థామస్ మూర్ రాసిన యూటోపియా పుస్తకాన్ని ఇచ్చాడు, ఇది 1518లో బాసెల్‌లో ముద్రించబడింది; దానిలో పేజీలు,బొమ్మలు లేవు.
కొంత అసంతృప్తితో నేను ఇలా సమాధానమిచ్చాను, “ఇది ముద్రిత పుస్తకం. నా ఇంట్లో రెండు వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి, అయినప్పటికీ అవి ఇంత పాతవి లేదా విలువైనవి కావు.” నేను శీర్షికను బిగ్గరగా చదివాను.
ఆ వ్యక్తి నవ్వాడు. “ఎవరూ రెండు వేల పుస్తకాలు చదవలేరు. నేను జీవించిన నాలుగు శతాబ్దాలలో, నేను అరడజను కంటే ఎక్కువ చదవలేదు. అసలు, పఠనం కంటే పునఃపఠనం కీలకం. ముద్రణా ఇప్పుడు నిషేదించబడింది . ఎందుకంటే ఇది అనవసరమైన గ్రంథాలను మితిమీరిన స్థాయికి విస్తరించింది.
“ప్రతి రోజూ, సాయంత్రం నుండి ఉదయం వరకు, కొన్ని చర్యలు జరుగుతాయని, వాటిని గురించి తెలియకపోవడం సిగ్గుచేటని ఒక అపోహ ఉండేది. ఈ గ్రహం కెనడా, బ్రెజిల్, స్విస్ కాంగో, కామన్ మార్కెట్ అనే వర్ణపట సమూహాలతో నిండిపోయింది . ఈ ప్లాటోనిక్ అంశాల గురించిన గత చరిత్ర దాదాపు ఎవరికీ తెలియదు, కానీ, వాస్తవానికి, ఇటీవలి బోధనావేత్తల సమావేశం గురించిన అత్యల్పమయిన విషయాలగురించి, లేదా వేరువేరు విషయాలో జరిగే విచ్ఛిన్నం గురించి , లేదా అధ్యక్షులు వెనక్కి, ముందుకి జారీ చేసిన ప్రకటనల గురించి, సెక్రటరీకి సెక్రటరీ ద్వారా రూపొందించబడిన, జాగ్రత్తగా రూపొందించిన అస్పష్టతతో కూడిన అన్ని వివరాలు తెలుసు, అని నేను”నా నిన్నటి వింతైన గతంలోంచి అన్నాను,
‘ ఈ విషయాలు చదివిన వెంటనే మరచిపోబడతాయి. ఎందుకంటే, కొన్ని గంటల తర్వాత, ఇతర అల్ప విషయాలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. అన్ని కార్యాకలాపాలలో, రాజకీయ నాయకుడి కార్యకలాపాలు నిస్సందేహంగా అత్యంత బహిరంగమైనది. ఒక రాయబారి లేదా క్యాబినెట్ మంత్రి ఒక రకమైన వికలాంగుడు, అతన్ని పొడవైన, శబ్దం చేసే వాహనాలలో తీసుకెళ్లాల్సి ఉంటుంది, మోటార్‌సైకిల్‌లు, సైనిక ఎస్కార్ట్‌లతో చుట్టుముట్టబడి, ఆత్రుతగా ఎదురుచూసే ఫోటోగ్రాఫర్‌లు ఎదురుంటారు. వాళ్ళ పాదాలు కత్తిరించబడినట్లు అనిపిస్తుంది, మా అమ్మ చెప్పేది. చిత్రాలు, ముద్రిత పదాలు వాటిని సూచించే వస్తువుల కంటే ఎక్కువ నిజమని, ప్రచురించబడినవి మాత్రమే నిజమైనవాని. మా ఏకైక ప్రపంచ భావన సూత్రం, సాధనం లక్ష్యం ఎస్సే ఎస్ట్ పెర్సిపి – అస్తిత్వాన్ని పటంకట్టటం. గతంలో, ప్రజలు నమ్మదగినట్లుగా ఉండేవారు; ఒక వస్తువు మంచిదని దాని తయారీదారులు పదేపదే చెప్పడం వల్ల నమ్మేవారు. దొంగతనాలు కూడా తరచూ జరిగేవి, అయినప్పటికీ డబ్బు, వస్తువులను స్వాధీనపర్చుకోవటం ఎక్కువ సంతోషం లేదా మనశ్శాంతిని తెచ్చిపెట్టదని అందరికీ తెలుసు.”
“డబ్బు?” అని మాకు అతిధ్యం ఇస్తున్న వ్యక్తి పునరావృతం చేశాడు. “ఇప్పుడు ఎవరూ దారిద్ర్యం బాధను, అది తట్టుకోలేనిది కావచ్చు, లేదా సంపదను, అది అత్యంత అసౌకర్యమైనది కావచ్చు, భరించరు. ప్రతిఒక్కరికీ చేయాల్సిన ఒక వృత్తి ఉంది.”
“రబ్బీల లాగా,” అన్నాను.
అతను అర్థం చేసుకోలేదనిపించింది. తను ఇలా అన్నాడు, “ఇప్పుడు నగరాలు కూడా లేవు. నేను ఒకసారి ఆసక్తితో అన్వేషించిన బాహియా బ్లాంకా శిథిలాలను బట్టి చూస్తే, పెద్దగా నష్టం జరగలేదు. ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు లేవు, వారసత్వాలు లేవు. వంద సంవత్సరాల వయస్సులో, ఒక వ్యక్తి పరిపక్వత చెందినప్పుడు, తనను తాను , తన ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పటికి అతను ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉంటాడు.”
“ఒక బిడ్డనా?” నేను అడిగాను.
“అవును. ఒక్క బిడ్డ మాత్రమే. మానవ జాతిని మితిమీరి ప్రొత్సహించాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ విశ్వాన్ని గురించిన స్పృహ అనేది దైవత్వం నుంచి వస్తుందని భావిస్తారు, కానీ అలాంటి దైవత్వం ఉందా లేదా అనేది ఎవరికీ నిజంగా తెలియదు. ప్రస్తుతం చర్చించబడుతున్నది భూమిపై ప్రతి వ్యక్తి క్రమంగా లేదా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు గురించి అని నేను నమ్ము తాను. సరే , మనం మాట్లాడుతున్న విషయానికి తిరిగివద్దాం.”
నేను తలూపాను.
“వంద సంవత్సరాలకు చేరుకున్న తర్వాత, వ్యక్తికి ఇక ప్రేమ లేదా స్నేహం అవసరం ఉండదు. జబ్బు, అనూహ్య మైన మరణం గురించిన భయం ఉండదు. అతను ఏదో ఒక కళను లేదా తత్వశాస్త్రాన్ని లేదా గణితాన్ని అభ్యసిస్తాడు లేదా ఒంటరిగా చదరంగం ఆడతాడు. అతను కోరుకున్నప్పుడు, తనను తాను చంపుకుంటాడు. మనిషి తన జీవితానికి తనే యజమాని. తన మరణానికి కూడా తనే యజమాని.”
“ఇది ఒక ఉల్లేఖనా (కొటేషన్)?” అని నేను అడిగాను.
“వాస్తవానికి. ఇప్పుడు మనకున్నవి ఉన్నవి కేవలం ఉల్లేఖనలు మాత్రమే. మన భాష ఒక ఉల్లేఖనల వ్యవస్థ.”
“మరి నా కాలం లోని గొప్ప సాహసం – అంతరిక్ష ప్రయాణం సంగతి ?” నేను అడిగాను.
“ఆ ప్రయాణాలు శతాబ్దాల క్రితం వదిలివేయబడ్డాయి. అవి నిశ్చయంగా ప్రశంసనీయమైనవి, కానీ మనం ఎప్పటికీ ఇక్కడ, ఇప్పుడు నుండి తప్పించకోలేం .” చిరునవ్వుతో, మళ్ళీ తను ఇలా అన్నాడు:
“అంతేకాక, అన్ని ప్రయాణాలు అంతరిక్షంలోనే ఉంటాయి. ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి వెళ్లడం అంటే ఎదురుగా ఉన్న పొలాని వెళ్లడం లాంటిది. నీవు ఈ గదిలోకి ప్రవేశించినప్పుడు, నీవు అంతరిక్ష ప్రయాణం చేశావు.”
“అది నిజం ” అని నేను అన్నాను. “ఒకప్పుడు రసాయన పదార్థాల గురించి, జంతువుల గురించి కూడా మాట్లాడే వాళ్ళు .”
ఆ వ్యక్తి ఇప్పుడు వెనక్కి తిరిగి, బయటికి చూశాడు. కిటికీల ఆవతల, సమతల భూమి నిశ్శబ్దమైన మంచు, చంద్రకాంతితో తెల్లగా ఉంది.
నేను ధైర్యంతో ఇలా అడిగాను, “ఇంకా మ్యూజియమ్‌లు, గ్రంథాలయాలు ఉన్నాయా?”
“లేవు. మేము గతాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాము, స్మృతి గీతాల రచనకు దాన్ని గుర్తుంచుకొంటం. ఇప్పుడు స్మారకాలు, వార్షికోత్సవాలు లేదా చనిపోయినవారి ప్రతిమలు లేవు. ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన కళలు, విజ్ఞాన శాస్త్రాలను తామే సృష్టించుకోవాలి.”
“అప్పుడు ప్రతి ఒక్కరూ తన సొంత బెర్నార్డ్ షా, తన సొంత యేసు క్రీస్తు, తన సొంత ఆర్కిమెడిస్ కావాలి.”
నా ప్రకటనను తను పూర్తిగా ఆమోదించాడు.
“ప్రభుత్వాలకు ఏమైంది?” అని అడిగాను.
” అవి క్రమంగా ఉపయోగం లేకుండా పోయాయి, ఎన్నికలు నిర్వహించారు, యుద్ధాలు ప్రకటించారు, పన్నులు వసూలు చేశారు, ఆస్తులను జప్తు చేశారు, అరెస్టులు ఆదేశించారు, సెన్సార్‌షిప్‌ను విధించడానికి ప్రయత్నించారు, కానీ భూమిపై ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదు. పత్రికలు ప్రభుత్వ నాయకుల వార్తలను, ఫోటోలను ప్రచురించడం ఆపివేశాయి. రాజకీయ నాయకులు నీతిమంతమైన పనిని వెతుక్కోవాల్సి వచ్చింది; కొందరు మంచి హాస్యనటులు లేదా భూత వైద్యులుగా మారారు. వాస్తవంగా జరిగినది ఈ సారాంశం కంటే చాలా సంక్లిష్టంగా ఉండవచ్చు.”
అతను స్వరాన్ని మార్చి ఇలా అన్నాడు, “నేను ఈ ఇంటిని నిర్మించాను, ఇది మిగతా అన్ని ఇళ్ళ లాగే ఉంది. నేను ఈ ఫర్నిచర్, ఉపకరణాలను చెక్కాను. నేను ఈ పొలాలను సాగు చేశాను, వీటిని నాకు తెలియని వ్యక్తులు మెరుగుపర్చి ఉంటారు. మీకు కొన్ని వస్తువులను చూపిస్తాను.”
నేను అతనిని అనుసరించాను. ఒక పక్క గదిలో తను ఒక దీపాన్ని వెలిగించాడు; అది పైకప్పు నుండి వేలాడుతోంది. ఒక మూలలో నేను కొన్ని తీగలతో కూడిన సంగీత వాయిద్యం చూశాను. గోడలపై పసుపు రంగులు ప్రధానంగా కనిపించే దీర్ఘచతురస్రాకార కాన్వాస్‌లు ఉన్నాయి. ఆ మొత్తం పని ఒక వ్యక్తి చేసినట్లు లేదు.
“ఇది నేను చేసే పని,” అని తను చెప్పాడు.
నేను ఆ పెంయింటింగ్స్ పరిశీలించాను, అతి చిన్న కాన్వాస్ ముందు ఆగాను, అది సూర్యాస్తమయాన్ని సూచిస్తుంది. అందులో ఏదో అనంతమైనది ఉంది.
“నీకు ఇది నచ్చితే, ఒక భవిష్యత్తు స్నేహితుడి జ్ఞాపకంగా దీనిని తీసుకోవచ్చు,” అని తను ప్రశాంతంగా చెప్పాడు.
నేను అతనికి కృతజ్ఞతలు తెలిపాను, కానీ కొన్ని కాన్వాస్‌లు నన్ను గంధరగోళ పర్చాయి. అవి ఖాళీగా ఉన్నాయని నేను చెప్పలేను, కానీ అవి దాదాపు ఖాళీగానే కనిపిస్తున్నాయి.
“అవి నీ పూరాతన కళ్ళకు కనిపించని రంగులలో చిత్రించబడ్డాయి,” అని తను చెప్పాడు.
కొంత సమయం తర్వాత, అతని సున్నితమైన చేతులు తీగల వాయిద్యాన్ని మీటినప్పుడు, నేను అప్పుడప్పుడు ఒక్కొక్క మంద్రమయిన శబ్దాన్ని మాత్రమే వినగలిగాను.
అప్పుడే ఒక పెద్ద శబ్ధం వినిపించింది.
ఒక పొడవైన స్త్రీ , ముగ్గురు లేదా లేదా నాలుగు పురుషులు ఇంటిలోకి ప్రవేశించారు. వాళ్ళు అక్క తమ్ముళ్ళు కావచ్చు లేదా కాలం వాళ్ళని ఒకేరకంగా ఉండేటట్లు చేసిందని చెప్పవచ్చు. అతిధ్యం ఇచ్చిన వ్యక్తి మొదట స్త్రీతో మాట్లాడాడు.
“నీవు ఈ రాత్రి రాకుండా ఉండవని నాకు తెలుసు. నీవు నీల్స్‌ను చూశావా?”
“అప్పుడప్పుడు. ఇప్పటికీ తను చిత్రకళలో మునిగి ఉన్నాడు.”
“అతని తండ్రి కంటే గొప్పవాడు కావాలని ఆశిద్దాం.”
హస్తలిఖితాలు, చిత్రాలు, ఫర్నిచర్, ఉపకరణాలు – మేము ఇంట్లో ఏవీ వదిలిపెట్టలేదు. స్త్రీ పురుషులతో పాటు పని చేసింది. నా బలహీనత వల్ల నేను దాదాపు ఎటువంటి సహాయం చేయలేకపోయాను, అది నాకు సిగ్గుగా అనిపించింది. ఎవరూ తలుపు మూసుకోలేదు. మేము వస్తువులతో బయటకు వెళ్ళాము. ఇంటికి ఒక కోణాకార పైకప్పు ఉందని నేను గమనించాను.
పదిహేను నిమిషాల నడక తర్వాత, మేము ఎడమవైపు తిరిగాము. దూరంలో నేను ఒక రకమైన టవర్‌ను చూశాను, దాని పైన ఒక డోం ఉంది.
“అది శవదహన శాల. దానిలో డెత్ ఛాంబర్ ఉంది. దానిని ఒక దాత ఏర్పాటు చేశాడని అంటారు. అతని పేరు అడాల్ఫ్ హిట్లర్ అని నా నమ్మకం.” అని ఎవరో అన్నారు.
మాకు అతిధ్యం ఇచ్చిన వ్యక్తి ఎత్తు ఇప్పుడు నన్ను ఆశ్చర్యపరచలేదు, మాకోసం గేట్ తెరిచాడు. మాకు అతిధ్యం ఇచ్చిన వ్యక్తి అతనితో కొన్ని మాటలు గుసగుసలు లాగా చెప్పాడు. లోపలికి అడుగుపెట్టే ముందు, తను వీడ్కోలుగా చేయి ఊపాడు.
“మరింత మంచు పడబోతుంది ” అని స్త్రీ చెప్పింది.
మెక్సికోలో నేను చదువు కునే గదిలో ఇప్పటినుంచి వేల సంవత్సరాల తరువాత ఎవరో చిత్రించబోయే కాన్వాస్ ఇంకా వేలాడుతోంది. ఆ చిత్రానికి రూపం ఇచ్చే పదార్థాలు ఇప్పుడు భూమి నలుమూలల చెల్లాచెదురుగా విస్తరించి ఉన్నాయి.
