‘నువ్వు లేని అద్దం’ నవలలో రమణ జీవితంపై కొన్ని ఆలోచనలు

Spread the love

నాకు చావంటే భయం. చావు గురించి ఏదైనా సంభాషణ జరుగుతుంటే, దానికి ఆమడ దూరంలో ఉంటా నేను. అలాంటిది ఈ నవల ‘చావుని మౌనంగా మోసుకుంటూ నడిచిన’ వ్యక్తి గురించి అంటే, ఒకందుకు భయపడుతూనే చదివాను, లోలోపల మున్ముందు పుట్టే అకారణమయిన భయాలను ఊహిస్తూ. అయితే నాకర్ధంకాని విషయమేమిటంటే- చావు గురించి నేను ఎందుకు ఇంతలా భయపడాతా అని?  

ఒక గ్రీక్ ఫిలాసఫర్ (Epicurus), చావు గురించి భయపడే నాలాంటి వాళ్లని ఉద్దేశిస్తూ, ఇలా రాశాడు: “Death is nothing to us; for when we exist, death is not present, and when death is present, we no longer exist.” Death cannot be experienced by us, and we never “meet” it as a subject of experience. తన ఉద్దేశంలో చావుని మనం మిగతా వాటిల్లాగా అనుభవించలేం. మరి అలాంటాప్పుడు దాని గురించి భయపడం సహేతుకం కాదు అని చెప్తాడు.

Epicurus మాటలు వినటానికి బాగున్నా, నాకు చావంటే ఎవరూ మాట్లాడకూడని ఒక భయానక విషయం. ఆ ఊహ ఎంత చెడ్డది అంటే, చావు గురించి ఏదైనా ఆలోచన నా బుర్రలో తొలిచిందే మొదలు, ఆ రోజంతా నేను నేనులా ఉండలేను. అలాంటిది ఈ పుస్తకం చదివి, కొంత తర్జనభర్జన తరువాత నాకు నేనుగా తెలుసుకుంది- చావు నేను ఊహించుకున్నంత చెడ్డ విషయమేమి కాదని.

నేను చావు గురించి ఎప్పుడూ ఆలోచించే ప్రశ్న: Is death, in principle, bad for us?

One way of answering is to say that death deprives us of all that we value. Life is bound up with desires, and death, when it comes, robs us of the chance to see them fulfilled. But not all desires are alike, nor are they all equally good. Some are shallow, conditional desires, the wish to own a car, or a watch, or any object whose charm fades the moment it is possessed. These desires end with their satisfaction, leaving nothing enduring behind.

Yet alongside them are what we might call categorical desires. These are not conditional, nor do they rest on ulterior motives. They are ends in themselves. Consider the desire of a parent simply to see their child grow, not for wealth, not for honor, not for gain, but simply for the joy of witnessing their becoming. Such desires are not extinguished by possession; they are woven into the very fabric of living. Death, then, can be said to be bad because it robs us of these categorical desires. To die young is to be denied the chance to see your child unfold into her own life.

But if death is bad because it steals these treasures, should we then long for immortality? Is endless life the cure for death, or its mirror image?

Imagine a world without death, say, a city of immortals. No one perishes there; time stretches without end. At first, life might brim with excitement: the first child born, the first work created, the first love felt. But repetition dulls even the brightest flame. Would the thousandth child kindle the same awe as the first? Would the ten-thousandth? Over the centuries, the edge of wonder wears thin, and what once was radiant turns ordinary. Having lived through everything that can be lived, the immortal grows weary. In such a world, death itself begins to look like a blessing.

And more than that: in an immortal world, all possibilities are exhausted. Anyone might, given endless time, write Crime and Punishment or The Critique of Pure Reason. Given infinity, each becomes every other, and individuality dissolves. With nothing truly one’s own, the very idea of selfhood loses meaning.

Where all is necessity, nothing has value. It is mortality, the limits, the fragility, the sheer contingency of life, that lend it depth and meaning. Immortality, far from being bliss, would be a curse.

So we arrive at a paradox. Death is bad, but so too is immortality. What, then, is the good? Perhaps it is this: not to die too soon, before life has flowered, but also not to linger so long that life itself withers into boredom. The good death comes at the right moment, neither too early nor too late.

Perhaps that is what Ramana found.

బహుశా అందుకేనేమో, ముప్పయ్యో పుట్టినరోజునాడు చావు మొత్తలు తొక్కి బయటకొచ్చేసాడు. తను చనిపోవడానికి  “correct” సమయం కాదేమో అది.

వాడి చావు ఇలా ఉండకూడదు అని తనకి తెలిసొచ్చింది. ఇన్ని రోజులు చావుని మౌనంగా మోసిన తను, ఇలా ఎక్కడో ఊరు-పేరు తెలియని గుట్టల నడుమ  చనిపోకూడదు. ఆ రోజు ఏది తనని ఆపింది అంటే, తనకు మాత్రమే తెలిసొచ్చిన ఈ విషయం-తన చావు తనకు తగిన రీతిలో, తనకి నచ్చిన విధంగా, maybe ఒక “కరెక్ట్” టైం లో మాత్రమే జరగాలి. అదే రమణ మాటల్లో- “నా నిష్క్రమణ నాకు తెలియాలి. ఆ ఆఖరు ద్వారం దాటి అడుగు బైటపెట్టే క్షణం దాకా కూడా…అంతా నా చేతుల్లోనే జరగాలి.” (p. 71)

ఆ రోజే రమణ చావుకి ఇంకా ఇంకా దగ్గరయ్యాడు. అందుకే ఇలా అంటాడు అక్కడ- “ఆ రోజు నేను దూకలేకపోయినా నాలోంచి ఏదో దూకేసింది. అప్పటి నుంచి ఈ భూమ్మీద ఇంకా ఉన్నానా అన్న అనుమానంతో నన్ను నేను చేతులతో తడుముతూనే తిరుగుతున్నాను. ఉండటమూ లేకపోవటాల మధ్య దూరం రానురానూ చిన్నదైంది.” (p. 109)

రమణ బ్రతికిన బ్రతుకుకి పర్యాయపదం వెలితి. జీవితేచ్ఛలేని, యవ్వనంలోనే చల్లబడి పెళుసుబారిన గుండె. ఆ క్షణం మొదలు, తాను గడిపిన మిగిలిన జీవితం ఒక చేదు జ్ఞాపకం. రమణ మాటల్లో – “…కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడటానికి సిగ్గుపడే లాలస….అద్దంలో నా ముఖానికి నేనే ఎదురుపడలేకపోయా.” (p. 110) దీనికి కొనసాగింపుగానే, మెహెర్ అన్నని, నవల పేరు వెనక ఉద్దేశం ఏంటి అని అడిగితె చెప్పిన మాట- “రెండు కారణాలకి వాడాను. కవలల విషయంలో ఉండే మిర్రర్‌ ఇమేజ్‌కి అద్దం నప్పుతుంది అని. అద్దంలో కూడా రిఫ్లెక్షన్‌ చూసుకోలేని రమణ స్థితికి సూచన అని. మొదటిది అర్థం తమ్ముడి పెర్‌స్పెక్టివ్‌ లోంచి, రెండోది అన్నయ్య పెర్‌స్పెక్టివ్‌ లోంచి.”

అసలు రమణ ఎందుకు ఇంత అసంతృప్తితో ఉన్నాడు. అందరూ ఇలానే ఉంటారా?

There is a difference between discontent that arises from a cause and discontent that exists without one. The first can be overcome by uncovering its source and seeking what brings satisfaction. The second cannot; it has no origin, no chain of suffering that can be undone. To live with this second kind of discontent is rare. Such a person neither seeks nor desires, neither pursues nor avoids. He stands unmoved, yet inwardly aflame with a restlessness that admits no cause and allows no release.

మొదటిరకం అసంతృప్తి నీడలాంటిది. దాని మూలం అన్వేషించి, మనసుకు సాంత్వననిచ్చే వాటిని దగ్గరకు చేర్చుకోగలిగితే ఇట్టే మాయం. చాలామంది దీని వల్లే బాధ పడుతుంటారు. బహుశా, గిరి (రమణ ఫ్రెండ్) ఈ కోవకి చెందినవాడేమో- డోర్ మెకానిక్ పని నేర్చుకుంటే, జీతం పెరిగి ఇప్పుడున్న ఇరుకు ఇల్లు కాకుండా, వేరొక మంచి ఇల్లు లోకి, అసంతృప్తి నుండి హాయిలోకి వెళ్తాడనే  (జీవ) ఆశ.

కానీ రెండవ దానికి కారణపరంపర ఉండదు. దుఃఖసంద్ర శృంఖలాలు ఉండవు, వాటిని తెంచి విముక్తి పొందే మార్గమూ ఉండదు. బహుశా, రమణ ఈ కోవకి చెందినవాడేమో.

రమణ ఇలా ఉండటానికి కారణం మూర్ఖత్వమో, మూఢనమ్మకమో, రొమాంటిక్ స్వభావమో కాదు.

జీవితంపట్ల తనకున్న గమనింపు కారణం. తనకూ జరిగేవి, లోకంలో జరిగేవీ అన్నీ, గమనిపింపులో ఉండేవి రమణకి. ఆర్టు పేరిట, సాహిత్యం పేరిట వేసే వెర్రి వేశాలు, జీవితపు క్లిష్టతని కేవలం నలుపు-తెలుపు చట్రంలో ఇరికించాలనే చూసే పొలిటికల్ భావాజాలాలు, intellectual డిబేట్స్ పేరిట జరిగే దిగజారుడు గొడవలు, అన్నీనూ. ఈ introspection వల్ల తెలిసొచ్చిన చేదు నిజాలు, మనిషి స్వభావాన్ని అసహ్యించుకునేలా చేశాయేమో. జీవితం పట్ల ఉన్న గమనింపు, మనిషి స్వభావం పట్ల ఉన్న గమనింపే, ఒక శాపం తనకి. అది ఎన్నటికీ మానని ఒక పుండు. తాను ఎందుకు ఇలా అయ్యాడో, తన తమ్ముడు మాములుగా ఎలా ఉన్నాడో రమణ చివర్లో ఇలా చెప్తాడు- “తమ్ముడు నన్ను గమనించేవాడు కాదు. వాడ్ని వాడూ గమనించుకునేవాడు కాదు (అదే వాడ్ని కాపాడిందేమో)” (p. 112)

రమణ కి ఒకటే చావు యావ. అది నిజం. అలా అని life-denying acts యే పూర్తిగా చేయలేదు ఈ లోకంలో. తనకి జీవితమన్నా ప్రేమే. తన తమ్ముడి మాటల్లో “[రమణ]జీవితాన్ని ఎంత ప్రేమించాడో, అంత విరక్తీ పెంచుకున్నాడు.” (p. 101)

రమణకి జీవితంపట్ల ఉన్న ప్రేమ వ్యక్తమైంది లైబ్రరీకి వెళ్లిన రోజు- ముఖంలో వాన సంతోషం. లైఫ్ ని preserve చేసుకోడానికి, అడుగంటుపోతున్న జీవిత లాలస చెలమునుండి జీవితేచ్చని తోడుకోడానికి, లోకం విసిరేసే కొసలను పట్టుకొని చాలానే ప్రయత్నించాడు. అందులో భాగంగానే, తన అనుభవాలను కొన్ని సార్లు ఇష్టంగా రాసుకున్నాడు. భరించలేని ఆలోచనల హింస నుండి దేహమే ఒకింత ఓదార్పు ఇవ్వగలదనీ నమ్మాడు. అందుకేనేమో కష్టమైన physical labour చేశాడు. తన మాటల్లో ఇలా- “నీ శరీరం నిన్ను ఓదార్చగలదు. కండరాల నిర్విరామ నాదం, ఎండా కింద విరిసే స్వేద పుష్పం, ఋతువుల్లో గ్రహగతుల్లో నిన్ను భాగం చేయగలడు.” (p. 18)

అది సాధ్యపడకపోయేసరికి, మనిషి తోడు ఏదైనా తన రాచపుండుని తగ్గించగలదేమో అని ప్రయత్నించాడు. కానీ అదీ కుదరలేదు (గౌరీనాథ్ భార్య మాటల్లో- “అసలు రమణ అలాంటి తోడుకోసం వెతికాడా?” (p. 92)). యాతనల నదిఒడ్డు దాటటానికి, నాన్న ఉంటే బాగుండునేమోనని అనిపించి, గౌరీనాథ్ లో తన నాన్నని ఊహించేసుకొని, తీరా గౌరీనాథ్ మరణంతో జీవితంవైపు లాగే ఒకానొక గొలుసు తెగిపోయినట్టనిపించింది రమణకి. గౌరీనాథ్ మరణం మొదలు, అపాయంలా ఒంటరితనం. తన ‘ఉనికి’ని తానే  పరోక్షంగా అనుభవించి, తన existence పట్ల ఒక అపరాధ భీతితో, చెప్పుకోలేని భయాలతో, దిగులుతో కూడిన ఆశ్చర్యంతో మిగిలిన యవ్వనమంతా గడిపాడు. 

ఆ సంధి రోజుల్లో, ఒకానొక రోజు నిశ్చయమైంది తన చావు. తన చావుకి “correct” సమయమని భావించి ఏ ఆధారం విడవకుండా వెళ్ళిపోయాడు. రమణకి అదే కరెక్ట్ సమయమని ఎలా తెలిసిందో, తన మాటల్లోనే-

“లోయ అట్టడుగు శూన్యంలో వెలిగే

చలినెగడు చుట్టూ ప్రాచీన ఆత్మల తప్పేట్లు

ఇక సమయమైందని గుర్తు చేస్తాయి

లేని రెక్కల్ని నమ్మి దూకమంటాయి” (p. 11)

మేడి చైతన్య
ఖమ్మం జిల్లాలోని బోనకల్ దగ్గరున్న ఆళ్లపాడు గ్రామంలో 1992లో పుట్టాడు.
ప్రస్తుతం ఫిలాసఫీ లో పీహెచ్డీ  చేస్తున్నాడు. 2013లో రాయడం మొదలుపెట్టి, ఇప్పటివరకు ఒక 10 కథలను వివిధ ఆన్లైన్ మ్యాగజైన్ లో పబ్లిష్ చేశాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *