అమ్మ పొయ్యి

Spread the love

 ఈ పొయ్యి మీదనే
మా అమ్మ
తన వారసత్వాన్ని వొండి వార్చి
నాకూ ,నా పిల్లలకూ
వారసత్వంగా అందించింది..
చిన్నప్పుడు
మా అమ్మ శరీరమంతా
వంటిల్లు వాసనేసేది

ఇప్పుడు కూడా
నేను ఆమె పొయ్యి దగ్గర కూర్చుని
వంట వాసనల్ని గుండెల్లో పొదుపుకొని
నా బాల్యపు అనుభూతుల్ని
పిల్లలకు అందిస్తుంటాను

పొయ్యి కింద పొట్టును ఎగ దోస్తూ
మంటపెట్టే కళ
నాకు ఇప్పటికీ అలవాటే .

పొయ్యిలో మంట రాజు కుంటే చాలు
మా అమ్మ కళ్ళు మెరిసిపోతాయి
గిన్నెలో మాంసపు ముక్కలు
ఆనంద తాండవ మాడుతాయి
కమ్మగా ఉడికిన పులుసు వాసన
పొయ్యి అంచుల మీద చిట్లుతుంటే
ఓ ఫ్..

చిన్ననాటి ఆ కమ్మటి వాసన
నా జ్ఞాపకాలని దాటి
నా రుచి గ్రంథుల్ని ఉత్తేజితం చేస్తుంది .

నా బిడ్డ
నన్ను కౌగిలించుకొని
"అమ్మా ..
నువ్వు అమ్మమ్మ లాగే వాసనేస్తావు "అంటది

మాతృ దినోత్సవాన్ని కీర్తించే వేళ
మా అమ్మా,నేనూ, నా బిడ్డల
జీతం లేని మా ఇంటి చాకిరి
కవిత్వంలో అందంగా గుబాళిస్తుంది .
***

My Mother's hearth by Moumita alamకు స్వేచ్ఛాను వాదం
మోమిత ఆలం
ఉదయమిత్ర

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *