చేతిలో ఊత కర్ర, లూజు కోటు, ముఖంలో అస్పష్టమైన బాధ — నాలుగు రోడ్ల కూడలిలో ఆ మనిషిని చూసాను. ఇద్దరం శుభాభినందనలు తెలుపుకున్నాక , ఆయనను
మా ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించాను.
ఆయన నా మాట మన్నించి వచ్చారు.
నా భార్యా పిల్లలు గేటు దగ్గరే మమ్మల్ని కలిశారు.
వారిని చూసి ఆయన మందహాసం చేసారు. ఆయన రాకకు వాళ్ళు సంతోషించారు.
అందరం డైనింగ్ టేబిల్ చుట్టూరా కూర్చున్నాం. అతనిలో ఏదో నిశ్శబ్దమూ, రహస్యమూ దాగి ఉన్నాయనిపిస్తోంది. మాకు చాలా ఆనందమనిపించింది.
రాత్రి భోజనం తరువాత మంట చుట్టూ చేరి చలి కాగుతున్నప్పుడు — ‘మీ సంచార విశేషాలు చెప్పమని అడిగాను.
ఆ రాత్రి, మరుసటి రోజు కూడా ఆయన మాకు ఎన్నో విశేషాలు చెప్పారు. కాని నేనిప్పుడు చెప్పబోయేవి, ఆ దయాళువు గడ్డురోజుల అనుభవాలు, సహనంతో కూడిన ఆ బాటసారి కథలు మాత్రమే!
మూడు రోజుల తరువాత ఆయన వెళ్లి పోయినా గాని, ఒక అతిథి వచ్చి వెళ్లినట్లే అని పించలేదు! మాలో ఎవరో ఇంటి బయట తోటలో తిరుగు తున్నట్లూ, ఎప్పటికైనా లోనికి వస్తారు అన్నట్లూ, అనిపించేది!
1. ప్రేమ గీతం
——————–
అనగనగా ఒక కవి.
ఆయన ఒక ప్రేమ గీతం రాశాడు.
అందంగా వచ్చింది.
ఆ గీతాన్ని తన స్నేహితులకీ, పరిచయస్తులకీ (ఆడా, మగా) పంపాడు. వాళ్ళతో పాటు, తను ఒకే ఒక్కసారి కలిసిన ఒక యవ్వనవతికి కూడా పంపాడు. ఆమె ఆ కొండల వెనకే ఉంటుంది.
ఒకట్రెండు రోజుల్లోనే, ఓ వార్తా హరుడు ఆమె వద్దనుండి ఒక ఉత్తరం తెచ్చాడు. ఆమె ఇలా రాసింది. ” నా కోసం నువ్వు రాసిన ప్రేమ గీతం, నా గుండె లోతుల్లో అలజడి రేపింది. నువ్వు వచ్చి, నా తల్లి దండ్రులని కలువ్. మన వివాహానికి ఏర్పాట్లు చేసుకుందాం.” అని.
ఆ కవి ఇలా జవాబిచ్చాడు
“డియర్ ఫ్రెండ్,
ప్రతీ మనిషి, ప్రతీ స్త్రీ గురించీ పాడుకునే– కవి హృదయంలో పొంగిన ప్రేమ గీతం మాత్రమే ఇది!”
ఆమె జవాబు ” నువ్వో కపటివి. అబద్దాల కోరువి. ఈ రోజు నుండి నేను చచ్చే వరకూ, నీ మూ లంగా కవులందరినీ అసహ్యించుకుంటునే ఉంటాను.”
2. మెరుపులూ , పిడుగులూ
—————-
అనగనగా ఒక రోజు ఒక క్రిస్టియన్ బిషప్ చర్చిలో కూర్చొని ఉండగా, మతం పుచ్చుకోని ఒక స్త్రీ వచ్చి , అతనితో ఇలా అంది.
” నేను క్రిస్టియన్ మతం కాదు. నాకు నరకపు అగ్ని జ్వాలల నుంచి విముక్తి ఉందా?”
బిషప్ ” లేదు. పవిత్ర జలాలు జల్లించుకొని , మతం తీసుకున్న వారికే మోక్షం వస్తుంది.”
అతను ఆ మాటలు అంటూ ఉండగానే , ఓ పిడుగు , ఉరుముతూ ఆ చర్చి మీద పడింది. చర్చి కాలి పోయింది. గ్రామస్తులందరూ పరుగుతో వచ్చి ఆ స్త్రీ ని రక్షించ గలిగారు. బిషప్ ఆ పిడుగు మంటల్లో కాలి పోయాడు!!
౩.నవ్వు, కన్నీళ్లు
————-
ఒక రోజు సాయంత్రం నైలు నదీ తీరంలో ఒక హైనా, ఒక మొసలి కలుసుకొని అభివందనలు తెలుపుకున్నాయి.
హైనా ” రోజులెట్లా గడుస్తున్నాయి సార్?” అని అడిగింది.
మొసలి ” దారుణంగా ఉన్నాయి. ఒక్కో సారి నా బాధలో, దుఃఖంలో నేనేడ్చినా అందరూ అవి ‘మొసలి కన్నీళ్ళే ‘ అంటున్నారు. అది నా గుండెపై
సమ్మెట పోటులా ఉంది.” అంది.
అపుడు హైనా ఇట్లా అంది. ” నీ బాధ, దుఃఖం గురించే మాట్లాడుతున్నావు. నా గురించి కొంచెం ఆలోచించు. ఈ లోకంలో అందం, అధ్భుతాలూ, ఆశ్చర్యాలూ చూసి, కేవలం ఆనందంతో నవ్వితే చాలు – జనాలు అది ‘హైనా నవ్వు’ అంటున్నారు.”
4. మెరుపులూ , పిడుగులూ
———————- —
అనగనగా ఒక రోజు ఒక క్రిస్టియన్ బిషప్ చర్చిలో కూర్చొని ఉండగా, మతం పుచ్చుకోని ఒక స్త్రీ వచ్చి , అతనితో ఇలా అంది.
” నేను క్రిస్టియన్ మతం కాదు. నాకు నరకపు అగ్ని జ్వాలల నుంచి విముక్తి ఉందా?”
బిషప్ ” లేదు. పవిత్ర జలాలు జల్లించుకొని , మతం తీసుకున్న వారికే మోక్షం వస్తుంది.”
అతను ఆ మాటలు అంటూ ఉండగానే , ఓ పిడుగు , ఉరుముతూ ఆ చర్చి మీద పడింది. చర్చి కాలి పోయింది. గ్రామస్తులందరూ పరుగుతో వచ్చి ఆ స్త్రీ ని రక్షించ గలిగారు. బిషప్ ఆ పిడుగు మంటల్లో కాలి పోయాడు!!
5. నవ్వు, కన్నీళ్లు