అవును..నీ శవానికి పోస్టుమార్టం చేస్తే ఏం దొరుకుతుంది ?
మెదడులో కరడుగట్టిన ద్వేష భక్తి మితిమీరిన జాతీయతావాదపు విషం..
తక్కువ - ఎక్కువ కులాలనే మాలిన్యం
హృదయంలో పారుతున్న అధర్మ రక్తం తప్ప !
.......
అవును..నీ శవాన్ని పోస్టుమార్టం చేసినా ఏం దొరుకుతుందని చెప్పు?
నీ జాతి కోసం లక్ష సార్లు చేసిన కుట్రలు.,
గూండా గిరి..ఘోర హత్యాకాండలు ఇవే కదా దర్శనం ఇచ్చేది?
నీ జాతి మంచి కోసం మాత్రం నీ అడుగులు ముందుకు పడవు!
నీ బిడ్డ నీ కులం కానీ వాడిని పెళ్లి చేసుకుంటే.. పరువు హత్య చేసేస్తావు!
నిత్యం రక్తంతో తడిసే నీ చేతులే చెబుతాయి నువ్వేం చేస్తావో?
......
అవును... నీ శవాన్ని పోస్టుమార్టం చేస్తే ఇంతకంటే ఏం దొరుకుతుంది చెప్పు?
నిజానికి నీ శవం మనిషిదైతే కదా..?
నువ్వు చచ్చాక మాదిగ వాడే నీ మరణ సందేశాన్ని చాటాడు !
మాదిగవాడే నీ చితి కోసం కట్టెలు కొట్టాడు!
మాదిగ వాడే నీ శవం దగ్గర డప్పు - బాజా మ్రోగించాడు !
చివరాఖరికి మాదిగలే నీకు పనికి వచ్చారు చూడు!
.........
అవును..నీ శవాన్ని పోస్టుమార్టం చేస్తే ఏమొస్తుంది చెప్పు?
కులం అనే కీకారణ్యంలోనే జీవితమంతా గడిపేసిన క్రూరమైన పశువువి నువ్వు !
కులాహంకారంతో పొట్టంతా ఉబ్బిపోయి ఉంది.
కుల వివక్షతో దేహమంతా కుళ్లిన ఖంపు కొడుతున్నది !
పోస్ట్ మార్టం చేసే డాక్టర్లే భరించలేక తప్పుకున్నారు !
అప్పుడు వచ్చారు చూడూ ..శవాల గది నుంచి మాదిగ వాళ్ళు..నీలో ఏమున్నదో చూపించడానికి !
నీ శవం పుర్రె పగులగొట్టారు.. ఏ మొచ్చిందనుకున్నావు !
గోమూత్రం...అవును..అచ్చంగా నీ కపాలం నుంచి ప్రవహించింది క్రిములతో లుక లుక లాడే ఆవు ఉచ్ఛ నే బయటకి ఉబికింది !
.......
చూసావా ..నీ శవాన్ని పోస్టుమార్టం చేస్తే ఏ మొచ్చిందో?
నీ వొంటి నిండా అవధులు మీరిన మతోన్మాదం ...వేల మంది జీవితాలను నాశనం చేసింది.
అత్యాచారం చేయడానికి అమ్మ వయసు..బిడ్డ వయసు చూడని కామాంధుడివి !
అందుకే అన్నారంతా పురుగులు పట్టి చచ్చి పోయాడు దుర్మార్గుడు అని!
బీద వాళ్ల శాపం తగిలింది..కాకి కూడా పిండ దానానికి దొరకలేదు నీకు !
........
చూసావా..నీ శవాన్ని పోస్టుమార్టం చేస్తే ఏమొచ్చిందో?
నీ శవాన్ని పోస్టుమార్టం చేస్తే ఏమొస్తుంది చెప్పు
