విమానము

Spread the love

నాకూ
విమానానికి మధ్య
కొద్దిక్షణాల వ్యవధిలోనే
అనుబంధం చోటుచేసుకుంది.

మా ఊరిలో
పంటచేలు ఉన్నప్పటికీ
ఏ విమానమూ
ఏరోజూ
అందులో అడుగుపెట్టింది లేదు.
ఊహ తెలిసినరోజు నుండి
పైకెగిరే
హెలికాప్టర్ల వెంటే
పరుగులు తీశాను.

చెన్నైకు వెళ్ళేటప్పుడు
మీనంబాక్కాన్ని అధిగమించే
అపూర్వ క్షణాల్లో
కళ్ళు పెద్దవి చేసుకుని
విస్మయంతో ఆస్వాదించేవాడిని.

తిరుణాళ్ళ సందర్భంగా
గతవారం
విమానమెక్కే
అవకాశం దక్కింది.

అయితే
గుడి విమాన గోపురమెక్కడం
విమానమెక్కడం
రెండూ ఒకదాని కిందే వస్తుందా ఏంటీ?
నా.ముత్తు కుమార్
శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *