ప్రతీకార రుణదాత part -2

Spread the love

ఆపిల్ల మా ఇంట్లో వినయంగా ఉంటె, మా పిల్లడు కొంచెం పెద్ద అయ్యేక మీ పిల్లని స్కూల్ కి
పంపడానికి అడ్డు ఏవి ఉంది? ఏవి లేదు.  ఇంకా చిన్నదే,  వయసు ఎంత?
పది.
చూడు పిల్ల ఇంకా చిన్నది. స్కూల్ కి వెళ్ళడానికి చాల టైం ఉంది.
ఆపిల్లని స్కూల్ కి పంపడం అన్నది  కేవలం మాటలే అని అతనికి తెలుసు
మార్తా కి కుడా తెలుసు.
కానీ. పక్క గదిలో ఓ మూల  కూర్చుని. వింటున్న విరో కి తెలీదు.  అంచేత మనసులోవాళ్ళ పిల్లడు పెద్ద అయినట్టు. అనుకుంది. అంచేత డబ్బున్న ఆ కుటుంబానికి సంతోషంగా వెళ్ళింది.
    వీరో   మంచి పిల్ల, చురుకైనది.   మిస్టర్ ఎనిమికే అతని. భార్య సంతోషించేరు. ఆ పిల్ల వయసుకి. రెండింతలు తెలివైనది. ఏదైనా వేగం నేర్చుకుంటుంది.
  అసలు యీమధ్య మిసెస్ ఎనిమికే మంచి పనివాళ్ళు దొరక్క విసిగిపోయింది. ఇప్పుడు మళ్ళి పూర్వం లాగే ఉంది. ఇప్పుడు ఆవిడ   ప్రాధమిక విద్య గురుంచి నవ్వగలదు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లగలదు. యెంత సేపు ఐన ఉండగలదు  ఆవిడ  వీరో  పనికి ఎంత సంతోషించింది అంటే ఆపిల్లకి లిటిల్ మేడం  అని పేరు పెట్టింది.
ఆపాత ఆయా వెళ్ళిన  తరవాత బాధ మిగిలింది. ఒకసారి ఒక పెద్దావిడ వచ్చి నెలకి ఏడు పౌండ్లు అడిగింది.   అది ఒక్కటే. కాదు. లేబర్ కోడ్ లోఉన్న హక్కులు అన్ని ఆఖరికి   నీ
సర్వెంట్స్ క్వార్టర్ లో  ఎబార్షన్. చేయించుకొనే హక్కు అన్ని తెలిసి నట్టు మాట్లాడింది.  పైగా మిస్టర్ ఎనిమికే మీద ఓ కన్ను వేసింది.   అతను అలాటివాడు కాదు ఆవిడా మాత్రం అంతే.
తరవాత ఇప్పటివరకు ఎవరు రాలేదు.
         ప్రతి రోజు పొద్దున్న ఏమినికే పిల్లల్ని  వాళ్ళ నాన్న   మెర్సిడెజ్ లో కానీ,  ఆవిడ  ఫియట్ లోకాని స్కూల్ కి   వెళ్ళినప్పుడు వీరో   ఆ పిల్లాడిని మెట్లవరకు వాళ్ళకి. బై. చెప్పడానికి  తెస్తుంది.
ఆ పిల్లకి వాళ్ళ డ్రెస్సులు  షూస్ చాల ఇష్టం. అంచేత వాళ్ళ మీద అసూయ  పుట్టింది.
వాళ్ళు రోజూ  ఇంటి నించి వెళ్లడం చూసి చాల అసూయ కలిగింది.  మొదట అది చాలా తక్కువ,  కానీ తన ఊరునుండి. బైటకి వచ్చేయడం ఆ పూరి గుడిసె నుండి బైటికి రాలేదు కానీ
నెలలు గడిచిన కొద్దీ మంచి డ్రెస్సులో వాళ్ళు బైటికి. వెళ్లడం వాళ్ళ షూస్  శాండ్విచ్లు బిస్కెట్లు చూసి ఆశ  పెరిగింది. ఒక రోజు పొద్దున్న అందరువెళిపోయేక  ఆ పిల్లడు ఏడుపు ప్రారంభిచేడు
అప్పుడు వీరో  పాట పాడింది
    ‘ చప్పుడు చేసే చిన్న మోటారుకారు
   నువ్వు స్కూల్ కి వెళ్తుంటే
   నన్ను. తీసుకు  వేళ్ళు’
ఆపొద్దున్న అంత ఆపాట పాడుతూనే ఉంది. ఒంటి గంటకి పిల్లలు. వచ్చేరు. వీరో   ఆపాట వాళ్ళకి. నేర్పింది. వాళ్ళు చాల ఇష్ట పడ్డారు.  బాబా   ‘బ్లాక్ షీప్’  బదులు యి పాత పాట మొదలు పెట్టేరు.
  ఆపాట విన్న ఎనిమికే  ఆపిల్ల ‘జీనియస్’ అన్నాడు. ఆపాట  విన్న మిసెస్ ఎనిమికే నవ్వలేక చచ్చిపోయింది.  ఆవిడ   ఆపిల్లని పీల్చి ఇలారా ఏమిటి ఇది అంది తన ఖరీదైన లిప్ స్టిక్ ని
తల్చుకుంటూ
కానీ అది లిప్ స్టిక్ కాదని, తన భర్త తాలూకు ఎర్రసిరా అని తేలింది.
అప్పుడు ఆవిడ నవ్వకుండా ఉండలేకపోయింద
ఆపిల్ల కాలి  గోళ్లు చేతి గోళ్లు చూడు. అయితే   లిటిల్ మేడం   పిల్లాడిని చూడమంటే, ఇదా నువ్వు చేస్తున్న పని వాడిని ఎక్కడో వదిలేసి నువ్వు  పెయింట్ చేసుకుంటున్నావా? యెర్ర సిరా విషం అని నీకు తెలుసా? నిన్ను నువ్వు చంపేసుకోవాలనుకుంటున్నావా? మా ఇల్లు వదిలి మీనేర్చుకున్న అమ్మ దగ్గరకి వెళ్లెవరకూ అగు.
  అది పని చేసింది. వీరొ తగినంతగా భయపడిందని అర్థమైంది. ఆ మధ్యాన్నం అంత ఆవిడ  
నీడలా అనుసరించింది.
మిస్టర్  నెమికే ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ  ఆకథ  అంతా  చెప్పింది అతనికి. చూపించడానికి.  విరో  ని  పిలిచింది
అతనికి ని గోళ్లు చూపించు లిటిల్ మేడమ్   అంది.
అలాగా అని అతను విరో ని వెళ్ళమని చెప్పేడు. ఆపిల్ల వేగం నేర్చుకుంది. నువ్వు యి సామెత విన్నావా తల్లిఆవు గడ్డి నములుతూ ఉంటె దూడ  దానినోటివేపు చూస్తుందిట
ఎవరు ఆవు?
అది కేవలం సామెత
కొన్ని నెలలు గడిచేయి. గుడ్డు చిన్న చిన్న మాటలు నేర్చుకున్నాడు కానీ విరో ని స్కూల్ కి
పంపడం విషయం ఎవరు మాటలాడ లేదు. అది గుడ్డు తప్పే అనుకుంది విరో వాడు బాగా
ఎదగడం లేదు వాడికి నడక వచ్చిన విరో  వీపుమీద ఎక్కడం ఇష్టం వాడికి ఇష్టమయిన మాట నన్ను ఎత్తుకో  విరో,  దానిమీద కూడా పాట పాడింది.
    ‘నిన్ను మొయ్యలా. నిన్ను మొయ్యలా
    నువ్వు ఇంకా ఎదగక పొతే,
   నేను నిన్ను వదిలి. స్కూల్ కి  వెళతాను.
   ఎందుకు అంటే నేను అలిసిపోయెను.’

మిగిలిన పిల్లలు. వచ్చేవరకు ఆలా పడుతూనే ఉటుంది   కేవలం. ఒక్కర్తే ఉన్నప్పుడే పాడుతుంది             
   ఓవారం   తరవాత,  మిసెస్ ఎనిమికే ఇంటికివచ్చేసరికి గుడ్డు డ్రెస్ మార్చేసి ఉంది.
నేను వేసిన డ్రెస్ ఏవైంది అడిగింది
వాడు పడిపోయి  డ్రెస్ పాడుచేసుకున్నాడు. అంచేత మార్చెను అంది విరో
ఆపిల్ల   వైఖరిలో ఏదో మార్పు ఉంది.
ఎక్కడ పడిపోయేడు? అంది ఆతృతగా. నేలని ఎక్కడ తగిలింది వాడిని ఇలాతీసుకురా?
ఏవిటిఇదంతా రక్తం? వెళ్లి ఆ డ్రెస్ తీసుకురా! అంది.
నేను దాన్ని. ఉతికేసేను. అంది ఏడుస్తూ. ఆవిడ  పరిగెత్తి ఆ డ్రెస్ తెచ్చింది. డ్రెస్సంతా ఎర్ర మరకలు.
  ఆవిడ   విరో ని లాక్కొచ్చి.  రెండు.  చేతులు తోను పిచ్చిగా కొట్టింది. తరవాత కొరడా తెచ్చి
ఆపిల్ల చేతులమీద తల మీద రక్తం వచ్చేటట్టు కొట్టింది అప్పుడు. విరో ఒప్పుకుంది. వాడికి యెర్ర
సిరా తాగించెనని. మిసెస్ ఎనిమికే కూలబడి ఏడవడం ప్రారంభించింది.
    మిస్టర్ ఎనిమికే లంచ్ కోసం ఆగలేదు విరో ని దాని బట్టలు మూటకట్టి నలభై మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ అమ్మ  దగ్గరకి ఒక్కడే దింపుదామనుకున్నాడు,  కానీ ఆవిడా కూడా వస్తానని పట్టు పట్టింది. పిల్లాడితో సహా
    మామూలుగానే ఆటను మెయిన్ రోడ్ మీద కారు అపేడు. కారు తలుపు తీసి ఆపిల్లని బైటికి లాగేడు. ఆవిడ,  ఆపిల్ల బట్టల మూట  విసిరేసింది తరవాత వాళ్ళు వెళ్ళిపోయేరు.
      మార్తా   పొలం నుండి అలిసిపోయి వచ్చింది. పిల్లలు పరిగెట్టి వెళ్లి వీరో   వచ్చిందని,
గదిలో కూర్చొని. ఏడుస్తోందని. చెప్పేరు. ఆవిడ   చేతిలో బుట్ట. వదిలేసి వెళ్ళింది. కానీ ఆపిల్ల చెప్పింది ఏది అర్థం కాలేదు.
నువ్వు ఆ పిల్లాడికి యెర్ర సిరా ఇచ్చేవా? ఎందుకు? ఆలా ఐతే స్కూల్ కి వెల్దామనా రా! వాళ్ళదగ్గరకి వెళ్దాం. బహుశా వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు. నీకథ   నాకు అర్థం కాలేదు. నువ్వు ఏవైనా దొంగిలించేవా? లేకపోతె –

అమ్మ  నన్ను అక్కడికి తీసుకువెళ్ల వద్దు వాళ్ళు నన్ను చంపేస్తారు
రా! నువ్వు ఏవి చేసింది నాకు చెప్పడం లేదు అని ఆవిడ  ఆపిల్లని బైటికి లాక్కొచ్చింది. అప్పుడు
చూసింది ఆపిల్ల తలమీద ఒళ్ళంతా కొరడా దెబ్బలికి రక్తం గడ్డ కట్టుకు పోయింది.
ఎవరు చేసేరు ఇలా
మా మేడం
నువ్వు ఏవి చేసెనని చెప్పేవు
నేను వాడికి యెర్ర. సిరా పట్టెను
సరే పేద
విరో. గట్టిగ ఏడుపు ప్రారంభించింది.  మార్తా ఆపిల్ల చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది. వాళ్ళు వీధిలో వెళుతున్నప్పుడు.   చుసిన వాళ్ళు. ఆ కొరడా దెబ్బలు చూసి. భయంతో అరిచే రు.
ఎవరు చేసేరని అడిగేరు
నాకు ఇంకా తెలీదు అది తెలుసుకోవడానికే వెళుతున్నాను అంది మార్తా
     అదృష్టం. మిస్టర్ ఎనిమికే కారు. అక్కడే ఉంది. అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు అన్న మాట
మార్తా ముందు తలుపు తట్టి. తరవాత లోపలి వెళ్ళింది. మిసెస్ ఎనిమికే పార్లర్ లో కూర్చొని పిల్లాడికి తినిపిస్తోంది ఆవిడ  వీళ్ళవేపు చూడడం గాని మాట్లాడడం గాని చెయ్యలేదు.
కొంతసేపు అయ్యేక భర్త. మేడ  దిగి వచ్చి. కథ అంతా చెప్పేడు  ఆ పిల్లాడికి. ఎర్రసిరా పట్టించి
చంపేద్దామనుకుందని. అర్థం అవగానే. మార్తా రెండు చెవులు మూసుకొని. ఇంకా ఏవి వినదల్చుకోలేదు. అని బైటికి పరిగెత్తింది
ఒక మొక్క తాలూకు  కొమ్మ విరిచి. దాని ఆకులన్నీ తుంచేసుంది. తరవాత ఆకొమ్మతోలోపలికి
వెళ్ళింది విరో అరుస్తూ పరిగెత్తింది
ఆపిల్లని నా ఇంట్లో ముట్టుకోకు. అంది మిసెస్ ఎనిమికే. మొదటిసారి వాళ్ళని చూస్తూ.  వెంటనే ఆపిల్లని ఇక్కడి నించి తీసుకోని ఏళ్ళు ని షాక్ నాకు చుపించాలనుకుంటున్నావు. నాకు చూడాలని లేదు. ని కోపం మీఇంట్లో చూపించు అంది.
అది మార్తా కి బాగా గుచ్చుకుంది. ఆవిడ  అక్కడే ఆలా నిలుచుండిపోయింది
నేను బీదదానిని కానీ హంతకురాలిని కాను. న కూతురు హంతకురాలు అనుకుంటే అది
న నించి నేర్చుకోలేదు  అంది ఆవేశంగా.
బహుశా నాదగ్గర అనుకుంటాను. అంది మిసెస్ ఎనిమికే వంకర నవ్వు నవ్వుతు. లేకపోతె గాలిలో నేర్చుకుందేమో. అదే రైట్ ఇకూతుర్ని తీసుకోని వెళ్ళిపో. అంది
పద  విరో వెళ్దాం.
మిస్టర్ ఎనిమికే ఇంక  కలుగచేసుకోవడం తప్పదని.  అది అంతా  ఒక దెయ్యం పని. యి దేశంలో విద్య  పిచ్చి ఎడ్ ఒక రోజు అందర్నీ నాశనం చేస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఇప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్లడం కోసం హత్యలు చేస్తున్నారు అన్నాడు.
   అతని వాదన మార్తకి మరి బాగా గుచ్చుకుంది ఒక చేత్తో విరో ని రెండో చేత్తో బెత్తం పట్టుకుంది
మొదట ఆపిల్లమని తెగ తిట్టింది
దేవుడా నేనేం చేసెను నడి వయసున్న ఆడవాళ్లలాగే నాకు పిల్ల ఉంటె ఆపిల్ల నన్ను హంతకురాలు అయ్యింది, యిదే  నువ్వు నాకు ఇచ్చింది. అని ఆపిల్లని గట్టిగ లాగింది
ముందు ఇంటికి పద ఈవేళ నిన్ను చంపేస్తాను. అప్పుడు ఒక వింత ఐన తిరుగుబాటు ఆవిడలో వచ్చింది
అదిగో అక్కడ  మొగవాడినని. చెప్పుకొనే మనిషి చదువు పట్ల ఉన్న పిచ్చి గురించి నాతో చెప్తున్నాడు. వాళ్ళ పిల్లలు ఆఖరికి రెండేళ్ళవాడు కూడా స్కూల్ కి వెళ్లారు.  కానీ అది పిచ్చి
కాదు. డబ్బు ఉన్నవాళ్ళకి పిచ్చి ఉండదు   నాలాటి విధవ బీదరాలు మిగిలినవాళ్లతో కలిసి
వెళ్ళితే అది పిచ్చి అవుతుంది. ఏవిటి యి బతుకు దేవుడా! ఏవిటిది ఇప్పుడు నాకూతురు ఆ పిల్లాడిని చంపితే. తనకి అవకాశం వస్తుంది అనుకుంది అలాటి ఆలోచన దాని కడుపులో ఎవరు పెట్టేరు. దేవుడా నేను కాదని నీకు తెలుసు
అవిడ  ఆకొరడా  పారేసి ఆచేత్తో కళ్ళు తుడుచుకుంది.  
     ———————

చినువా అచిబి
బీనాదేవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *