అవును అభయారణ్యం నా ఆత్మలోనే ఉంది.
అక్కడ చూడండి! కార్చిచ్చు నిర్భయంగా రగిలిపోతూ ఉంది.
దాని చూపుల నిండా రక్తదాహమే .
విచిత్రం.. అడవి అచ్చంగా మనిషిలా ఎలుగెత్తి పిలుస్తున్నది.
పాశవికమైన భయవిహ్వలమైన భాష దానిది.
-------------------------------------------------
అయ్యో అసలీ మనుషులింత అమానుషంగా ఎలా తయారయ్యారు?
ఆలోచిస్తుంటేనే నా ఆత్మ లోని అభయారణ్య విస్ఫోటనాలలోంచి రక్తపు కీలలు ఎగుస్తున్నాయి.
దాని మొఖాన్ని చూస్తుంటేనే భావి జీవితం భయభీతమైపోతున్నది.
వర్తమానపు గొంతు ఆక్రోషంతో నిండిపోతున్నది.
నా కలం కూడా రుధిరాగ్నితో ఉప్పొంగుతున్నది.
రక్తపు బురదతో దాని నుదురు వెలిగిపోతున్నది.
ఎంత అబద్రత , అశుభం ఇది?
ఈ అబధ్రత వైపు ఎలా నిలబడను?
చూడు .. కాళ్ళు ఎలా వొణుకుతున్నాయో ?
మనసు పూర్తిగా చచ్చిపోయింది.
ఇక మెల్లిగా నా లోపలి అభయారణ్యంలో అన్నీ వైపులా ఆయుధాలు మొలకెత్తాయి.
-----------------------------------------
అందరూ హంతకులే అయినప్పుడు .,
ఇక ఇప్పుడు ఎవరి దగ్గరికెళ్ళి దేబరించాలి?
చూడండెలా నడి రోడ్డు మీద..
అహింసని నఘ్నం గా నిలబెట్టారో ?
--------------------------------------------
సీతని విముక్తి చేసే వో., భజరంగ భళీ ..
అంటూ హనుమాన్ చాలీసాని చదువుతున్నారెవరో.
ఏం గుంపు ఇది..ఏం మనుషులు వీళ్ళు ?
ముందైతే నా నడుము నుంచి మొలిచి లేచిన ఈ పొడవాటి తోకని చూసి .,
భయపడిపోయాను నేను!
ఓ .. భజరంగ భళీ ., రా ఇటు.
ఇప్పుడు శత్రువు దాక్కున్న కందకాన్ని బద్దలు కొడదాము రా !
నా ఆత్మలోనే అభయారణ్యం ఉంది రా ఇటు!