ప్రతీకార రుణదాత

Spread the love

                ‘మేడం ఇటు’  అంది, సూపర్ మార్కెట్లో  కాష్  కౌంటరు  దగ్గర  కూర్చున్న పెద్ద విగ్గు పెట్టుకున్న  సేల్స్ గర్ల్.  మిసెస్  ఎమినికే, నిండుగా ఉన్న ట్రాలీ ని తోసుకుంటూ  ఆ అమ్మాయి దగ్గరకి వచ్చింది.

‘మేడం  మీరు నా దగ్గరకి వస్తున్నారు’  అంది

మెషిన్  దగ్గర కూర్చున్న మరో అమ్మాయి.

‘ఓహ్  సారీ మరోసారి’

‘గుడ్ ఆఫ్టర్ నూన్ మేడం’ అంది మరో అమ్మాయి. ఆవిడా వస్తువులన్నీ కౌంటర్  మీద పెడుతూ మరో అమ్మాయి

‘కేషా?అకౌంటా మేడం?’

‘కేష్ ‘

ఆ  అమ్మాయి మెరుపు  వేగం తో ధరలు వేసి ఇచ్చింది.   పదహారు పౌన్ల ఆరు పెన్నీలు

మిస్సెస్  ఎమినికె పర్సు  తీసి రెండు ఐదు  పౌన్ల  నోట్లు తీసింది. ఆఅమ్మాయి మళ్ళీ  మిషను నొక్కింది

కాష్ ఉన్న ట్రే  తీసింది ఆ అమ్మాయి. ఆవిడ  ఇచ్చిన డబ్బు తీసుకోని అడుగు పొడవు ఉన్న రసీదు

చిల్లర ఇచ్చింది. అందులో అడుగున థాంక్స్. మళ్ళి రండి అని ఉంది  సరిగ్గా  అప్పుడే మొదటి

చిక్కు వచ్చి పడింది. ఆవిడ సామాన్లు   ట్రాలీ లోనించి ఒకపెట్టెలో పెట్టి కారుదగ్గరకి తీసుకువెళ్ళడానికి

చుట్టుపక్కల ఎవరు లేరు.

‘ఈ కుర్రాళ్ళుఅందరు ఏరీ?

సారీ మేడం  చాలామంది ఈ ప్రాధమిక విద్య కోసం వెళ్ళి

పోయేరు’ అని, ‘జాక్!’ అని కేక వేసింది.

‘వచ్చి మేడమ్  వస్తువులు ప్యాక్ చెయ్యి’ అంది.

 జాక్, నలుభై  ఏళ్ళ కుంటివాడు. ఆ ఎయిర్ కండిషన్ గదిలో కూడా అతను  విపరీతంగా చమట కారుతున్నాడు.

‘అందరు ప్రాధమిక విద్య కోసమే వెళుతున్నారని నువ్వు విన్నావా?’ అడిగింది అమ్మాయి.

‘అల్రైట్  ఆ ఉచిత ప్రాధమిక విద్య కోసం నన్ను నేను చంపుకోలేను’.

 బైట  కార్ పార్కింగ్ లో ఎనిమికె గారి మెర్సెడెజ్   కారులో సామాను అంత  వేసి జాక్ నిలుచున్నాడు.

ఆవిడా హ్యాండ్బాగ్  తీసి అందులోనాణె  లన్ని చూసి,మూడు వెన్నిల నాణెం  తీసి అతని చేతిలోవేసింది. అతను కొంచెం సేపు తడపడి తరవాత వెళ్ళిపోయేడు.

      ఎమినెకి ఇలాంటి  ముసలాళ్లు   ఇలాంటి  చిన్న వాళ్ల  పనులు  చెయ్యడం లెక్క

చెయ్యలేదు. నువ్వు ఎంత ఇచ్చినా వాళ్లకి తృప్తి ఉండదు యీ  గొణుగుతున్న కుంటి వాడిని చూడు చిన్న పెట్టెల్ని కొంచెం దూరం తెచ్చినందుకు ఎంత ఇవ్వాలని అనుకున్నాడు? అది ఈ  ప్రాథమిక విద్య వల్ల వచ్చింది, అది వీళ్ళకి ఇంకా చెడు తెచ్చింది. స్కూల్ ప్రారంభించేక ఎమినెకి, బేబీ నర్స్ తో సహా ముగ్గురు పనివాళ్ళు వెళ్ళిపోయేరు అన్నిటి కంటే పెద్ద సమస్య

బేబీ  నుర్సుది. తను ఏడు నెలల పసిపిల్ల తో ఉద్యోగం ఎలా చేయగలదు?

        అంతటితో ఆ సమస్య ఆగలేదు. ప్రాధమిక విద్య ఒక టర్మ్ అవగానే, దివాలా   తీస్తారన్న భయంతో  గవర్న మెంట్  ఆ స్కీం  తీసేసింది. విద్య మంత్రి సలహా మేరకు. ఎనిమిది వందలవేల

పిల్లలని అనుకున్నారు కానీ మొదటి రోజునే ఒకటిన్నర మిల్లియన్లు  వచ్చేరు. మిగిలినవాళ్లు ఎక్కడినించి వచ్చేరు ఎక్సపెర్టీలు  గవర్నమెంటుని తప్పు తోవ పట్టించేరా? ‘తప్పు లెక్కలు వెయ్యడం

నాన్సెన్స్’  అన్నాడు ఒక గణాంకాల  ఎక్స్పర్ట్ ఒక రేడియో ఇంటర్వ్యూ లో. సమస్య ఏవిటంటే చుట్టూపక్కల రాష్ట్రాల నించి. పిల్లల్ని వేల  సంఖ్యలో తెచ్చి రిజిస్టర్ చేస్తున్నారు.

           కారణం ఏదైనప్పటికీ గవెర్నమెంట్

ఈ స్కీం తీసేసింది  ది  న్యూ ఏజ్  అన్న పేపర్   ప్రైమ్ మినిస్టర్ని పొగుడుతూ గవర్నమెంట్ ఈ విషయంలో ప్రజల మాట విని ఉండవలసింది అని ఎడిటోరియల్ రాసింది. అది నిజమే ప్రజలు ఆవిషయం ఇదే పేపర్ లో ప్రస్తావించారు. అది జాతీయ కారణం కోసం చేసారని, ముసలి  గుర్రం ఎక్కారని విమర్శలని ఛాలెంజ్ చేస్తూ విదేశీ పెట్టుబడులతో నడుపుతున్న పేపర్ ఏదో విమర్శించేయి. ఆపేపెర్ లో కొన్ని చోట్ల రోజుకి రెండు మూడు వ్యాసాలు చొప్పున. ఓపదిరోజుల్లో లాయర్లు, డాక్టర్ లు ఒకరేవిటి అందరు రాసేరు.

   అందరి మాటా ఒకటే. ఎవరు  విద్యకి విరోధంగా లేరు. కానీ ఉచిత విద్య ఆకాలం, ఎంతో

డబ్బు ఉన్న అమెరికా కూడా ఇలాటిది ఇంకా

ప్రవేశపెట్ట లేదు అన్నారు.

                      మిస్టర్ ఏమీనికే అన్నిటినీ ఓ కుర్రాడిలా ఎంతోఉత్సాహంగా చదివేడు    

   ‘పేపర్లో రాయడానికి సివిల్ ఆఫీసర్ లకి వీలు ఉంటె బావుండును’ అన్నాడు భార్యతో.

‘అదేమంత చెడ్డది కాదు, స్వతంత్రం తరవాత ఈ దేశం విద్యలో ఎంతో ముందుకు సాగింది. తల్లి తండ్రులకి విద్య విలువ తెలుసు వాళ్ళు పిల్లల స్కూల్ ఫీజుల కోసం ఎంత త్యాగం అయినా చేస్తారు.

మనది ఆలివర్ ట్విస్ట్ ల దేశం కాదు’.

    అతని భార్యకి ఇలాటి వాదనలలో ఏమాత్రం ఇంటరెస్ట్ లేదు ఆవిడకి ఈ ఉచిత విద్యలో కొన్ని సందేహాలు ఉన్నాయి.

    మరోసారి ‘నువ్వు పేపర్ చూసేవా? ఈ విషయంలో మైక్ రాసేడు’ అన్నాడు.

మైక్ ఎవరు?

మైక్ ఉగోడు

ఏవిటి అంటాడు?

నేను ఇంకా చదవ  లేదు నువ్వు  మైక్ ని నమ్మవచ్చు  అతను స్పేడ్  ని స్పీడే  అంటదు. ఎలా ప్రారంభించాడో చూడు ఉచిత ప్రాథమిక విద్య కమ్యూనిజం తో సమానమైనది. అది నిజం కాదు. కానీ అతను తన షిప్పింగ్ లైన్ ని. చేస్తారని అనుకుంటాడు. అతనికి కమ్యూనిజం అంటే భయం.

    కానీ ఇక్కడ కమ్యూనిజం. ఎవరు అడుగుతారు?

ఎవరు అడగరు. నేను ఆవేళ  సాయంత్రం క్లబ్ లో అదే చెప్పెను. కానీ, అతను చాలా భయపడుతున్నాడు. నీకు ఒకటి తెలుసా ఎక్కువ డబ్బు ఉండడం మంచిది

ఎనీమికే  కుటుంబం. యి వాదన యి స్థితిలో ఉండగా ఒకనాడు వంటవాడికి సాయం చేసే ఒక పన్నెండు ఏళ్ళ కుర్రాడు వచ్చి   మా నాన్నకు జబ్బుగా ఉంది. చూడడానికి ఇంటికి వెళతాను అన్నాడు.

‘మీ నాన్నకి జబ్బుగాఉందని నీకు ఎలా తెలుసు?’ అడిగింది ఆవిడ

‘మా అన్న వచ్చి చెప్పేడు ‘

‘మీ అన్న  ఎప్పుడువచ్చేడు?’

‘నిన్న సాయంత్రం’

‘వాడిని  నాదగ్గరికి. ఎందుకు తీసుకు రాలేదు?’

‘మీరుఅడుగుతారని చెప్పలేదు’

‘నువ్వు నిన్ననే ఎందుకు చెప్పలేదు?  అడిగేడు మిస్టర్ ఎనిమికే పేపర్ లొనించిచూస్తూ.

‘మొదట. వెళ్లకూడదని అనుకున్నాను. కానీ. ఇవాళ అనిపించింది. బాగా జబ్బుగా ఉందెమోనాని’

‘సరే వేళ్ళు. కానీ రేపు మధ్యానానికి వచ్చేయాలి.  లేకపోతె -‘

‘రేపు పొద్దున్నకె వచ్చేస్తాను సర్.’

వద్దు తిరిగి రాలేవు. వాడి అబద్ధాలకి ఆవిడకి చాల కోపం వచ్చింది నౌకర్లు   తనని మోసం చెయ్యడం ఆవిడకిఇష్టం లేదు.  ఆ చిన్న వెధవని చూడు తనంత తెలివైనవాడు లేడు అనుకున్నాడు.

ఈ మధ్య వాడి వాలకం చూసితను అనుమానించి ఉండ వలసింది. ఇప్పుడు. నెల జీతం తీసుకొనివెళ్ళిపోయేడు. నోటీసు ఇస్తే జీతం నష్టమొచ్చేది. ఇలాటివాళ్ళకి. ఏ మాత్రం. జాలి చూపించ కూడదు

           ఓ వారం పోయేక, తోటమాలి నోటీసు ఇచ్చేడు వాడు. ఏవి. దాచడానికి ప్రయత్నించలేదు.వెంటనే వాళ్ళ ఊరు వచ్చి ప్రాధమిక విద్యకి రిజిస్టర్ చేయించుకోమని వాళ్ళ అన్న కబురు చేసేడు.

       అతని పల్లెటూరి అమాయకత్వానికి మిస్టర్ ఎనిమికే నవ్వడానికి ప్రయత్నించేడు.

‘ప్రాథమిక విద్య పిల్లలకి,నీ వయసు వాళ్ళని చేర్చుకోరు. నీ  వయసు యెంత?’

‘పదిహేను సర్’

‘కాదు నీకు మూడే   వెళ్లి బాటిల్ తో పాలు  తాగు’ అంది మిసెస్ ఎనిమికే

  నీక ఇరవైపైనే ఉంటాయి హెడ్ మాస్టర్. నిన్ను చేర్చు కోడు. నువ్వు వెళ్లి ప్రయత్నిస్తానుఅంటే

తప్పకుండా వేళ్ళు కానీ. చేర్చుకోక పొతే మాత్రం మళ్ళీ రాకు’

   ‘మాఊరిలో నా కన్నా పెద్దవాడు. రిజిస్టర్ అయ్యేడు కేవలం మాస్ట్రీటు కోర్టుకి వెళ్లి ఐదు షిల్లింగులు ఇస్తేచాలు ‘

  ‘సరే. ఐతే నీ ఇష్టం ఇక్కడ నీ పనిబావుంది కానీ ‘

  ‘మార్క్ ఎందుకు ఈ మాటలన్నీ వాడికి వెళ్లాలని ఉంది. వెళ్లనీ’

   ‘మేడం   నాకువెళ్లాలని ఉంది. మాపెద్దన్న ‘

  ‘మేము విన్నాం. నువ్వు  వెళ్ళు

  ‘కానీ. ఇప్పుడు వెళ్ళలేను నేను. ఒక వారం. ముందు నోటీసు ఇవ్వాలి మరొకడినిపనిలో పెట్టాలి.’

    ‘నోటీసు గురించి. బాధ పడకు వెళ్ళు’

    ‘మరి నాకు డబ్బు ఇప్పుడు ఇస్తారా లేక. మధ్యాన్నం రానా?

  ‘ఏ డబ్బు?’

   ‘మేడం  యీపదిరోజులుకి.’

    ‘నన్ను విసిగించకువెళ్ళు,రెండు  రోజుల తరవాత. ‘

అసలువిసుగు  మిసెస్ ఎనిమికే కి. పసి పిల్లాడికి, ఆయా ఆబిగైల్ రూపంలో వచ్చింది. ఆవిడ  పనికి  వెళ్ళడానికి. పొద్దున్నే రెడీ అవుతున్నప్పుడు. ఆయా   పిల్లాడిని. తీసుకువచ్చి ఆవిడ  ఒళ్ళో పడేసింది తాను ఆపిల్లకి. చేసినంత. ఎవరికి. చెయ్యలేదు. తన దగ్గరకి వచ్చేసరికి. గుడ్డ పీలికలు సానిటరీ టవల్స్ గ వాడేది యెంత అమాయకం అంటె   పిల్లడ ఏడుపు మానడానికి  గిన్నె నిండా నీళ్లు ఇచ్చేది కొన్ని నీళ్లు ముక్కులో పోసింది. ఇప్పుడు అది పెద్దది. వండగలదు   పౌడర్, పెర్ఫ్యూమ్స్   వాడుతుంది.

తల దువ్వుకుంటుంది. అలాటి ది   ఇప్పుడు. వెళ్లిపోవడానికి తయారు అయ్యింది.

     అవేళ  నించి ఆవిడకి ఉచిత ప్రాధమిక విద్య అంటే అసహ్యం వేసింది. ఆమాట దినచర్యలో ఒక భాగం అయిపోయింది. పల్లెటూళ్లలోదానిని ఫ్రీ ప్రిమడు  అంటారు. ముఖ్యంగా దాని గురించి జనం జోక్ చేసినప్పుడు ఆవిడకి వాళ్ళని తన్నాలనిపిస్తుంది. ఆవిడకి ఆమెరికన్ల అంటే  మరీ  అసహ్యం. అమెరికన్లు డబ్బు పారేసి ఆఫ్రికాలోని పనివాళ్లని ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళ తోటమాలి స్కూల్ కి వెళ్లలేదని, ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు వాడికి   ఏడు పౌన్లు,  ఒక సైకిల్ ఇచ్చేరని., వాడిభార్యకి సింగర్ కుట్టు మెషిన్ ఇచ్చేరని. తెలిసినప్పుడు, ఆవిడ వాళ్ళని ఇంకా అసహ్యించుకుంది

    ‘వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అడిగింది

నిజానికి. ఆవిడకి. జవాబు. అక్కర్లేదు కానీ జవాబు భర్త చెప్పేడు.

ఎందుకు అంటే అమెరికాలో పనివాళ్లని భరించడం కష్టం అంచేత వాళ్ళు ఇక్కడకి వచ్చినప్పుడు

ఇక్కడ చవకగా దొరుకుతారు అందుకు’ అన్నాడు.

      మూడు నెలల తరవాత. ప్రాధమిక  విద్య రద్దు  అయిపోయింది స్కూల్ ఫీజులు మళ్ళీ మొదలు అయ్యేయి అప్పటికి. న్యూ ఏజ్  చెప్పినట్టు ఆఫ్రికన్ పరిస్థితులకి ఈరకం సోషలిజం.  పనికిరాదని, గవర్నమెంట్ ని ఒప్పించింది. లెఫ్టిస్ట్ సానుభూతి ఉన్న విద్య మంత్రికి ఇది నచ్చ లేదు  అంచేత అతనికి ఆర్థిక మంత్రికి మధ్య  తరుచు  మాటల  యుద్ధం జరిగేది.

      కొత్త పన్నులు వేస్తే తప్ప మనం ఈ స్కీం చేయ్యలేము  అన్నాడు. కాబినెట్ లోఆర్థిక మంత్రి.

     ఆలా అయితే మనం క్రొత్త  పన్నులు  వేద్దాం అన్నాడు విద్యా  మంత్రి.  అందరు. కొలీగ్ లు.

నవ్వుల మద్ద్య. అప్పుడు పెర్మనెంటు సెక్రెటరీ టు మిస్టర్, ఎమీనికే కూడా ఉన్నాడు అతను ఆ డిబేట్ లో కానీ నవ్వుల్లో కానీ కలవ లేదు. మనం చెయ్యలేం అన్నాడు ఆర్థిక మంత్రి. ఇక నవ్వుతూనే. గౌరవ నీయులైన నా ఫ్రెండ్   ఈ గవర్నమెంట్  ఫస్ట్ టర్మ్ ఉంటుందో లేదో అని  బాధ పడడని  నాకు తెలుసు కానీ. మిగతా వాళ్ళు పడతారు నేను నా ఎలక్షన్ అప్పులు. తీరేవరకు ఐన ఉండాలి’  అతను అలా అనగానే  హేయర్  హెయర్  అని కేకలు.  నవ్వులు  అతను మళ్ళీ   ప్రారంభించేడు దాని గురించి మనం. తప్పు చెయ్యకూడదు. ఇప్పటికేబాధ పడుతున్న జనం మీద తెలివి తక్కువగా పన్నులు వేస్తె భరించే జనం ఆఫ్రికాలో లేరని నా అభిప్రాయం’ అన్నాడు విద్య మంత్రి నవ్వుతూ  నా గౌరవ నీయులైన. భూభాగంలోకి నేను. చొచ్చుకు పోవడం సారీ. కమ్యూనిస్ట్ నినాదాలు. అంటూ వ్యాధివి లాటివి పన్నుల గొడవలు. ఎదురుకోవడానికి. ఆర్మీ ని పిలవకుండా. కొత్త పన్నుల గురించి.  మాట్లాడ కూడదు. ఒక చిన్న నిజాన్ని మనం. చాలాబాధ గ నేర్చుకున్నాం.  జనం పన్నులగురించి. అల్ల ర్లు   చేస్తారు. కానీ. స్కూల్. ఫీజుల. గురిచి. చెయ్యరు. కారణం చాలా  సింపుల్ ప్రతివాడికి స్కూల్ ఫీజుఎందుకో తెలుసు. తన పిల్లడు పొద్దున్న స్కూల్ కి. వెళ్లడం సాయంత్రం ఇంటికి రావడం. చూస్తాడు కానీ. నువ్వు వెళ్లి పన్నుల గురించి చెప్తే తన డబ్బు ని గవెర్నమెంట్ దోచేస్తుందని. అనుకుంటాడు. ఒకవేళ స్కూల్ ఫీజు కట్టడం ఇష్టంలేకపోతే మానెయ్యవచ్చు.

ఇది ప్రజా స్వామ్య సమాజం.  మహా ఐతే వాడిపిల్లాడు ఇంటిదగ్గరే ఉంటాడు.  ఆటను పట్టించుఁ కోడు. కానీ పన్నులు వేరు, వాళ్ళకి ఇష్టం ఉన్న లేకపోయినా కట్టవలసిందే. అంచేత జనం తిరగ పడతారు.’

      కొంతమంది.  ‘హెయిర్ హెయిర్’ అని అరిచేరు.

 ఆర్ధిక మంత్రి  మీద. అపార గౌరవం ఉన్న మిస్టర్ ఎనిమికే తల బల్లిలాగా ఊపుతూ ‘హెయిర్ హెయిర్’ అని గట్టిగ అరిచేడు. ఆ  అరుపుకి ప్రైమ్  మినిస్టర్   చుసిన చూపుకి. శక్తీ   ఉంటె ఆతను బూడిద అయ్యేవాడు.

      కొంత మంది. అవమానకర మైన స్పీచ్ లు ఇచ్చేరు. తరవాత, గవెర్నమెంట్ ప్రాధమికవిద్యని

పూర్తిగా రద్దు చేయకుండా అన్నిటిని పరిశీలించేవరకు ఆపేరు.

         వెరోనికా అనే అమ్మాయి గుండె బద్దలు అయ్యింది. ఇంటిపనులు నించి. తప్పించుకోవడానికి, ఆపిల్ల స్కూల్ ఇష్టపడేది. అమ్మాయి తల్లి అనాధ విధవ. పగలంతా పొలం పనులు చేస్తుంది.

మార్కెట్ రోజుల్లో, మార్కెట్ లో చేస్తుంది చిన్న పిల్లల్ని ఏరోనికా కి అప్ప్పచెప్తుంది. నిజం చెప్పాలంటే

ఏడాది వయసు ఉన్న ఆఖరి పిల్లని మాత్రం. చూడాలి. మిగిలిన ఇద్దరికీ ఏడేళ్లు, నాలుగేళ్ల

వాళ్ళ బాధ్యత అమ్మాయికి లేదు కానీ మేరీ ఆలా కాదు ఆపిల్లకి యెంత తిండి పెట్టిన ఆలా ఏడుస్తూనే ఉంటుంది. ఆపిల్ల కడుపు. పెద్ద డ్రంలా ఉంటుంది.

   వాళ్ళ విధవ తల్లి మార్తా, పూర్వం ఒకప్పుడు సెయింట్ మోనికా లో విద్యార్ధిని  దాన్ని మిషనరీ ఆడవాళ్లు స్థానిక గృహిణులకు  ట్రైనింగ్ కోసం స్థాపించేరు. 

మార్తా స్కూల్ ఫ్రెండ్స్ చాల మంది టీచర్లని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పాత భర్త చనిపోయిన్నటికి ఆమెని పూర్తిగా నాశనం చేసేడు. మొదటినించి. అది దురదృష్ట కరమైన పెళ్లి. వాళ్ళ పెళ్లి అయిన ఇరవై నాలుగు ఏళ్ళకి మొదటి పిల్ల పుట్టింది. అంచేత

పిల్లల్ని పెన్చేటంత చిన్నది కాదు. తనని గొడ్రాలు అన్న మాట తప్పినందుకు సంతోషించినది.

భర్త చనిపోవడానికి ఐదేళ్ల ముందు   అతని కుడి చెయ్యి పక్షవాతంతో పడిపోయినందుకు బాధ  పడింది.

       వీరో  స్కూల్ మానేసిన తరవాత మిస్టర్ ఎనిమికే మార్తని కలిసేడు.  అతని మెర్సెడెస్ బెంజ్  మెయిన్ రోడ్ మీద పక్కకి అపి సందుల్లో ఉన్న మార్తా  ఇంటికి నడిచేడు. అంత  గొప్పవాడినిచూసి మార్తా   ఆశ్చర్యపోయింది. వెంటనే అతను వచ్చిన  పని చేప్పెడు.

       మేము మా చిన్న  పిల్లాడిని చూసుకోవడం కోసం ఒక అమ్మాయిని. వెతుకుతున్నాము.

ఇవాళ మీ అమ్మయి విషయం. ఎవరో చెప్పేరు’అన్నాడు.

మొదట మార్తా ఇష్టపడలేదు  కానీ అతను ఆపిల్లకి మొదట ఏడాదికి.  ఐదు పౌన్లు. తిండి బట్ట అన్ని ఇస్తామని చెప్పేక మెత్తపడింది.

నేను డబ్బు గురించి ఆలోచించడం లేదు పిల్లని సరిగా చూస్తారో లేదో అని భయం అంది.

నువ్వు ఆవిషయం భయపడవద్దు. మా పిల్లలతో సమానంగా చూస్తాము మా ఆవిడ  సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఆవిడకి పిల్లల్ని ఎలా చూడాలో తెలుసు. మీపిల్ల మాఇంట్లో సంతోషంగా ఉంటుంది దానికి. నేను హామిఇస్తున్నాను. మీ పిల్ల చెయ్యవలసింది. ఒకటే. మా ఆవిడా ఇంట్లో. లేనప్పుడు పిల్లాడిని చూడడం.  పాలు పట్టడం కిందటి   టర్మ్ లో వీరో  దాని చెల్లి కూడా స్కూల్ కి వెళ్ళేరు అంది మార్తా. ఎందుకు అన్నాడో తెలికుండా ఔను నాకు తెలుసు   గవర్నమెంట్ చాల   చెడ్డ పని చేసింది ఒక పిల్ల స్కూల్కి వెళ్లినా   వెళ్లకపోయినా ఆపిల్ల ఎవరో అదే అవుతుంది అంత ఇక్కడ మన చేతిలో రాసి ఉంది అన్నాడు వై.

            మార్తా నెలవేపు చూస్తూ, కళ్ళు దించుకొనే   ‘నేను పెళ్లి చేసుకున్నప్పుడు.  నా కూతుళ్లు నా కన్నా బావుండాలి అనుకున్నాను. ఆరోజుల్లో నేను మూడో క్లాస్ చదివేను.  అంచేత వాళ్ళు కాలేజీ కి వెళ్లాలని అనుకున్నాను. నాకు. ముప్ఫయ్ ఏళ్ళ.   నా కింద ఉన్నది కూడా వాళ్ళకి ఇప్పుడు లేదు తల్చుకుంటే గుండె బద్దలవుతుంది.’

     ‘అమ్మా అంత బాధ పడకు, కష్టాలు ఏవైనా మనకి. రాసిఉన్నట్టే జరుగుతుంది.’

      ‘ఔను నాకు మాఆయనకి    రాసినదానికంటే ఎక్కువ రాయమని కోరుతున్నాము, ఎమినికే గారూ!’.

చినువా అచిబి
బీనాదేవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *