ఒక మద్యాన్నం లాగోస్‍లో 16వ వీధిలో వాళ్ళ గదిలో ఉన్నప్పుడు.
నెమెకా ని అడిగింది నెనె,
‘లేదు నేను దానిగురించి ఆలోచిస్తున్నాను సెలవులో నేను వెళ్ళినప్పుడు అతనితో స్వయంగా చెప్పడం మంచిది కానీ ఎందుకు? సెలవు కి ఇంకా ఆరు వారలు టైముంది ఆటను ఇప్పుడు మనం సంతోషంగా తెలుసుకొవలి’.
నెమెకా ఏమి మాట్లాడలేదు తరవాత. మాటలు తడుముకొంటునట్లు నెమ్మదిగా. ‘ఆటను సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను’ అన్నాడు.
‘అఫ్ కోర్స్ ఎందుకు ఉండదు?’. అంది ఆశ్చర్యంగా.
‘నువ్వు నీ జీవితం అంతా లోగోస్. లోనే గడిపేవు, దేశంలో దూర ప్రాంతాల గురించి. నీకు తక్కువ తెలుసు’
‘నువ్వు ఎప్పుడు. అలాగే అంటావ్ కానీ కొడుకు పెళ్లి. చేసుకుంటానంటే సంతోషపడ ని వాళ్ళు ఉంటారంటే నేను నమ్మను
ఆపెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసినది కాకపోతే వాళ్ళు ఏ మాత్రం. సంతోషంగా ఉండరు మన
విషయంలో అది ఇంకా అధ్వానం నువ్వు ఇబో వి కూడా కావు.
ఆటను అంత సిరియూస్ గా ఉన్నాడట’. నెనె వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. సిటీ వాతావరణం లో ఒకడి జాతి వాడు పెళ్లాడినవాళ్ళని బట్టి నిర్ణయించబడుతుందంటే. ఒక జోక్
గా అనిపించింది.
‘ఆఖరికి, అందువల్లే నువ్వు నన్ను. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవని నీ అభిప్రాయమా?’ అంది.
‘మేమంతే. పెళ్లి విషయంలో అది అంత సులభం కాదు. ఇది ఇబం కి విచిత్రం కాదు. మీ నాన్న బతికి ఉంటె. ఆటను కూడా మా నాన్నలాగే ఉండేవాడు’.
‘నాకు తెలీదు ఏవైనా కానీ మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం ఐతే అతను నిన్ను త్వరలో క్షమిస్తాడు’.
లే లేచి ఉత్తరం రాయి
యి వార్త అతనికి రాసి చెప్పడం అంత మంచిది కాదు. ఉత్తరం షాక్ లా ఉంటుంది అది నా నమ్మకం’.
సరే ఐతే. నీకు మీ నాన్న తెలుసు కదా’
నేమేకా సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు. తన తండ్రిని. ఎలా ఒప్పించాలా అని రకరకాలుగా ఆలోచించేడు పైగా ఆతను తనకి. ఒక అమ్మాయిని. చూసి. ఉంచేడు. నెనె కి ఉత్తరం చూపించుదామా అనుకోని మళ్ళి ఒద్దు అనుకున్నాడు. మళ్ళి ఓసారి. చదివేడు. ఇంటికి వెళ్ళేక
నవ్వుకున్నాడు. అతనికి ఉగోయి బాగా తెలుసు. అమెజాన్ అమ్మాయి. అందరు అబ్బాయిల్ని, తనని కూడా కొట్టేది స్కూల్ లో . పరమ మొద్దు. నీకు. సరిపోయే మంచి. అమ్మాయిని. చూసేను. మన ప్రక్క ఇంటి
జాకబ్ న్వేకిగారి పెద్ద కూతురు. ఆమెకి మంచి క్రిస్టియన్ పెంపకం ఉంది. కొన్నేళ్ళకిందట ఆ అమ్మాయి స్కూల్ మానేసినప్పుడు. వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని. ఒక పాస్టర్ ఇంటికి పంపించేడు. అక్కడ ఆ అమ్మాయి. ఒక భార్యకు కావలసిన. ట్రైనింగ్ అయింది ఆ అమ్మాయి బైబిల్ బాగా చదువుతుందని వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పింది. నువ్వు డిసెంబర్ లో వచ్చినప్పుడు అన్ని మట్కాడుకుందాము’. లాగోస్ నించి. వచ్చిన రెండో రోజు. సాయంత్రం. నేమేకా వాళ్ళ నాన్నతో చెట్టు కింద కూర్చున్నాడు. డిసెంబర్ లో సూర్యుడు అస్తమించేవేళ ఆ ముసలతను ఆ చెట్టుకింద కూర్చుంటాడు.
‘నాన్నా నేను క్షమాపణ అడగడానికి వ చ్చేను అన్నాడు నేమేక. అకస్మాత్తుగా అది పెళ్లి విషయమా?
‘స్వీకె కూతుర్ని పెళ్లి చేసుకోవడం అసంభవం’.
‘అసంభవమా ఎం?’ అడిగేడు తండ్రి.
‘నేను ఆ అమ్మాయిని ప్రేమించలేదు’
‘నువ్వు ప్రేమించేవని ఎవరు ఆనలేదే
‘యి రోజుల్లో పెళ్లి తేడా ఉంది.’
యిలా చూడు ఏది తేడా లేదు ఎవరైనా భార్యలో చూసేది. మంచి నడవడి, క్రిస్టియన్ నేపథ్యం.’
యీ రకం ఆర్గుమెంట్ తో లాభం లేదని నేమేక కి అర్థం అయ్యింది.
‘ నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి ఉగయి లో
ఉన్న అన్ని మంచి గుణాలు ఉన్నాయి’.
అతని తండ్రి తన చెవులని తానే నమ్మలేకపోయేడు. ‘ఏమన్నవ్ నువ్వు?’ అడిగేడు నెమ్మదిగా.
‘ఆవిడా మంచి క్రిస్టియాను లాగోస్ లో స్కూల్ టీచర్’
‘ఏవన్నావ్ టీచర్ అనా యేమేకా నేను నీకు ఒకటి చెప్తాను విను మంచిభార్యకి కావలసిన
క్వాలిఫికేషన్ క్రిస్టియన్ ఆడది, టీచర్ కాకూడదు. కొరింథీయస్ కి సెయింట్ పాల్ రాసిన ఉత్తరంలో ఆడవాళ్ళూ నిశ్శబ్దం పాటించాలి అన్నాడు’ అంటూ కుర్చీ లోనించి లేచి అటు ఇటు తిరగడం ప్రాంభించేడు ఆడవాళ్ళూ స్కూల్ లో పని చెయ్యడం ప్రోత్సహించిన చర్చి లీడర్లని ఖండించేడు తరవాత నెమ్మదిగా అడిగేడు.
ఆవిడ ఎవరి కూతురు?
ఆవిడ నెనే ఆటంగ్
ఏవిటీ అతని గోతులో నెమ్మది పోయింది ఏవిటి నీ ఉద్దేశం నేనేంతంగా అన్నవా
కాలుబారు నుండి నెనె ఆటంగ్ నేను ఆ ఒక్క అమ్మాయిని చేసుకుంటాను’
ఇది తొందరపాటు జవాబు, తుపాను వస్తుందనుకున్నాడు కానీ రాలేదు.
అతని తండ్రి తన గదిలోకి వెళ్లి పోయేడు. ఇది ఊహించనిదే.
తండ్రి నిశ్శబ్దం. అతని భయంకరమైన స్పీచ్ కన్నా బెదిరింపులాటిది
ఆ రాత్రి ముసలాయన తిండి తినలేదు.
ఒక రోజు అయ్యేక అతను నేమేకని పిలిచి అన్ని రకాలుగాను ఒప్పొంచాలని ప్రయత్నించేడు.
కానీ నాకొడుకు గుండె రాయి లాటిది ఆని, తండ్రి ఆఖరుగా వదిలేసేడు.
‘ఏది తప్పు? ఏది ఓప్పు? అని చెప్పడం అనే ధర్మం నీ బుర్రలో ఎవరు ప్రవేశపెట్టేరో కానీ అది
నిగొంతు కోసేస్తుంది అది పిశాచపు పని’ అని కొడుకుని వెళ్లిపొమ్మన్నాడు.
‘నువ్వు నెనె గురించి తెలుసుకున్నప్పుడు నీ మనసు మార్చు కుంటావు’.
‘నేను ఆవిడని ఎప్పుడు చూడను.’ అన్నాడు తండ్రి. ఆరాత్రి నించి అతను కోడుకుతో అరుదుగా
మాట్లాడేడు
నేమేకా తన తండ్రి బాధకి చాల నోచ్చుకున్నాడు, ఐతే అది పోతుందని ఆశించేడు
చరిత్ర లో ఎప్పుడు వాళ్లలో ఎవరు మరో భాష అమ్మాయిని చేసుకోవడం జరగలేదు. అది అతనికి తెలిసి ఉంటె పెద్ద ఆశ ఉండేదికాదు. కొన్ని వరాల తరవాత. ఒక ముసలాయన ఇలాటిది
‘ఎప్పుడువినలేదు’ అన్నాడు.
కొడుకు లాగోస్ వెళిపోయేడు.
మన ప్రభువు ఏవన్నాడు కొడుకులు తండ్రికి విరోధంగా వెళ్లారు అని. మన పవిత్రమైన పుస్తకంలో ఉంది.’ అన్నాడు. మరో పెద్దమనిషి.
‘ ఇది అంతం తాలూకు ఆరంభం’. అన్నాడు మరొకడు.
ఆ చర్చ. మధుభోగ్వే అన్నతను, మరోసారి. సాధారణ చర్చకి తెచ్చేడు.
‘నువ్వు ని కొడుకు గురించి ఎవరైనా డాక్టర్ ని సలహా అడిగేవా?’ అని నేమేక తండ్రిని అడిగేడు.
‘వాడికి జబ్బు లేదు’. అన్నాడు తండ్రి.
మరి వాడికి ఏవిటి? కుర్రాడి మనసుకి జబ్బు చేసింది. దాన్ని ఒక మూలికావైద్యుడు దారికి తెస్తాడు. వాడికి కావలసిన మందు అమలిలే దాన్ని ఆడవాళ్లు వాళ్ళ భర్తలిని తిరిగి వశం చేసుకోవడానికి వాడతారు’.
అతను చెప్పింది రైట్ దీనికి మందు
వెయ్యాలి’. అన్నాడు మరో పెద్ద మనిషి.
‘నేను ఇలాటి డాక్టర్లని పిలవను’. అన్నాడు నేమేక నాన్న. ‘నేను మరో మచుబా భార్యని కాను. నాకొడుకు వాడ్ని వాడు చంపుకోవాలనుకుంటే అలాగే కానివ్వండి. నేను సాయం చెయ్యను.’
కానీ అది ఆవిడ తప్పు. ఆవిడ చాల తెలివైనది. ఆవిడే మంచి మూలికావైద్యుడి దగ్గరకి వెళ్ళాలి’
అన్నాడు ముడుకొద్వి.
ఆవిడ ఒక చెడు హంతకురాలు.’ అన్నాడు జనాడాన్. ఆటను, సాధారణంగా ఎవరితోనూ వాదనకి దిగడు. ఆ మందును ఆవిడ భర్త కోసం తయారు చేసింది. దాన్ని అతని పేరు మీదే తయారు చేసేరు. దాన్ని
ఆరు నెలల తరవాత. నేమేక తన భార్యకి. తండ్రి రాసిన ఉత్తరం చూపించేడు. ‘నువ్వు ని పెళ్లి ఫోటో నాకు పంపడం షాక్ అనిపించింది. నేను దానిని వెనక్కి పంపేవాడిని తరవాత మరోసారి ఆలోచించెను నీ భార్య ఫోటో తీసేసి నీకు పంపుదామనుకున్నాను.
నాకు ఆవిడతో ఎలాటి సంబంధం లేదు. మీ ఇద్దరితో సంబంధం లేకపోతే బావుండును.
నెనె ఆ ఉత్తరం చదివిన తరవాత, చింపేసిన ఫోటో చూసి ఏడవడం ప్రారంభించింది.
‘ఏడవకు ఆతను స్వతహాగా మంచివాడు. ఏదో ఒక రోజు మన పెళ్లి ఒప్పుకుంటాడు’ అని భర్త ఓదార్చేడు.
కానీ ఆ ఒక రోజు రాలేదు.
ఎనిమిది ఏళ్ళు. ఒకే కొడుకుతో ఎలాటి సంబంధం పెట్టుకోలేదు మూడుసార్లు మాత్రం
ఇంటికి శలవుకి రమ్మన్నప్పుడు రాసేడు
‘నేను నిన్ను నాఇంట్లోకి రావడన్ని ఒప్పుకోను, నువ్వు నీ సెలవు ని ఎలా గడుపుతావన్నది నాకు అనవసరం’ అని జవాబు రాసేడు.
నేమేక, పెళ్ళికి విరుద్ధంగా పెరిగిన పక్షపాతం వాళ్ళ ఉరికి మాత్రమే లేదు లాగోస్ లో ముఖ్యంగా
వాళ్ళ వాళ్ళు పని చేసే చోట అది మరొక విధంగా చూపించింది. వాళ్ళ ఆడవాళ్లు. వాళ్ళ ఊరి మీటింగ్ లో కలిసిన
మీటింగులో కలిసినప్పుడు. నెనె తో అంత స్నేహంగాలేరు ఆవిడ వాళ్లలో ఒకరు కాదు అన్నట్టు ప్రవర్తించేవారు. కానీ కాలం గడిచిన కొద్దీ నెనె వాళ్లతో స్నేహం చేసింది. నెమ్మదిగా వాళ్ళు ఆవిడా
తమ కన్నా ఇల్లు బాగా పెడుతుందని ఒప్పుకున్నారు.
కథ నెమ్మదిగా వాళ్ళ ఉరికి పాకింది. నేమెకా అతని భార్య చాల సంతోషంగా ఉన్నారని వాళ్ళ
ఉరి ప్రజలకి తెలిసింది. కానీ వాళ్ళ నాన్నకి తెలీదు. పైగా కొడుకు పేరు చెప్పినప్పుడు అతని కోపం చూసి అందరు అతని ముందు కొడుకు పేరు ఎత్తడం మానేసేరు. అతను అతి కష్టం మీద కొడుకుని
మనసులోనించి తీసేసేడు.
బాధ అతనిని చంపేసింది కానీ నెమ్మదిగా జయించేడు.
తరవాత ఓరోజు నెనె దగ్గరనించి ఉత్తరం వచ్చింది. ముందు చదవకూడదు అనుకున్న, ఇష్టం లేకపోయినా చదివేది
వాళ్ళకి తాత ఉన్నాడని తెలిసినప్పటినించి మా ఇద్దరు కొడుకులు అతని దగ్గరకి తీసుకోని వెళ్ళమని గోలచేస్తున్నారు మీరు వాళ్ళని చూడరని చెప్పడం నాకు ఇష్టం లేదు. వచ్చే నెల సెలవు లో వాళ్ళని నేమెకే మీ దగ్గరకి తీసుకురావడానికి ఒప్పుకోమని అడుగుతున్నాను నేను. లాగోస్ లోనే ఉంటాను.
ఆ ముసలతనుకి తాను ఇన్నాళ్లు తీసుకున్న నిర్ణయం సడులుతున్నట్టు అనిపించింది. ఆలా
ఒప్పుకోకూడదని తనకి తానే చెప్పుకున్నాడు. ఇలాటివాటికి. లొంగకూడదని. అనుకున్నాడు.
కిటికీకి అనుకోని బైటికి చూసేడు. ఆకాశం నిండా మబ్బులు కమ్ముకొని గాలికి దుమ్ము ఆకులూ ఎగురుతున్నాయి. మానవ జీవితం యుద్ధంలో ప్రకృతి కూడా కలుస్తుంది. ఉరుములు మెరుపులతో పెద్దపెద్ద చినుకులు పడుతున్నాయి. ఆతను తన మనవల గురించి ఆలోచన మానేయాలని గట్టిగ ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనికి తెలుసు. తాను ఇప్పుడు ఓడిపోయే యుద్ధంలో పోరాడుతున్నాడు.
అతని మనసు పిల్లల వేపు తిరిగింది. వాళ్ళకి తన తలుపులు ఎలా మూస్తాడు? వాళ్ళు తన ఇతి బైట ఆ ఘోరమైన వాతావరణంలో నిలుచున్నట్టు ఊహించేడు.
ఆరాత్రి అతను నిద్ర పోలేదు. వాళ్ళని చూడకుండా చచ్చి పోతానేమో అన్న భయంతో నిద్ర రాలేదు.
————