ఎక్కడో కాల గర్భంలో
కలిసిపోయిన కవనాల్ని
శిధిలమైన కావ్యాల్ని
మోసుకు వస్తాయి రోజులు..!!
సూరీడు వస్తాడు,
ఈ నేల మీద కొత్త కాంతుల్ని
కొత్త ఆశల్ని పూయిస్తాడు !!
రెక్కలగుర్రాలు వస్తాయి
కొత్త వసంతాల వైపు నిన్ను మోసుకుపోతాయి !!
వసంతం వస్తుంది
మోడుబారిన నీ హృదయకలశం నిండా
కొత్త ప్రేమల్ని నాటుతుంది
నువ్వు ఎదురుచూడాలే గానీ
నీకు ఎదురుపడేవన్ని వసంతాలే