నిక్ వాళ్ళ నాన్న కోసం. దుంగలు నరకడానికి డిక్ బౌల్డన్ ఇండియన్ క్యాంపు నించి వచ్చేడు. అతను తనతో పాటు తన కొడుకు ఎడ్డిని బిల్లీ టాబుషా అనే మరో ఇండియాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళు అడవి వైపు ఉన్న గేటు లోనించి వచ్చేరు. ఎడ్డీ ఒక రంపం తెచ్చుకున్నాడు.
డిక్కీ మూడు గొడ్డళ్లు తెచ్చేడు.
ఆటు వైపు తిరిగి గేటును మూసేసేడు. మిగిలినవాళ్లు, అతని కన్నా ముందే.
సరస్సుకి వెళ్ళేరు.
అక్కడ ఇసుక లో దుంగలు ఉన్నాయి. ఆ దుంగలు మెజెస్టిక్ అన్న స్టీమర్ నించి తప్పిపోయేయి.
అవి బీచ్ లో కూరుకుపోయేయి. ఎప్పుడైనా వాటికీ ఏవి జరగకపోతే మేజర్ సిబ్బంది, ఒక
పడవలో వచ్చి దుంగల్ని గుర్తించి ప్రతిదానిని ఒక ఇనప గొలుసుతో కట్టి వాటిని సరస్సులోకి లాగుతారు.
కానీ వాళ్ళు ఎవరూ రారు. ఎందుకంటె వాటిని లేపడానికి వచ్చిన సిబ్బంది కి అయ్యే ఖర్చు కంటే ఇవి ఖరీదుకావు.
ఎవరు రాకపోతే అవి నీటిలో పాడైపోతాయి ఇలా జరుగుతుందని నిక్ నాన్నకి తెలుసు.
అందుకే, ఇండియన్ క్యాంపు నించి వచ్చి ఆ దుంగల్ని కొట్టమన్నాడు వాటిని చీల్చి నెగడుకి
సరిపోయేట్టు చెయ్యమన్నాడు.
ఎడ్డీ , బిల్లీ ఆ దుంగల్ని కదిపి నీళ్ళవేపుకి తోసేరు.
‘దాన్ని సరిగా పెట్టు’ డిక్కీ అరిచేడు.
దాన్ని ఏమి చేద్దవనుకుంటున్నారు? డాక్టర్ అడిగేడు.
‘ కడుగుతున్నాను, ఇసక తుడుస్తున్నాను అవి ఎవరివో తెలుసుకోవాలి’ అన్నాడు డిక్.
ఆ దుంగ మీద ఉన్న ఇసక పూర్తిగా పోయింది.
డిక్ ఇసుకలో ఒంగి దాని మీద ఉన్న మార్కుని. చూసేడు. ‘ఇది వైట్ మంచేవిల్లిది’ అన్నాడు.
డాక్టర్ కి చాల ఇబ్బందిగా ఉంది. ‘దాన్ని నువ్వు చూడకుండా ఉండవలసింది డిక్’ అన్నాడు.
చికాకు పడకు డాక్టర్, నువ్వు ఎవరివి. దొంగిలించావో నాకు అనవసరం’ అన్నాడు.
డి క్.
‘అవి దొంగిలించినవి అనుకుంటే. వాటిని అలాగే వదిలి మీ సామాను తీసుకోని క్యాంపు కి వెళ్లిపోండి’ అన్నాడు డాక్టర్. అతని మొహం ఎర్రగా అయిపోయింది.
సగం పనిలో ‘వెళ్ళకు డాక్ అవి దొంగతనం చేసినవని నాలాగే నీకు తెలుసు అన్నాడు’ డిక్
‘సరే నువ్వు ఆలా అనుకుంటే నీ సామాను తీసుకోని వెళ్లిపో
ఇప్పుడు, డాక్
సామాను తీసుకువెళ్ళు
విను డాక్’
‘నువ్వు నన్ను మళ్ళి ఆలా పిలుస్తే పళ్ళు రాలగొడతాను నువ్వు చెయ్యవ్ డాక్ ‘ డిక్ డాక్టర్ వేపు చూసేడు
డిక్ ది భారి శరీరం అది అతనికి తెలుసు అతని శరీరం యెంత పెద్దదో అతనికి
దెబ్బలాట అంటే అంత ఇష్టం. ఆతను సంతోషంగా ఉన్నాడు.
బిల్లీ,ఎడ్డీ, డాక్టర్ వేపు చూసేరు.
డాక్టర్, కింది పెదవి మీద ఉన్న గెడ్డం నవిలి డిక్ వేపు చూసేడు అప్పుడు అతను కొండ వైపు కాటేజ్ కి వెళ్ళేడు
అతను ఎంత కోపంగా ఉన్నాడో అతని వెంక నించి కూడా వాళ్ళకి తెలుసు.
డిక్ ఓజీబవే భాషలో ఏదో అన్నాడు. బిల్ చాల సేపు అలాగే ఉన్నాడు అతనికి ఇంగ్లీష్ భాష అర్థం కాదు కానీ ఆ దెబ్బలాట జరుగున్నంతసేపు అతను చెమట తోనే ఉన్నాడు. అతను లావుగా ఉంటాడు. చైనా వాడిలా అతనికి కొన్ని ఎంట్రుకలే ఉంటాయి. అతను కొక్కేలు తీసుకున్నాడు.
డిక్ గొడ్డళ్లు తీసుకున్నాడు. ఎడ్డీ చెట్టునించి రంపం తీసుకున్నాడు. వాళ్ళు బయల్దేరి కాటేజ్
దాటి, వెనక గేట్ నించి అడవిలోకి వెళ్ళేరు డిక్ గేట్ తెరిచే ఉంచేడు బిల్లీ వెనక వెళ్లి దాన్ని మూసేసేడు.
కాటేజ్ లో డాక్టర్, మంచం మీద కూర్చొని బీరువా పక్కన నేలని పడిఉన్న మెడికల్ మాగజైన్లని చూసేడు అవి ఇంకా కవర్లలోనే ఉన్నాయి. ఎవరు విప్పలేదు. అతను చాల చిరాకు పడ్డాడు.
‘నువ్వు పనికి తిరిగి వెళ్లడంలేదా?’ అడిగింది పక్కగదిలో ఉన్న భార్య.
‘ లేదు’
‘ఏవిటి విశేషం?’
‘నాకు డిక్ తో దెబ్బలాట జరిగింది’.
‘నువ్వు నీ కోపం తగ్గించు కుంటావని అనుకుంటాను హెన్రీ’.
‘లేదు’
‘ గుర్తు ఉంచుకో ఎవరైతే తన మనసుని కంట్రోల్ చేసుకుంటారో వాడు పట్టణం
జయించినంత గొప్పవాడు.’ అందావిడ.
ఆవిడ క్రిస్టియన్, సైంటిస్ట్, ఆవిడ మంచం పక్కన బైబిల్, సైన్స్ అండ్ హెల్త్ కాపీ ఉంటాయి.
అతను ఏవీ మాట్లాడలేదు. ప్రస్తుతం మంచం మీద కూర్చొని షాట్ గన్ శుభ్రం చేస్తున్నాడు.
పచ్చటి గళ్ళు ఉన్న మగజిన్ తీసి, మల్లి వాటిని అందులో వేసేడు.
‘హెన్రీ ‘అతని భార్య పిలిచింది
‘చెప్పు’
‘నువ్వు బౌల్డన్ కి కోపం తెప్పించేవి యేవి అనలేదుకదా,’
‘లేదు’
‘ దీనిగురించి తగాదా
పెద్దగా ఏవి లేదు’
‘చెప్పు హెన్రీ నాదగ్గర ఏవి దాచకు తగువు ఏవిటి?’
‘డిక్ వాడికి న్యూమోనియా ట్రీట్ చేసిన తరవాత చాలా డబ్బు బాకి ఉన్నాడు అంచేత, నేను డబ్బు తీసుకుంటానేమో అని నాతో తగువు పెట్టుకున్నాడు.’
ఆవిడా ఏవి మాటలాడలేదు
డాక్టర్ చిన్న బట్టతో గన్ ని శుభ్రంగా తుడిచేడు. మోకాళ్ళమీద గన్ పెట్టుకొని కూర్చున్నాడు. తరవాత లేచి నిల్చొని షాట్ గన్ డ్రెస్సేర్ వెనక పెట్టేడు
‘నువ్వు బయటికి వెళ్తున్నావా?’ ఆమె అడి గింది.
‘వాకింగ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను.’
‘నీకు నిక్ కనిపిస్తే అమ్మ రమ్మంది అని చెప్పు’
డాక్టర్ ఫోర్చ్ లోకి వెళ్ళేడు అతని వెనక తలుపు మూసుకుపోయింది
‘సారీ’ అన్నాడు బయట నించి.
‘పరవాలేదు’ అంది ఆవిడ.
అతను ఆవేడిలో గేట్ దాటి అడవిలోకి
వెళ్ళేడు అంత వేడిలో నైనా అడవిలో చల్లగా ఉంది.
నిక్ ఒక చెట్టుని అనుకోని పుస్తకం చదువుకుంటున్నాడు.
‘ మీ అమ్మ నిన్ను రమ్మంది.’ అన్నాడు డాక్టర్.
‘నేను నీతో వస్తాను’ అన్నాడు నిక్.
‘సరే రా ఆపుస్తకం యియ్యి జేబులో పెడతాను’
‘అక్కడ నల్ల ఉడతలు ఉంటాయని నాకు తెలుసు డాడీ’
‘సరే వెళదాం పద’.