ఆకాశం వాన పాట పాడుతున్నప్పుడు
నేల కాగితప్పడవై నాట్యమాడుతుంది
రాలిపడిన పువ్వుల సాక్షిగా
ఇంధ్ర ధనువుల పురివిప్పుతుంది
తూరుపు నుంచీ పశ్చిమాన్ని కలుపుతూ
ఉత్తరానికి దక్షిణానికి ప్రేమ లేఖ రాస్తూ
ఒక్క ఉరుము
ఒక్క మెరుపు
మధ్య మధ్యలో వచ్చి పోతుంటాయి
గుబురు మేఘాల మాటున చిక్కుకున్న
సూరీడు చంద్రుడు
విడుదలకై తపన పడుతూ
చలి గొడుగుల కింద వేడి కాచుకుంటుంటారు
ఇదంతా పట్టని
మనిషి
వాన రంగుల్ని ఆస్వాదిస్తూనో
చిల్లుల చినుకుల పట్ల
చిరాకును పరాకును ప్రదర్శిస్తూనో
వాన గొణుగుడు గొణుగుతుంటాడు
wow..its a feel good poem…total poem is so nice like a rain