తేనెటీగలు మబ్బుల్లా
నింగినంతా ముసురుకుని
చిందాడుతున్నాయి
కోకిల రాగాలు పాడుతోంది
పూల రెమ్మలపై తేనె కారిపోతోంది
కొమ్మలు గాలి మెలికల్లో ఊగిపోతున్నాయి
వసంతపు జాతర జరుగుతోంది
చుట్టూ కోలాహలం
తీపి వాసన గొప్పున కొడుతోంది
యవ్వన మామిళ్ళపైన పాల వాగు పారుతోంది
ఎండంతా దీపాలై వెలుగుతోంది
అంతా మొహపు చినుకుల గల
తప్పిపోయిన ఈ వసంతపు జాతరలో
నీ కోసం తిరుగాడుతున్నాను
నువ్వు తిరిగిన నేలంతా పూలతో తేనెతో నిండిపోయింది
రాలిపోయిన పువ్వులలోంచి
కొత్త తేనెటీగలు ఎగురుతున్నాయి
నేను ఆ గుంపులో కలిసిపోయాను