పిల్లలూ..పువ్వులు..హైకులు

Spread the love

జుత్తుని చెరుపుతోన్న గాలి

నా ముఖాన్ని మృదువుగా చేస్తోంది ~

బలే బావుంది.     – కెవిన్ నునెల్ (7 సం.లు )

***

వాన పడుతున్న రోజు ~

గుంజ మీద చిన్న చీమ

ఎక్కుతూ..జారుతూ.. – ఎల్లిసన్ హెన్నెస్సి ( 6 సం.లు)

***

వాన సంతోషం ~

నీళ్ళ పడెలలో ఎగురుతూ

దుముకుతూ కీచురాళ్ళు  – టామీ బాయ్డ్ ( 7 సం.లు )

***

ఒంటరిగా, విచారంగా

కదలక లేని కీటకం ~

వాననీళ్ళు, కన్నీళ్ళు  – టాడ్ థర్బర్ ( 6 సం.లు )

***

వాన చినుకులు ముద్దాడే

పూవులు ఊగుతున్నాయి ~

ప్రేమని వర్షిస్తున్న మిన్ను  – క్రిస్ డూయెమ ( 6 సం.లు )

***

కృతజ్ఞతగా తలెత్తుతున్నాయి

వికసిస్తున్న కుసుమాలు ~

ప్రకృతి కానుక వానకు – జాన్ డోరా ( 5 సం.లు ) / మిచెల్లె జెర్నిగన్ ( 7 సం.లు )

***

దివ్య సంగీతం ~

మెల్లగా పాడుతున్న గాలీ,గడ్డి గమకాలు

తూర్పుకు తేలిపోతూ – జెరిమీ మైర్స్ ( 5 సం.లు )

***

సావాసగాళ్ళ గురించి 

గూడులో కలగంటూ ~

ఒక చిన్ని పిట్ట – జేసన్ కుట్నెర్ ( 5 సం.లు )

***

వెతుక్కుంటూ..ఎదురుచూస్తూ

నీలి పక్షి పిల్ల ~

నా అమ్మ ఎక్కడ ? – లెవాన్ వార్టనియన్ ( 7 సం.లు )

***

ఉరుములు ఉరుముతున్నాయి ~

తల్లి రెక్కల కింద కూన

నిర్భయంగా, నిశ్చింతగా – చికితా విల్లీస్ ( 5 సం.లు )

( ఈ హైకులు అమెరికాలోని హుస్టన్( టెక్సాస్)నగరంలో విల్‌హెల్మ్ స్కూలు పిల్లలు రాసినవి.వీరు 4 నుంచి 8 యేళ్ళ ప్రాయం కల పిల్లలు.వీరు 20 దేశాల నుంచి, 9 వివిధ మతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నవారు. 1971 లో ఈ స్కూలు పిల్లల హైకులతో సంకలనం చేసిన Haiku Poetry , a children’s collection అనే పుస్తకం నుంచి నవంబర్ 14 పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ హైకులు అనువాదం అందిస్తున్నాను )


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *