మా నేలకు...
దేవుని వాక్కుకు దగ్గరగా,
మేఘాలు పైకప్పుగా ఉన్న
మా నేలకు
నామ విశేషణాలకు దూరంగా
ఉనికి లేని దేశ పటం లాంటి
మా నేలకు
నువ్వు గింజ అంత చిన్నగా
ఆకాశం భూమి కలిసే స్వర్గమయ క్షితిజరేఖ అదృశ్య లోయ
మా నేలకు
పవిత్ర గ్రంథాలు... అస్తిత్వ గాయం
'గ్రౌస్ ' పక్షి రెక్కలంత నిరుపేద
మా నేలకు
గతం ఆకస్మికంగా చేసే కొత్త దాడిలో,
శిధిల పర్వతాలు చుట్టి ఉన్న
మా నేలకు
దహించే ఆకాంక్షతో చావడానికి స్వేచ్చ
యుద్దం ఇచ్చే బహుమతి
మా నేలకు
ఇంకా...
మా నేల
రక్తసిక్తమైన రాత్రి,
దూరాల అవతలి దూరాల నుండి చూస్తే
మెరిసే ఆభరణపు పైపూత
లోపలి మాకు మాత్రం
ఊపిరాడని ఉక్కపోత!