ఈ కాలం ఉంది చూశావూ!
ఎంత తపన దానికి
చేయి పట్టుకుని మరీ
గతంలోకి లాక్కెళ్లుతుంది.
గత అనుభవాలు
క్రూరమైనవైనా
జ్ఞాపకాలల్లో సమాధి కావడం లేదు.
ఎవరూ ఎవరికి
గుర్తుండని కాలంలో
దేన్నైనా వాంఛించడం
భూమిని కోయడం లాంటిదే!
అన్నట్టు తన అలల ఘోషలో ప్రపంచాన్ని దాచుకొన్న సముద్రం
నాకేసి జాలిగా చూస్తోంది
కళ్ళల్లో
వెలుగు చుక్కలేమైనా మెరుస్తాయేమోనని!
రెండు కళ్ళు తెరచుకోవడానికి
ఇలాంటి నిజాల్ని
చాలా జీర్ణించుకోవాలేమో!
ఇప్పుడు
నా వేటకు నేనే తుపాకి నవ్వాలి.
నా వేటకు నేనే
