కొన్ని కథలు ఏ ఆర్భాటాలూ లేకుండా మొదలై, ఏ సందేశమో ఇవ్వాలని పనిగట్టుకొని రాయకున్నా పాత్రల జీవితాల్లోకి తొంగిచూస్తే (నిజానికి రచయితే ఆ జీవితాన్నంతా మన ముందుకు తీసుకొచ్చి పరుస్తాడు) మనకు కావాల్సిందేదో దొరికేస్తుంది. అలా సాగే కథలివి.
జెయమోహన్ ఈ కథలతో మనల్ని ఏడిపించేస్తాడు. ఎందుకు ఏడ్చామని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ కథలకు ఒక అర్థం చేకూరినట్టే.
రచయిత జెయమోహన్ గారికి, తెలుగు పుస్తకమే చదువుతున్నంత అందంగా అనువాదం చేసిన భాస్కర్ అన్నకూ, ప్రచురణకర్తలు మోహన్, అరుణ్‌కి – నా ప్రేమ.
అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది. నేను ఈ పుస్తకం గురించి ఒక పాడ్‌కాస్ట్ రికార్డ్ చేసి మాట్లాడా. వినండి.
For Copies – https://chaayabooks.com/product/nemmi-neelam/