నీకు డబ్బు లేకపోతే ఎంత అందంగా ఉన్న లాభం లేదు. ప్రేమ డబ్బున్నవాళ్ళ హక్కు నిరుద్యోగుల వృత్తి కాదు, బీదవాళ్లు పని లో ఉండాలి, ఆకర్షణల కన్నా. శాశ్వతంగా డబ్బు ఉండడం మంచిది’ యీ ఆధునిక జీవిత సత్యాలు హుగ్ ఏరిసిస్కిన్ ఎప్పుడు గ్రహించలేదు. పాపం తెలివితేటల పరంగా అతను ఏమంత గొప్పవాడు కాదని మనం ఒప్పుకోవాలి. అతను చాల అందంగా ఉంటాడు ఆడవాళ్లతోను, మొగవాళ్లతోను, చాలా ఇష్టంగా ఉంటాడు. అతనిలో
అన్నీ ఉన్నాయి ఒక్క డబ్బు చేసుకోవడం మాత్రం లేదు. వాళ్ళ నాన్న అతనికి ఇచ్చిన ఆస్థి, ఒక సైనికుడి కత్తి . పదిహేను వాల్యూములు హిస్టరీ అఫ్ ది పెనిన్సులర్ వార్ అన్న పుస్తకాలు ఇచ్చేడు. అతని మేనత్త ఏడాదికి ఇచ్చే. రెండువందల పౌండ్ల లోనే బతుకుతున్నాడు. డబ్బు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసేడు ఆర్నెల్లు స్టాక్ ఎక్స్చేంజి లో చేసేడు. కానీ ఎద్దులు, ఎలుగుబంట్ల మధ్య సీతాకోకచిలుక ఏమి చెయ్య గలదు? తరవాత కొన్నాళ్ళు టీ వ్యాపారం చేసేడు. కానీదానిలోనూ అలిసిపోయేడు. తరవాత షేర్రీ అమ్మేడు. అదీ కలిసిరాలేదు. చివరకి ఎందుకు పనికిరానివాడుగా ఏ ఉద్యోగం లేనివాడిగా మిగిలిపోయేడు.
ఇంకా భయంకరమైనది, అతను ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన అమ్మాయి పేరు లారా మెరిటన్. అమ్మాయి తండ్రి, రిటైర్డ్ కల్నల్. అతను తన హోదాని జీర్ణశక్తిని, ఇండియాలో వదిలేసేడు లారా హుగెజి ని ఆరాధించింది. వాళ్ళు లండన్లో అతి అందమైన జంట. కల్నల్ కి కూడా అతనంటే ఇష్టమే, కానీ ఎంగేజ్మెంటుకి ఒప్పుకోడు. ‘పదివేల పౌండ్లతో నా దగ్గరకి రా అప్పుడు దాని సంగతి చూద్దాం’ అన్నాడు. హిగ్గి ఆ రోజుల్లో చాలా విచారంగా ఉండేవాడు. ఓదార్పు కోసం లారా దగ్గరకి వెళ్ళేవాడు.
ఒకరోజు పొద్దున్న లారా దగ్గరకి వెళ్తూ, తోవలో అతని స్నేహితుడు ఎలాన్ ట్రెవర్ దగ్గర ఆగేడు. ట్రెవర్ మంచి పెయింటర్. అంతే కాదు అత నొక మంచి ఆర్టిస్ట్. అతని లాంటి ఆర్టిస్టులు చాలా అరుదు. వ్యక్తిగా ఆతను మోటుగా కనిపిస్తాడు. అయితే అతను బ్రష్ పట్టుకుంటే మాత్రం, అసలైన నిపుణత కనిపిస్తుంది. అతని పెయింటింగ్స్ కి చాల విలువ ఉంది. మొదట అతను హగ్గి ని చాల ఇష్టపడ్డాడు కేవలం హగ్గి అందం వల్లే అని చెప్పేడు అందమైనవాళ్ళని, తెలివైనవాళ్ళని పెయింటర్ తెలుసుకోవాలి. ‘అందంగా బట్టలు వేసుకున్న మొగాళ్ళు ఆడవాళ్ళూ ప్రపంచాన్ని ఏలుతారు’ అంటాడు. అతను. ఎలాగైతేనేం హగ్గిని అతని అందానికి, నిర్లక్ష్యమైన అతని స్వభావానికి ఇష్టపడ్డాడు. అందుకే అతను తన స్టూడియో కి ఎప్పుడైనా రావచ్చు.
అతని ఇంటికి హగ్గీ వెళ్లేసరికి, అతను ఒక బిచ్చగాడి పెయింటింగ్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు. స్టూడియోలో ఓమూల బిచ్చగాడు నిలబడి ఉన్నాడు. ముడుతలు పడిన మొహంతో అతి దినంగా కనిపిస్తున్నాడు. అతని భుజం మీద చిరుగులతో ఉన్న ఒక ముతక కోటు వేలాడుతోంది అతని దళసరి బూట్లు అక్కడక్కడా కన్నాలు పడ్డాయి. అతను ఒక చెయ్యి కర్ర మీద పెట్టి, రెండో చేత్తో బిచ్చం కోసం ఒక టోపీ పట్టుకున్నాడు. ఎంత మంచి మోడల్ అన్నాడు హగ్గీ. ట్రెవర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ. అంత మంచి మోడెలా? అరిచేడు ట్రెవర్. అతని లాంటి బిచ్చగాళ్ళ ప్రతి రోజూ దొరకరు. రెంబ్రాంట్ ఇతన్ని ఎంత బాగా పెయింట్ చేసేవాడో పాపం ముసలివాడు ఎంత దినంగా కనిపిస్తున్నాడు కానీ మీ పైంట్ర్స్కి అతని మొహం అతని అదృష్టం’ అన్నాడు హగ్గీ ఔను బిచ్చగాడు సంతోషంగా ఉండడం నీకు కావాలా
ఆలా కూర్చోవడానికి మోడల్ కి ఎంత వస్తుంది అడిగేడు హగ్గీ’ దివాన్ మీద కూర్చుంటూ గంటకి షిల్లింగ్ మరి ని పెయింటింగ్ కి నీకు ఎంత వస్తుంది దీనికి రెండు వేలు వస్తుంది పౌండ్లు? కాదు గినీలు ( ఒక గినికి పదకొండు షిల్లింగులు ). పైయింటర్లు, కవులు,డాక్టర్ లు, ఎప్పుడు గినీ లే తీసుకుంటారు బావుంది, మోడల్ కి పెర్సెంటేజ్ ఇవ్వాలి అన్నాడు నవ్వుతు హగ్గీ
నాన్సెన్స్, రోజంతా ఆలా నిల్చొని పెయింట్ చేసే శ్రమ చూడు, ఆలా మాట్లాడ్డం నీకు బాగానే ఉంటుంది కానీ హగ్గీ శారీరక శ్రమకి ఇచ్చిన విలువ కళ కి ఇవ్వాలి నువ్వు ఆలా వాగకు నేను చాలా బిజీగా ఉన్నాను ఓ సిగరెట్ తీసుకొని మాట్లాడకుండా కూర్చో’ అన్నాడు ట్రెవర్.
కొంసేపు అయ్యేక నౌకరు వచ్చి ఫ్రేమ్ కట్టేవాడు వచ్చేడ ని చెప్పేడు. పారిపోకు హగ్గీ నేను వేంటనే వచ్చేస్తాను అని ట్రేలర్ బైటికి వెళ్ళేడు. ట్రెవర్ లేనప్పుడు కొంత విశ్రాంతి తీసుకుందామని ఆ ముసలి బిచ్చగాడు వెనక ఉన్న బెంచికి చెరబడ్డాడు. ఒంటరిగా దినంగా కనిపిస్తున్న అతన్ని చూస్తే, హగ్గీ కి జాలి వేసింది. తన దగ్గర డబ్బు ఎంత ఉందొ అని జేబులు వెతికేడు ఒక పౌండ్ బంగారు నాణెం, కొన్ని చిల్లర నాణేలు కనిపించేయి. పాపం ముసలాడు, నాకంటె అతనికే ఎక్కువ అవసరం. అనుకొని లేచి వెళ్లి. ఆ ముసలాడి చేతిలో పౌండ్ నాణెం వేసేడు.
ఆముసలాడు ఆశ్చర్యంతో సన్నగా నవ్వి, ‘థాంక్యూ సర్’ అన్నాడు.ఇంతలో ట్రెవర్ లోపలికి వచ్చేడు హగ్గీ వెళ్ళిపోయేడు. ఆవేళ అతను లారా తో గడిపి, అతని దుబారాకి తిట్లు తిని ఇంటికి వెళ్ళిపోయేడు.
ఆరాత్రి పదకొండు గంటలికి, పాలెట్ క్లబ్ కి వెళ్ళేడు. అక్కడ స్మోకింగ్ రూంలో పైప్ కాలుస్తూ ట్రెవర్ కనిపించేడు. ‘పెయింటింగ్ పూర్తి చేసేవా?’ హిగ్గి అడిగేడు ఆహా ఫ్రేమ్ కూడా అయిపోయింది. సరికాని నువ్వు జయించేవు నువ్వు చుసిన ఆ ముసలాయన
నువ్వంటే చాల ఇష్టపడ్డాడు. నేను నీగురించి అంతా చెప్పేసేను. నువ్వు ఎవరో ఎక్కడ ఉంటావోని ఆదాయం అన్ని చెప్పేసేను అన్నాడు ట్రెవర్ నేను ఇంటికి వెళ్లేసరికి అతను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ నువ్వు జోక్ చేస్తున్నావు
పాపం ముసలాడు నేను అతనికి ఏవైనా ఇస్తే బావుంటుంది. నా దగ్గర పాత బట్టలు గుట్టలు ఉన్నాయి అవి అతనికి ఇస్తే ఎలా ఉంటుంది అన్నాడు.
కానీ అతను వాటిలోని అద్భుతంగా ఉన్నాడు. నేను అతన్ని బ్రహ్మాండమైన కోటు లో ఎంత ఇచ్చినా పెయింట్ చెయ్యను నువ్వు చెప్పే పీలికలు నేను రొమాన్స్ అంటాను నీకు కనిపించే బీదరికం నాకు అందంగా కనిపిస్తుంది. ఏవైతేనేం నీ కోరిక అతనికి చెప్తాను’ అన్నాడు ట్రెవర్. ఎలెన్ మీ పైయింటర్స్ కి హృదయం ఉండదు అన్నాడు హిగ్గి సీరియస్ గా.కళాకారుడి మెదడే అతని హృదయం, పైగా ప్రపంచాన్ని మేము చూసినట్టే గ్రహించడం మా వృత్తి బాగు చెయ్యడం కాదు ఇంతకీ లారా ఎలా ఉందో చెప్పు, ఆ ముసలి మోడల్ కి ఆవిడ అంటే చాల ఆసక్తి అన్నాడు ట్రెవర్. అంటే నువ్వు ఆవిడ గురించి చెప్పేవా? అరిచేడు హగ్గీ.
తప్పకుండా చెప్పాను ఆ కల్నల్ గురించి లారా గురించి. పదివేలపౌన్ల గురించి అతనికి అంతా తెలుసు.నువ్వు ఆ ముసలి బిచ్చగాడికి నా స్వంత విషయాలన్నీ చెప్పేవా? హగ్గీ మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది.ఒరే బాబూ నువ్వు అంటున్న ఆ ముసలి బిచ్చగాడు యూరప్ లో ఉన్న అతి పెద్ద ధనవంతుల్లో ఒకడు. అతను బ్యాంకు లోనుంచి డబ్బు తియ్యకుండా, రేపు లండన్ మొత్తం కోనేయ్యగలడు. ప్రతి రాజధానిలో అతనికి ఒక బంగాళా ఉంది బంగారు పళ్ళెంలో తింటాడు, కావాలంటే రష్యాతో యుద్ధం చెయ్య కుండా ఆపగలడు.’
ఏవిటి నువ్వు అంటున్నది ?ఏవిటి అంటే స్టూడియోలో నువ్వు చుసిన ఆముసలాడు బారన్ హన్సబుర్గ్, అతను నాకు మంచి స్నేహితుడు నా పెయింటింగులు అతనే కొంటాడు. ఒకనెల క్రితం తనని బిచ్చగాడుగా పెయింట్ చెయ్యమని అడిగేడు. అతను ఆ చిరుగులలో అద్భుతంగా ఉన్నాడు. అవి నావే అనుకో నేను స్పెయిన్లో కొన్న సూటు.’ బారన్ హన్సబుర్గ్ అరిచేడు. హగ్గీ ఓరి భగవంతుడా! నేను అతనికి ఒక పౌండు ఇచ్చెను అని కుర్చీలో కూలబడిపోయేడు.
పౌండు ఇచ్చేవా? అని ట్రెవర్ పగలబడి నవ్వడం ప్రారంభించేడు. నువ్వు నాకు చెప్పి ఉండవలసింది, నన్ను అంత ఫూల్ చెయ్యకుండా ఉండవలసింది. హగ్గీ నువ్వు అంత నిర్లక్ష్యంగా డబ్బు పంచుతావని అనుకోలేదు, నువ్వు ఒక అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే. అర్థం చేసుకుంటాను, కానీ ఒక బిచ్చగాడికి పౌండు ఇవ్వడం పైగా ఇవాళ నేను ఎవరికి ఇంట్లో దొరకను నువ్వు వచ్చినప్పుడు, హన్స్ బర్గ్ తన పేరు చెప్పడం ఇష్టపడతాడో లేదో నాకు తెలీదు
నా గురించి ఎంత అసహ్యంగా అనుకున్నాడో ఎంత మాత్రం కాదు నువ్వు వెళ్లిన తరవాత అతను చాల హుషారుగా ఉన్నాడు అతను ని గురించి తెలుసుకోడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నాడో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది అతను నీ డబ్బుని నీకు పెట్టుబడి పెడతాడు ఆర్నెల్లకి ఒకసారి వడ్డీ ఇస్తాడు. తరవాత డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పడానికి మంచి కథ’ అన్నాడు ట్రెవర్.
నేను పరమ దురదృష్టవంతుడ్ని. ఇప్పుడు చెయ్యవలసినపని నిద్రపోవడం ఇదిగో ఎలెన్ నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను మొహం చూపించలేను నాన్సెన్స్ అది నీకు మనుషులపట్ల ఉన్న దయ చూపెడుతుంది హగ్గీ పారిపోకు మరో సిగరెట్ తీసుకో లారా గురించి నీ ఇష్టం వచ్చినంత సేపు చెప్పు’ అన్నాడు ట్రెవర్. ఐనా హగ్గీ ఉండలేదు, ఇంటికి వెళిపోయేడు. ట్రెవర్ నవ్వు ఆపుకోలేకపోయేడు.
మర్నాడు పొద్దున్న హగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు అప్పుడు నౌకరు ఒక కార్డు తెచ్చి ఇచ్చేడు దానిమీద ‘మన్షియర్ గస్టోవ్ నాడిన్’ అని.ఉంది. అది బారన్ దగ్గర నించి అని తెలుసు బహుశా క్షమాపణ కోసం వచ్చి ఉంటాడు అనుకున్నాడు హగ్గీ. అతన్ని లోపలి పంపమని నౌకరికి చెప్పేడు బంగారం కళ్ళ జోడు తెల్ల జుట్టుతో ఉన్న ఒక ముసలాయన లోపలి వచ్చేడు. నేను హగ్గీతో మాట్లాడుతున్నానా? అన్నాడు ఫ్రెంచ్ యాసతో హగ్గీ తలా ఊ పేడు.
నేను బారన్ హన్సబుర్గ్ నించి వచ్చెను బారన్ …… అతను ఏదో చెప్పబోయేడు సర్. అతనికి మీరు క్షమాపణలు చెప్పండి అన్నాడు హగ్గీ బారన్ మీకు యి ఉత్తరం ఇమ్మన్నాడు అని ఒక ఉత్తరం ఇచ్చేడు
ఆ కవరు మీద. హగ్గీ లారాల పెళ్లి ప్రెజెంట్ ఒక బిచ్చగాడినుండి’ అని ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు బారన్ మంచి స్పీచ్ ఇచ్చేడు మిలియనీర్ మోడల్స్ అరుదు కానీ మోడల్ మిల్లియనీర్స్ మరి అరుదు అన్నాడు ట్రెవర్.