బోసిపోయిన కాలం

Spread the love

వసంతపు తొలిరోజుల్లో
నీ రాకను మళ్ళీ తలుచుకుంటాను
చెట్లన్నీ పూలు పూయటం చూసి
పూల బరువుతో కొమ్మలను వేలేసుకోవడం చూసి
జాలి పడతాను

పక్షులు దూరటానికి సందులేకుండా
పూసిన పూలను చూసి కోప్పడతాను

ఈ పూలన్నీ నేలన సమాధిపై కన్నీటి బిందువులుగా
దీనంగా రాలిపడటం చూసి బెంగపడతాను

రాలిన పూలన్నీ మట్టిలో
మునిగిపోవడం చూసి దుఃఖపడతాను

ఏ కోకిలైనా తన గానంతో
కనుమరుగైన పూలను మళ్ళీ నేల నుంచి
చెట్టుకి చేరుస్తుందా అని ఆశ పడతాను

కానీ పూలు లేని బోసిన కొమ్మలను చూసి
కోకిలలు ఆకాశంలో కలిసిపోతాయి

వసంతం ఒంటరిగానే ముగిసిపోతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *