నీ అలలారే జుత్తుని చూసి
ప్రేమతో ముచ్చటపడి
అతనో ప్రతిన పూనాడు.
'ప్రియా..నువ్వు రజస్వల కాగానే
నా ఇంటికి వెలుగవుతావు '.
అక్కడ ఒక వేటగాడు మూలాలను తవ్వి
ఒక విలువైన రత్నాన్ని కనుగొనే
కొండల నుండి అతను వచ్చాడు.
నాకు తెలీదు, మిత్రమా
ఇప్పుడు అతనెక్కడున్నాడో..-
( స్నేహితురాలు ఆమెతో అన్న మాటలు..ఆమె తలిదండ్రులు చాటుగా వింటున్నారు )
--- అనాన్ ( కురుంతొగై 379 ) 40
ప్రతిన
