చెట్లన్నీ తెల్లనిపూలు బట్టి
మబ్బంతా నల్లనిచినుకులు విడిచి
బాటంతా ఎర్రనినీళ్ళు పారుతూ
చేనంతా చిగురుకొమ్మలతో ఊగుతూ
గాలంతా చల్లగా తేలుతూ
పిచుకలన్నీ కూనిరాగాలు తీస్తూ
కొండలన్నీ మెరుపు అంటి కందిపోయి
కందితోటంతా బుల్లిగుడ్లు పొదిగిన గూళ్లని మోస్తూ
పిచ్చిగడ్డంతా వో పక్కకి నడుమొంచి
నీళ్ళ వార బోస్తున్న వాగుని చూస్తూ
బీడంతా బర్రెల్ని మూట గట్టుకుంటూ
పల్లెంతా పొగ చూరుతూ
పొయ్యిలన్నీ జొన్నరొట్టెల అద్దుడు దరువేస్తూ
మాడిజాముకి కొంగలన్నీ కొమ్మలకు మళ్ళుతూ
ఈ వేళలో ఇలా నీ కనురెప్పలతో గీసిన
మిన్నుని చూస్తూ మురుస్తున్నాను.











బాగుందోయ్ పల్లె కవి..
మప్పిదాలు సార్