ఒక రోజు పొద్దున్నే నీటి ఎలక తన కన్నం లో నించి తల బైటికి పెట్టి చూసింది. దాని కళ్ళు
పెద్దవి. సిమెంట్ రంగు మీసాలు. ఇండియా రబ్బర్ లాటి పెద్ద తోక. ఎదురుగా ఉన్న చెరువులో
చిన్న బాతు పిల్లలు యీదుతున్నాయి తెల్లని రంగు ఎర్రటి కాళ్ళు ఉన్న వాళ్ళ అమ్మ వాటికీ
నీటిలొ తల పెట్టి. ఎలా నిలుచోవాలో చెప్తోంది
మీరు తల మీద నిల్చోవడం నేర్చుకోకపోతే మంచి సోసియేటిలో మీరు ఎప్పుడు ఉండలేరు
అని అది చెప్తూనే ఉంది ఎలా చెయ్యాలో కూడా అప్పుడప్పుడు చూపిస్తోంది. కానీ ఆ చిన్న పిల్లలు
తల్లిని ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. సోసియేటిలో ఉండడంవల్ల. లాభం ఏవిటో తెలీనంత చిన్నవి
యీ పిల్లలకి ఎంత నిర్లక్ష్యం. వీటిని నీటిలో ముంచేయ్యాలి. అరిచింది నీటి ఎలక
అలాటిదేవీలేదు ప్రతి వాళ్ళకి. ఒక ప్రారంభం ఉంటుంది. తల్లి తండ్రులు మరీ ఓర్పుగా ఉండలేరు అంది తల్లి బాతు
ఓహో తల్లి తండ్రుల భావాలూ. నాకు అంత తెలివులే. నిజం చెప్పాలంటే. నేను పెళ్లి చేసుకోలేదు. చేసుకోతలుచుకోలేదుకూడా ఒక రకంగా ప్రేమ మంచిదే. కానీ స్నేహం ఇంకా మంచిది
ఒక మంచి. స్నేహం కంటే గొప్పది ప్రపంచంలో. ఏది నేను చూడలేదు. అంది ఎలక
పక్కనే. చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇదంతా వింటున్న కోయిల.
అయితే మంచి స్నేహం. తాలూకు భాద్యతలు గురించి ని అభిప్రాయం ఏవిటో. అడిగింది
అవును. నాకూ అదే తెలుసుకోవాలనిఉంది అంది బాతు. తరవాత చెరువు చిరాకు యీడుతు
వెళ్లి. తన పిల్లలై చెప్పడానికి. తల మీద నిలు చుండి
యెంత. పిచ్చి ప్రశ్న నా ఫ్రెండ్ న పట్ల అంకితభావంతో. ఉండాలి. అంది ఎలక
మరి బదులుగా నువ్వు ఏవి చేస్తావు. అడిగింది కోయిల రెక్కలు టపటపా కొడుతూ
నాకు అర్థం కాలేదు అంది ఎలక
యీవిషయం మీద నేను ఓ కథ చెప్తాను. అంది కోయిల
అది న కథేనా ఐతే చెప్పు. వింటాను. నాకు కథలంటే ఇష్టం. అంది ఎలక
అనగనగా హన్స్ అనే ఒక నిజాయితీ కలవాడు ఉన్నాడు
అతను గొప్పవాడా. అడ్డొచ్చింది ఎలక
మధ్యలో. అడ్డు రాకు. ఎంతమాత్రం కాదు. అయితే. జాలి గుండె ఉంది. అతను ఒక చిన్న గుడిసెలో ఉంటాడు రోజూ తన తోటలో పని చేస్తాడు. ఆ చుట్టుపక్కల
ఎక్కడా. అతని తోటంతా అందమైన తోట లేదు. అన్ని రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి
ఏకాలంలో అపువ్వులు పూస్తాయి.
అతనికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ అందరికన్నా అతి దగ్గర ఫ్రెండ్ మిల్లర్
అతను. ఆ తోట పక్క నించి ఎప్పుడు వెళ్లిన. యేవో పువ్వులు తెంపుకొని పోతాడు. నిజమైన
స్నేహితులకి అన్నిటిలోను సమానంగా ఉండాలి. అంటూ ఉంటాడు. హన్స్ తల ఊపుతూ నవ్వుతాడు
మిల్లరికి బాగా డబ్బు ఉంది కానీ అతను ఎప్పుడు హన్సీకి ఏవి ఇవ్వలేదు అని ఇరుగు పొరుగు అంటారు అతనికి మిల్లులో వంద సంచుల పిండి ఉంది. పలు ఇచ్చే ఆవులు అర డజను ఉన్నాయి
ఊలు ఇచ్చే గొర్రెలు వంద ఉన్నాయి ఐన అతను హన్సీకి ఏవి ఇవ్వదు హన్సీకి ఇవి ఏవి పట్టవు
నిజమైన స్నేహం గురించి నిస్స్వార్థం. గురించి. మిల్లర్ చెప్పేవి ఇనడం. అతనికి. ఇష్టం.
హన్స్. ఎన్నికలలోను తోటలో పని చేస్తూ ఉంటాడు. అయితే. చలికాలంలో మాత్రం.
మార్కెట్లో అమ్మడానికి. పువ్వులు. కానీ పళ్ళు కానీ. ఉండవు అప్పుడు అతను ఆకలికి చలికి
చాల బాధ పడతాడు. పైగా అప్పుడు మిల్లర్ అతని దగ్గరకి రాడు అంచేత పొంటరిగానే ఉంటాడు
యీ మంచు కుఱిసినంతకాలం. నేను హన్స్ దగ్గరకి. వెళ్లడం. మంచిదికాదు
ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు. వాళ్ళని. ఒంటిరిగా ఉంచడమే మంచిది. అంటదు. మైళ్ళ. భార్యతో
అంతే కాదు స్నేహం. మీద నా అభిప్రాయం. అదే. యి చలికాలం పోగానే నేను అతని దగ్గరకి వెళ్తాను అప్పుడతను. నాకు పెద్ద బుట్ట నిండా పువ్వులు. ఇస్తాడు. అని కూడాఅంటాడు
పైవాళ్ళ గురించి నువ్వు ఎంతో బాగా ఆలోచిస్తావు. నువ్వు స్నేహం గురించి మాట్లాడ్డం వింటే ఎంతో బావుంటుంది. ఆ మతాధికారి. మూడు అంతస్థుల మేడలో ఉంటాడు వెలికి బంగారం ఉంగరం పెట్టుకుంటాడు కానీ ఏవి లాభం నీ అంత బాగా చెప్పలేదు. అంది. అతని భార్య మెచ్చుకుంటూ
పాపం. ఆ హన్స్ అంత బాధలో ఉంటె మనం ఇక్కడికి రమ్మని చెప్పలేవా. అన్నాడు. మిల్లర్. చిన్న
కొడుకు
ఎంత బుద్ధిలేనివాడివి. నిన్ను స్కూల్ కి. పంపడంవల్ల. లాభం. ఏవిటో. నాకు తెలీదు. నువ్వు
ఏవి నేర్చుకున్నట్టు లేదు. హన్స్ ఇక్కడకి వస్తే. అతను మన భోజనం వైన్ వగైరా. చూస్తాడు.
అతనికి అసూయా వస్తుంది. అసూయా చాల చెడ్డది. మనిషి మనస్తత్వం. పడు చేస్తుంది హన్సీని
పాడుచెయ్యడం నేను ఒప్పుకోను. నేను అతనికి మంచి స్నేహితుడిని అతను ఇలాటి ఆకర్షణలికి
లొంగిపోకుండా చూస్తాను పైగా వాడు వస్తే కొంత పిండి అప్పు అడుగుతాడు పిండి వేరు
స్నేహం వేరు. వాటినికలపకూడదు. అన్నాడు మిల్లర్
నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు. అచ్చు చర్చిలో. ఉన్నట్టు అనిపిస్తోంది. అంది భార్య గ్లాస్లో వైన్ పోసుకుంటూ.
చాలా మంది బాగా నటిస్తారు. కానీ కొద్దిమందే బాగా మాట్లాడుతారు. నటించడం. కంటే
మాట్లాడడమే కష్టం. అన్నాడు మిల్లర్ ఎదురుగా కూర్చొని ఏడుస్తున్న కొడుకువేపు చూస్తూ.
కథ అయిపోయిందా. అంది నీటి ఎలక
ఏమాత్రం లేదు ఇప్పుడే ప్రారంభం అవుతుంది. అంది కోయిల
అయితే నువ్వు చాల ఎనకపడి ఉన్నావు. యీ రోజుల్లో ప్రతి మంచి రచయిత. ముగింపుతో
ప్రారంభించి. తరవాత ప్రారంభానికి వచ్చి. మధ్యలో ముగిస్తాడు ఇది కొత్త పద్దతి ఒక విమర్శకుడు
ఒక కుర్రాడితో చెప్తూవుంటే నేను విన్నాను. అతను చెప్పింది రీటేనని న నమ్మకం. ఇంతకీ ని కథ కానీ నాకు. మిల్లరు అంటే చాల ఇష్టం నాకు అన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. అంది నీటిఎలక
కోయిల మల్లి ప్రారంభించింది చలికాలం అయిపోయింది. పువ్వులు పుయ్యడం ప్రారంభించేయి. ఇప్పుడు నేను హన్స్ దగ్గరకి వెళ్తాను. అన్నాడు మిల్లర్
ఎంత జాలిగుండె. నీ ది ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తావు. పువ్వులకి పెద్ద బుట్ట తీసుకువెళ్ళు. అంది భార్య మిల్లర్ బుట్ట పట్టుకొని. వెళ్ళేడు
గూడ్ మోర్కింగ్ హన్స్.
గూడ్ మోర్కింగ్ సర్ యి చెవి దగ్గర నించి అచేవి వరకు నవ్వుతు అన్నాడు హన్స్
యీ చలికాలం అంతా ఎలా ఉన్నావు. అడిగేడు మిల్లర్
మీరు ఆలా అడగడం మీ మంచితనం. నేను చాల కష్టపడ్డాను కానీ ఇప్పుడు ఇంకా వసంతకాలం వచ్చింది పువ్వులన్ని బావున్నాయి
హన్స్. మే ము. తరుచు ని గురించి. మాట్లాడుకున్నాము. నువ్వు ఎలా ఉన్నవో ఏవిటో అని. జాలిగా
అన్నాడు మిల్లర్
అదంతా మీ దయ. నన్ను మరిచిపోయెరేమో అని. భయపడ్డాను
హన్స్. స్నేహం ఎప్పుడు మరిచిపోదు. అదే దాని మహత్యం. నీకు జీవితం అర్థం కాదు. ని పువ్వులు ఎంత బావున్నాయి
అవును నిజంగానే బావున్నాయి. అవి అంత ఎక్కువగా ఉండడం న అదృష్టం నేను వాటిని మార్కెట్కి తీసుకొని వెళ్లి మాస్టరుగారి అమ్మాయికి అమ్ముతాను ఆ డబ్బుతో న వీల్ బర్రో వీల్ బారో తిరిగి కొనుక్కుంటాను. అన్నాడు హన్స్
తిరిగి కొనుక్కుంటావా అంటే దాన్ని అమ్మేసేవా. ఎంత తెలివితక్కువపని.
ఆలా చెయ్యక తప్పలేదు. నాకు యి చలికాలం చాల బాధగా ఉంటుంది. రొట్టె కొనడానికి కూడా డబ్బు లేదు అంచేత మొదట న కోట్ వెండి బొత్తాయిలు అమ్మెసెను. తరవాత వెండి గొలుసు అమ్మేసెను తరవాత నాది పెద్ద పైప్. అమ్మేను ఆఖర్న వీల్ బారో అమ్మేసెను అవన్నీ. ఇప్పుడు మళ్లి కొంటాను అన్నాడు హన్స్
హన్స్. నీకు న వీల్ borrow ఇస్తాను దానికి పెద్ద రిపేర్ లేదు ఒకవైపు పోయింది. చక్రాలు పాడైపోయెయి ఐన సరే దాన్ని నీకు ఇస్తాను. దాన్ని వదులుకోవడం తెలివితక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ నేను అలాటివాడిని కాను. ఉదారత్వం. స్నేహానికి ముఖ్యం. ఇంతకీ నాకు కొత్తది ఉంది. అన్నాడు మిల్లర్
అది నిజంగా మీ ఉదారత. నేను దాన్ని బాగుచేసుకుంటాను. ఇంట్లో ఒక చెక్క ఉంది. అన్నాడు హన్స్ సంతోషంగా
కర్ర చెక్కా. నా పొలంలో. ఇంటి పైకప్పుకి. సరిగ్గా అలాటిదే కావాలి. అక్కడ పెద్ద కన్నం ఉంది. అంచేత జొన్నలు తడిసిపోతాయి. నువ్వు చెప్పడం ఎంత అదృష్టం. ఒక మంచి పని ఎప్పుడు మరో మంచి పానిక్ దారి తీస్తుంది. నేను నీకు వీల్ బారో ఇస్తున్నాను. నువ్వు నాకు ని చెక్క ఇస్తావు. నిజానికి. ని చెక్క కన్నా న వీల్ బారో ఖరీదు ఎక్కువే అనుకో. కానీ నిజమైన స్నేహం. ఇలాటి చిన్న. విషయాలు పట్టించుకోదు. నువ్వు వెంటనే దాన్ని తీసుకొని ర. ఇవాళే పని ప్రారంభిస్తాను
అన్నాడు మిల్లర్
తప్పకుండా. అని హన్స్ తన షెడ్ లోకి పరిగెత్తి వెళ్లి. ఆ చెక్క తెచ్చాడు
మిల్లర్ దానివైపు ఎగా దిగా చూసి. ఇదేమంత పెద్దది కాదు న ఇంటి పైకప్పుకి వెయ్యగా నీవు ఏవి మిగలదు. న తప్పు కాదనుకో. నేను నీకు నా వీల్ బారో ఇచ్చెను కాబట్టి. దానికి బదులు. నువ్వు
నాకు కొన్ని పువ్వులు ఇస్తావనుకుంటాను ఇదిగో బుట్ట దాన్ని పూర్తిగా నింపు అన్నాడు మిల్లర్
పూర్తిగానా అన్నాడు హన్స్ విచారంగా. బుట్ట చాలా పెద్దది దాన్నీ నింపితే. ఇంకా తనకి ఏవి మిగలవు అతనికి తన వెండి బొత్తాయిలు తెచ్చుకోవాలని ఆశ గా. ఉంది
ఔను ఏను నీకు న వీల్ బారో ఇచ్చినప్పుడు. కొంచెం పువ్వులు అడగడం పెద్ద తప్పు కాదు
ఇలాటి స్వార్ధానికి. స్నేహం దూరంగా ఉంటుందని. నేను అనుకోవడం తప్పేమో. అన్నాడు మిల్లర్
నాకు నా వెండి బొత్తాయిలు కంటే. మీ మంచి అభిప్రాయం కావాలి. నా తోటలో ఉన్న పువ్వులన్ని.
మీవే. అని హన్సి పువ్వులు అన్ని కోసి. బుట్ట నింపేడు
గుడ్ బై హన్స్ అని కర్ర చెక్క భుజం మీద పెట్టుకొని. చేతిలో బుట్ట తో. వెళిపోయేడు మిల్లర్
మర్నాడు అతను తోటలో పని చేస్తున్నప్పుడు. రోడ్డుమీద నుండి మిల్లర్ గొంతుక తనని
పిలుస్తూ వినిపించింది వెంటనే గోడ మీద నించి చూసేడు
వీ పు మీద పెద్ద పిండి సంచితో మిల్లర్ కనిపించేడు
హన్స్. యీ సంచిని మార్కెట్ వరకు తీసుకురాగలవా అన్నాడు మిల్లర్
సారీ సర్. యీవేళ నాకు చాల పని ఉంది యీ తీగలన్నిటిని పైకి ఎక్కించాలి. మొక్కలకి నీళ్లు పెట్టాలి. అన్నాడు హన్స్
ఔనా నేను నీకు వీల్ బోరౌ ఇస్తున్నప్పుడు. నువ్వు రాలేనని అనడం స్నేహం కాదేమో
అన్నాడు మిల్లర్.
ఆలా అనకండి నేను అలాటివాడిని కాను. అని లోపలి వెళ్లి టోపీ తీసుకొని. భుజం మీద మూట తో బైల్దేరేడు
అవెళ చాల వేడిగా ఉంది రోడ్డు నిండా విపరీతమైన దుమ్ము. వాళ్ళు. ఆరొ మైల్ దగ్గరకి చేరేసరికి హన్స్ అలిసిపోయి కొంత సేపు కూర్చున్నాడు మళ్ళీ ధైర్యంగా వెళ్ళేడు మిల్లర్ ఆపిండిని మంచి ధరకే అమ్మేడు మరీ ఆలస్యం అయితే తోవలో దొంగల భయం ఉంటుందని వెంటనే తిరిగి వెళిపోయేడు
ఇవాళ నిజంగా చాల కష్టంగా ఉంది. అయితేనేం మిల్లరికి సాయం చేసెను. అతను చాల మంచి స్నేహితుడు. పైగా నాకు అతని వీల్ బారో ఇస్తున్నాడు అనుకున్నాడు హన్స్ పడుకునేముందు
మర్నాడు పొద్దున్నే మిల్లర్ మల్లి వచ్చేడు. ముందు రోజు బాగా అలిసిపోయేడు అంచేత హన్స్ ఇంకా నిద్ర పోతున్నాడు
నువ్వు పరమ బద్ధ కస్తుడివి. నీకు నా వీల్ బారో ఇస్తున్నప్పుడు. నువ్వు ఇంకా కష్టపడి పని చేస్తావనుకున్నాను బద్దకం మహా పాపం. నా స్నేహితులెవరు బధకంగా ఉండడం నాకు ఇష్టం లేదు
నేను ఇలా అంటున్నందుకు. నువ్వు ఏవి అనుకోకూడదు నువ్వు నాస్నేహితుడివి. కాకపోతే. ఇలా అనేవాడిని కాను. తాను అనుకున్నది. సరిగ్గా చెప్పకపోతే స్నేహానికి విలువ ఏవిటి. తియ్యటి కబుర్లు ఎవరైనా చెప్తారు. కానీ నిజమైన స్నేహితుడు. విమర్శిస్తాడు. ఎందుకంటె తాను మంచి పని చేస్తున్నానని. తనకి తెలుసు. అన్నాడు మిల్లర్
సారీ సర్ నేను బాగా అలిసిపోయను అంచేత అలా పదుకోన్ పిట్టల అరుపులు విందామనుకున్నాను. పిట్టల పాటలు వింటే నేను బాగా పని చెయ్యగలను. అన్నాడు హన్స్ కళ్ళు నులుముకుంటూ
చాలా సంతోషం. నువ్వు వీలైనంత వేగం రెడీ అయ్యి. మిల్లుకు. వచ్చి. ఆఇంటి పైకప్పు బాగుచెయ్యాలి. అన్నాడు మిల్లర్ హన్స్ వీపుమీద తట్టి
పాపం హన్సీకి. తోటలో పని చెయ్యాలని ఆతృతగా ఉంది రెండు రోజులనుండి మొక్కలకి నీళ్లు పొయ్యలేదు. ఒకవైపు స్నేహితుడిని కాదనలేడు నేను బిజీగా ఉన్నానని చెప్తే సరిగ్గా అర్థం చేసుకుంటాడా. అన్నాడు హన్స్ నెమ్మదిగా
నేను నీకు వీల్ బోరఁరౌట్ ఇస్తున్నందుకు. ఇలా అడగడం తప్పు కాదనుకుంటాను. ఐన నువ్వు
కాదంటే నేనే చేసుకుంటాను. అన్నాడు మిల్లర్ నిష్టురంగా
ఒద్దు ఒద్దు అని హన్స్. లేచి గబగబా తయారై మిల్లర్తో వెళ్ళేడు
అక్కడ రోజంతా పని చేస్తూనే ఉన్నాడు చీకటి పడ్డాక మిల్లర్ వచ్చి. ఇంకా పూర్తి అవలేదా అని
అడిగేడు
అయిపోయింది అన్నాడు హన్స్ నిచ్చెన దిగుతూ
ఓహ్ ఇతరులకి చేసే పనికన్నా. సంతోషం ఏవి లేదు అన్నాడు మిల్లర్
మీరలా మాట్లాడ్డం నాకెంతో బావుంటుంది. కానీ మీకున్న మంచిఅభిప్రాయాలు నాకు రావు
అన్నాడు హన్స్ నుదురు తుడుచుకుంటూ
నీకూ వస్తాయి కానీ నువ్వు ఇంకా కష్టపడాలి ఇప్పుడు నీకు స్నేహం ఒక్కటే తెలుసు. ఎప్పుడో అప్పుడు నీకు తెలుస్తుంది. అన్నాడు మిల్లర్
నిజంగా నాకు వస్తాయా. హన్స్ అడిగేడు
నాకేవి సందేహం లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి. వెళ్లి విశ్రాంతి తీసుకో. రేపు నువ్వు నా గొర్రెల్ని కొండ. దగ్గరకి తీ సుకువెళ్లాలి.
పాపం హన్సీకి ఏవి చెప్పాలో తోచలేదు. మర్నాడు పొద్దున్నే మిల్లర్ తన గొర్రెల్ని తీ సుకువచ్చేడు
హన్స్ వాటిని కొండ కి తీసుంకెళ్ళేడు. వెనక్కి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. అలిసిపోయి కుర్చీలోనే నిద్ర పోయేడు మర్నాడు లేచేసరికి బాగా పొద్దెక్కింది
వెంటనే తోట లోకి బైల్దేరేడు. కానీ ఏవి చెయ్య లేకపోతున్నాడు ప్రతి రోజు మిల్లర్ వచ్చి. ఏ దో పని
చెప్తున్నాడు అప్పుడప్పుడు హన్సీకి విపరీతమైన బాధ వేస్తుంది. కానీ తనకి. తనే నచ్చచెప్పుకుంటున్నాడు మిల్లర్ తనకి స్నేహితుడు. నాకు వీల్ బారో ఇస్తున్నాడు. అని
సర్ది చెప్పుకున్నాడు ఆలా మిల్లర్ రోజు ఏదో ఒకటి చెప్తుం ఉన్నాడు స్నేహం మిద రకరకాల లెక్చర్లు ఇస్తూనే ఉన్నాడు
ఓరోజు సాయంత్రం హన్స్ తన గదిలో ఉండగా. తలుపు గట్టిగా చప్పుడు ఐంది అప్పుడు
విపరీతంగా గాలి వీస్తోంది. భయంకరమైన శబ్దంతో వీస్తోంది. బహూశా తుపాను శబ్దమేమో అనుకున్నాడు. మళ్ళీ మరీ గట్టిగా వినిపించింది
ఎవరో పాపం ప్రయాణికుడు అంటూ తలుపు తీసేడు
ఎదురుగ ఒక చేతిలో లాంతరు మరో చేతిలో కర్ర తో. మిల్లర్ నిల్చున్నాడు
హన్స్ నేను పెద్ద కష్టంలో ఉన్నాను. నా కొడుకు నిచ్చెన మీద నించి పది దెబ్బలు తగిలాయి. నేను
డాక్టర్ దగ్గరకి వెళ్తున్నాను. కానీ అతను చాల దూరంగా ఉంటాడు. పైగా యి రాత్రి బావులేదు
అంచేత నాకు బదులు నువ్వు. వెళ్తే మంచిదేమో అనిపించింది. నేను వీల్ బారో ఇస్తున్నానుకదా అంచేత బదులుగా నువ్వు నాకు ఏదో ఒకటి చెయ్యాలి. అన్నాడు మిల్లర్
తప్పకుండ మీరు నాదగ్గరికి రావడమే గొప్ప. నేను వెంటనే బైల్దేరుతాను. కై ఇప్పుడు చాల చీకటి గా
ఉంది. నేను ఏగోతిలోనో పడిపోతాను. అంచేత మీరు లాంతరు ఇవండీ. అన్నాడు హన్స్
సారీ ఇది కొత్త లాంతరు. దానికేవైనా ఐతే నాకు చాలా నష్టం. అన్నాడు మిల్లర్
మరేమి పరవాలేదు అది లేకపోయినా వెళ్తాను. అని హన్స్ కోటు టోపీ తీసుకోని బైల్దేరేడు
భయంకరమైన తుపాను. హన్సీకి చీకట్లో. ఏవి కనిపించడం లేదు ఐన మూడు గంటలు నడిచి
డాక్టర్ ఇల్లు చేరి తలుపు తట్టెడు
ఎవరు. డాక్టర్ కిటికిలొనించి అడిగేడు
నేను హన్స్
ఏవి కావాలి
మిల్లర్. కొడుకు నిచ్చెన మీద నించి పది దెబ్బలు తగిలేయి మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు
సరే అని డాక్టర్ లాంతరు తీసుకోని గుర్రం మీద బైల్దేరేడు. హన్స్ అతని వెనక పరిగెత్తేడు
కానీ తుపాను ఎక్కువై పోయి. వర్షం కుండ పోతగా పడుతోంది. హన్సీకి తాను ఎటు వెళ్తున్నాడో తెలీలేదు. దారి తప్పిపోయేడు ఇటు అటు తిరుగుతూ ఒక గోతిలో పడిపోయేడు. మర్నాడు కొందరు గొల్లవాళ్ళు. అతని శవం నీటిలో తేలడం చూసి. అతని ఇంటికి తీసుకువెళ్లేరు
అంత్య క్రియలకి అందరు వెళ్ళేరు అందులో ముఖ్యుడు మిల్లర్.
నేను అతనికి మంచి స్నేహితుడిని. నేను ముందు ఉండడం అవసరం అని మిల్లర్ ఊరేగింపులో ముందు నడిచేడు. అప్పుడప్పుడు రుమాలుతో కళ్ళు తుడుచుకుంటూ
అంత్య క్రియలు పూర్తీ అయ్యేక. అందరు హోటల్లో వైన్ తాగుతూ కేక్ తింటున్నప్పుడు. హన్స్ లేకపోవడం మన అందరికి పెద్ద నష్టం అన్నాడు. కంసాలి
నాకు మాత్రం పెద్ద లోటు నేను న వీల్ borrow అతనికి ఇద్దామనుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏవి చెయ్యాలో తెలీదు పోనీ అమ్మేదామంటే అది బాగుచెయ్యలేనంతగా చెడిపోయింది. ఇటు పైన
నేను ఎవరికి ఏవి ఇవ్వను అన్నాడు మిల్లర్
అదే ముగింపు. అంది కోయిల
మిల్లర్ ఎవయ్యేడు. అంది నీటి ఎలక
నాకు తెలీదు నాకు అనవసరం. అంది కోయిల
ఐతే నీకు దయ లేదన్నమాట. అంది ఎలక
నీకు ఆ కథలో నీతి అర్థమైనట్టు లేదు అంది కోయిల
ఏవిటీ అంది ఎలక.
నీతి.
ఆకథలో నీతి ఉందని ని ఉద్దేశమా
తప్పకుండా
ఆమాట ముందే చెపితే నేను వినేదాన్నికాదు. అని గట్టిగ అరిచి తన కన్నా లోకి వెళ్లిపోయింది ఎలక
ఏను నీతి ఉన్న కథ చెప్పి దాన్ని చాల బాధ పెట్టెను అంది కోయిల
అవును అంది బాతు
నిజవే అని కోయిల ఎగిరిపోయింది