దీపావళి ప్రత్యేక కథలు – 2024 – కథలకు ఆహ్వానం

ప్రత్యేక సందర్భాలు సాహిత్యాన్ని ఉత్సాహ పరుస్తాయి. ప్రత్యేక సంకలనాలు ఎంచిన సాహిత్యాన్ని నిక్షిప్తం చేస్తాయి. తెలుగులోనే కాదు మన దేశంలోని చాలాచోట్ల 1970ల నుంచి దీపావళి ప్రత్యేక సంచికల వెలువరింత ఉంది. తెలుగులో గతంలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, యువ, రచన, జాగృతి తదితర పత్రికలు దీపావళి ప్రత్యేక సంచికలు తెచ్చేవి. నేడు దాదాపు లేవు. కాని తమిళనాడు, మహరాష్ట్రలలో పెద్ద స్థాయిలో నేటికీ వెలువడుతున్నాయి. మరాఠిలో మే నెల నుంచి వీటి పని మొదలవుతుంది. అక్కడ దాదాపు 300 ప్రత్యేక సంచికలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఆనవాయితీని ఏదో ఒక మేరకు కొనసాగించాలని ఈ ప్రయత్నం. రెండేళ్ల క్రితం ‘దీపావళి స్పెషల్‌’గా వెలువరించిన ‘తెలుగు పెద్ద కథలు’ సంకలనం విశేష ఆదరణ పొందింది. ఈసారి పెద్ద కథలు, చిన్న కథలు కూడా పరిగణనకు తీసుకోవాలని నిర్ణయం. ఈ సంకలనానికి యువ కథకుల నుంచి సుప్రసిద్ధ కథకుల వరకూ అందరూ కథలు పంపాలని విన్నపం.

నమస్కారాలతో
మహమ్మద్‌ ఖదీర్‌బాబు

మహమ్మద్‌ ఖదీర్‌బాబు

One thought on “దీపావళి ప్రత్యేక కథలు – 2024 – కథలకు ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *