అశ్వత్థామ ఆత్మకు టెర్మినేటర్‍తో ప్రాణం పోస్తే…!

తన మొదటి సినిమా నుండే నాగ్ అశ్విన్ విభిన్నంగా ఉండాలనుకున్నాడు. తన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కథ సాధారణ తెలుగు సినిమా కథలకు భిన్నమైనది,ఒకవేళ అటువంటివి వచ్చినా ఆ స్థాయిలో మాత్రం రాకపోవచ్చు.దీని షూటింగ్ కూడా ఆ స్థాయికి తగ్గట్టు ఎవరెస్ట్ మీద చేశాడు. తన జీవితం గురించి ప్రశ్నించుకుంటూ సాగే ఒక మెటీరియలిస్ట్ కథ ఇది. ఇక నాగ్ రెండో సినిమా, ఒక రకంగా చూస్తే, అద్భుతమైన సినిమా. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి,ఐదు నిమిషాల క్రితం ఏమి జరిగిందో కూడా గుర్తుంచుకోలేని ఈ కాలంలో అతను ‘మహానటి’ సినిమాతో మనల్ని కొన్ని దశాబ్దాల వెనుక జీవించిన సావిత్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు. తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’ కథల సిరీస్ లో ‘ఎక్స్ లైఫ్’అనే కథతో మానవ సంబంధాలపై వర్చువల్ రియాలిటీ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాడు. ఇక పోతే ఈ రచయిత-దర్శకుడి అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన కల్కి 2898 ఏ.డి.లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లోని తాత్విక ధ్వని,’మహానటి’లోని గతాన్ని మరలా సృష్టించే స్వరం,’ఎక్స్ లైఫ్’ లో భవిష్యత్తును ఊహించే అద్భుతం ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నాగ్ అశ్విన్ తన కెరీర్ ఆరంభించినప్పుడే ఈ సినిమా మీద కూడా పని చేయడం కూడా మొదలు పెట్టాడని అనుకోవచ్చు.


నాగ్ చూసిన,చదివినా లేదా తన అమ్మమ్మ-నానమ్మల నుండి విన్న అమరచిత్రకథ నుండి స్టార్ వార్ సినిమాలు,హాలీవుడ్ లోని ఇంకా అనేక సైన్స్ ఫిక్షన్, డిస్టోపియన్ సినిమాల అన్నింటి నుండి పుట్టిన ఒక పిచ్చి కాంబినేషన్ సినిమానే ‘కల్కి’ కావచ్చు. ఉదాహరణకు,మహాభారతంలోని అశ్వత్థామ ఆత్మకు టెర్మినేటర్ తో ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది? చావు లేని ఆ యోధుడు ఒక యంత్రంలా యుద్ధం చేస్తూనే ఉంటే ఎలా ఉంటుంది?కల్కి సినిమాలో గొప్ప ఆకర్షణ ఇదే, ఇతిహాసాన్ని నేటి యాక్షన్ సినిమాతో కలపడం. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమా మొత్తం ఆయనే ఆక్రమించినట్టు ఉంటుంది, ఎందుకంటే ఈ కల్కి మొదటి భాగం సినిమాలో కాస్త లోతుగా చిత్రీకరణ చేసిన పాత్ర ఇది ఒక్కటే కాబట్టి. కొంత దుఃఖం,మిగిలిపోయిన బాధ్యత, విధి కోసం ఉండిపోవడం;ఈ పాత్ర ఆత్మను నిలబెట్టిన అంశాలు. ఆయన స్క్రీన్ మీద ఉన్న ప్రతి సెకండ్ కూడా అద్భుతమైన భావనను కలిగిస్తుంది.


ఇక కల్కి లో మిగిలిందంతా కలగాపులగమే.పురాణాల్లోని ఒక ఊహతో ఆధునికతను జోడించడం గొప్ప విషయమే,అలాగే సినిమా ముగింపు కూడా సంతృప్తికరంగా ఉంది. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం సాంకేతిక విభాగాల స్థాయికి తగ్గట్టు లేదు. అశ్వత్థామ పాత్ర కోసం ఉన్న కాస్టుమ్ డిజైన్,అలాగే కమల్ హాసన్ పాత్ర కోసం ప్రొడక్షన్ డిజైన్,విజువల్ ఎఫెక్ట్స్,సినిమాటోగ్రాఫి (ముఖ్యంగా కృష్ణుడి పాత్రను నీడగా చూపించడం),సినిమా నేపథ్యానికి తగ్గట్టు లేని సంతోష్ నారాయణ్ స్కోర్(ముఖ్యంగా ఒక యాక్షన్ సన్నివేశంలో నీటి బిందువుల చప్పుడు ఉపయోగించడం)-ఇవన్నీ ఒక పెద్ద లక్ష్యంతో,అది కూడా నాగ్ మెదడులో ఉన్న విజన్ తో నిర్మించబడినవే కానీ స్క్రీన్ మీద కనిపించేవి కాదు. ఈ సినిమాలో ఒక్క అశ్వత్థామ పాత్ర తప్ప ఏది కూడా మనల్ని కథ గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం ఇవ్వదు. ఈ సినిమాలో దీపికా పదుకుణేది ముఖ్యమైన తల్లి పాత్ర-కానీ సుమతి గా ఆమె పాత్ర ఎంత పేలవంగా ఉందంటే ఆమె చావు, బతుకు అసలు ప్రేక్షకుల్ని కదిలించలేవు.


నేనేమి ఒక గొప్ప నేపథ్య కథ కావాలని చెప్పడం లేదు. ఉదాహరణకు మాడ్ మాక్స్:ఫ్యూరీ రోడ్ సినిమాలోని చార్లెజ్ తెరోన్ పాత్ర తీసుకోండి. చాలా సేపటి వరకు ఆమె కేవలం ఒక యాక్షన్ హీరోయిన్ మాత్రమే,కానీ స్క్రీన్ ప్లే లో కొద్ది నిమిషాలు మాత్రమే,ఆమె ఎక్కడి నుండి వచ్చింది,ఆమె కిడ్నాప్ కు గురైన సత్యం;ఇవన్నీ కూడా ఆమె గర్భంతో ఉన్న స్త్రీలకు ఎందుకు సాయం చేస్తుందో మనకు చెబుతాయి. కల్కి లో వచ్చే భవిష్యత్తు భాగాల్లో సుమతి పాత్రకు అంత ప్రాధాన్యత ఉండొచ్చని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఒక్క సినిమా మాత్రమే ఉన్న ఈ సందర్భంలో,రేఖా మాత్ర రూపంతో మాత్రమే ఉన్న ఈ సినిమాకు అసలైన జీవం,ప్రాణం తర్వాత వచ్చే భాగాల్లో వస్తుందని ఆశిద్దాము.కానీ ఆ రేఖలతో ఈ సినిమాలో పాత్రల గురించి ఇప్పుడు పట్టించుకోవడం కూడా కష్టమే. ఈ సినిమాలో ఒక బౌంటీ హంటర్ అయిన ప్రభాస్ పాత్ర కేవలం డబ్బుల గురించి మాత్రమే పట్టించుకునే పాత్ర. ఈ సాధారణ పాత్ర (భైరవ)ఎంత లాగబడింది అంటే ,అతను నిజంగా ఏమైనా చేస్తే బావుంటుందని ఎదురు చూసి చూసి విసుగు పుట్టేంత. అసలు సరైన పాత్ర చిత్రణ లేకుండా,నటుల నుండి గొప్ప నటన ఆశించలేము.


మంచి-చెడుకి మధ్య జరిగే యుద్ధంగా వచ్చిన ఈ సినిమాలో రెండే ప్రపంచాలు ప్రధానంగా ఉన్నాయి. చెడ్డ పాలకులు ఉన్న కాశీ ప్రాంతం ఒకటి, రెబెల్స్ ప్రాంతమైన శంభాల రెండోది. భవిష్యత్తుకి ఎంతో ముఖ్యమైన సుమతి కాశీ నుండి తప్పించుకోగలుగుతుందా? కల్కి కథ ఈ అంశం మీదే నిర్మించబడింది. ఈ సినిమాలో ఇంకో ముఖ్య పాత్రగా శోభన నటించారు.ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోవడం వల్ల ఏమి ప్రత్యేకంగా అనిపించని పాత్ర ఇది. కామియో పాత్రలు ఎన్నో ఉన్నా,కేవలం స్టార్స్ ను చూస్తున్న భావనే తప్ప సినిమాలో వాటికేమి ప్రాధాన్యత లేదు. కమల్ హాసన్ ను విలన్ గా చూడటం బావున్నప్పటికి, స్క్రీన్ టైమ్ ఈ పాత్రకు చాలా తక్కువ ఉండటం వల్ల ఆ విలన్ కలిగించే భావాలు ఏవి కూడా చివర్లో తప్ప ఎక్కడా బలంగా లేవు. ఇదంతా రెండో భాగానికి ముందిచ్చే బిల్డప్ లా ఉంది,అంతే. ఇందులో ఒక చిన్నపిల్లను అబ్బాయిగా భావిస్తారు,అసలు ఈ పాత్ర ప్రాముఖ్యత కథలో ఏమిటో తెలుసుకోవడానికి రెండో భాగం కోసం చూడాల్సిందే. ఎంతో పబ్లిసిటితో అంచనాలు పెంచిన బుజ్జి పాత్ర కూడా పేలవంగానే మారిపోయింది. ఈ పాత్ర R2-D2 (స్టార్ వార్స్ లో ఒక పాత్ర)అయ్యి ఉండాల్సింది.కొంత ఆసక్తికరంగా ఉండటానికి పెట్టిన మామూలు పాత్రే ఇది కూడా.
ఫస్ట్ హాఫ్ అంతా మందకొడిగా సాగుతుంది,ఎంత ప్రయత్నించినా కొత్తగా లేనట్టు ఉండే ఆ ప్రపంచం ఏమి చూడనివ్వదు కూడా. అసలు కథలో ఉద్రిక్తత కానీ,తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కానీ, కొత్తగా కానీ ఏమి ఉండదు. అన్నీ పాత్రలు విడిగా ఉన్నట్టు,ఏ సంబంధం లేనట్టు ఉంటాయి. ఇది కమర్షియల్ సూత్రం కావొచ్చు కానీ స్క్రీన్ ప్లే లో ఇతిహాసం కూడా కలిసి ఉండటం వల్ల, ఈ కామెడీ,డ్రామా కాంబినేషన్ వర్కవుట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ వేగం అందుకోవడానికి కారణం యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటం వల్లే. చివరకు ఈ సినిమా ఒక వీడియో గేమ్ కలిగించే ఎక్సైట్మెంట్ తో ముగుస్తుంది. భైరవ, అశ్వత్థామ మధ్య జరిగే యుద్ధం మాత్రం ఈ సినిమా ఆత్మను గొప్పగా చూపించగలిగింది.సాంకేతిక ప్రగతిని వినియోగించుకుని భైరవ యుద్ధం చేస్తే,కేవలం శారీరక శక్తితో ఆటవికంగా చేసే పాత్ర అశ్వత్థామది. కల్కి గొప్ప సాంకేతిక విజయం సాధించినా, భావోద్వేగ పరంగా కూడా విజయం సాధిస్తే బావుండేది.

నటీనటులు: ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్, దీపికా పదుకునె, దిషా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన
ప్రొడక్షన్: వైజయంతి మూవీస్
డైరెక్టర్: నాగ్ అశ్విన్
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణ్

One thought on “అశ్వత్థామ ఆత్మకు టెర్మినేటర్‍తో ప్రాణం పోస్తే…!

  1. మీ రివ్యూ చాలా పర్ఫెక్ట్ గా ఉంది సార్. నేను మిత్రులతో అదే అన్నాను. టెర్మినేటర్ సినిమాలో లాగా మంచిచెడు అనే రెండు అంశాలు ద్వారా ఒక వ్యక్తిని కాపాడటం అనే కాన్సెప్ట్. మీరు సరిగ్గా అదే రాశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *