వేప పువ్వు మెదిలే మా ఇంటి బావిలో ఏడాదికోసారి కనువిందుగా సాగే పూడిక తీసే వేడుక
నీటిలోతుల్లో నాన్న మునకలు వేసే కొద్దీ అద్భుతాలు వెలికివస్తాయి. కొబ్బరి చెక్క, గోళి, గరిటే చెదపట్టిన చెక్క చట్రాలతో సహా తుప్పుపట్టిన గిలక పొరబాటున పనిమనిషి దొంగలించిందనుకుని అనుమానించిన వెండిగ్లాసు ఇలా బురదలో చెయ్యిపెట్టి గెలికి ఇంకా మరెన్నిటినో వెలికి తీశాము.
ఒకే బురదరా బురదరా చూసుకో అని అమ్మ భయంతో అదిలించినప్పటికీ సంతోషాన్ని చెరిపేయడం ఎవరికి మాత్రం ఇష్టం గనుక
శత్రువుని జయించిన వీరుడిలా ముంగురుల నుండి కారుతున్న నీటితో నాన్న పైకి లేచి వస్తాడు
మూల రచయిత : నా.ముత్తుకుమార్ భాష : తమిళం మూలం : 'సీతాకోకచిలుకలు అమ్మేవాడు’ అనే కవితాసంకలనం అనువాదం : శ్రీనివాస్ తెప్పల
నా. ముత్తుకుమార్
జూలై 12, 1975 లో నా.ముత్తుకుమార్ కాంచీపురంలో జన్మించారు. ఆయన తమిళులకు ఒక గీత రచయితగా మాత్రమే పరిచయం. సినిమాల్లో దర్శకుడు అవుదాం అని వచ్చిన ఆయన స్వతహాగా మంచి కవి. సినిమాల్లో గీతరచయితగా తన ప్రస్థానాన్ని 20 ఏళ్ళు కొనసాగించారు. దాదాపు 350 చిత్రాలకు పాటలు అందించిన ఆయన ఇంతవరకు 6 కవితా సంకలనాలు, కొన్ని వ్యాససంపుటాలు రచించారు. తన 41 ఏట పచ్చకామెర్ల వ్యాధితో ఆయన మరణించారు.
శ్రీనివాస్ తెప్పల
శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.
Spread the love నీ పేరు ప్రతి పూరేకు మీద నా వేళ్ళతో నీ పేరు రాస్తాను పువ్వు వాడిపోతుంది కానీ నీ పేరు పరిమళమై చుట్టూరా వ్యాపిస్తుంది *****దారి మలుపు తిరిగిన చోట ఒక దారి మలుపు తిరుగుతుంది ఒక వంకర సందు లోకి – దాని ఎడమ వైపున ఒక పెరిగిన రావి చెట్టు దాని ఎదురుగా ఒక మామూలు గుడిసె- రాత్రయినా పగలయినా ఆ ఇంటి కిటికీ […]
Spread the love నీ అలలారే జుత్తుని చూసిప్రేమతో ముచ్చటపడిఅతనో ప్రతిన పూనాడు.’ప్రియా..నువ్వు రజస్వల కాగానేనా ఇంటికి వెలుగవుతావు ‘.అక్కడ ఒక వేటగాడు మూలాలను తవ్విఒక విలువైన రత్నాన్ని కనుగొనేకొండల నుండి అతను వచ్చాడు.నాకు తెలీదు, మిత్రమాఇప్పుడు అతనెక్కడున్నాడో..-( స్నేహితురాలు ఆమెతో అన్న మాటలు..ఆమె తలిదండ్రులు చాటుగా వింటున్నారు ) — అనాన్ ( కురుంతొగై 379 ) 40 Spread the love
Spread the love 1..2..3.. చిధ్రమయిన నీ కొడుకు అవయవాలు శుభ్రం చేసుకో. చెదిరి తునకలైన నీ మొగుడి తల భాగాలు తెచ్చుకో. తొందరగా రా.. నీకు అరగంట సమయం వుంది. 3..2..1.. సమయం అయిపోయింది. పరిగెట్టు..పరిగెట్టు.. బాధపడటానికి సమయం లేదు. మేము బాంబులు వేసేస్తాం! పరిగెట్టు.. మేం మీకు అరగంట విరామం ఇచ్చాం! మేం మానవతావాదులం!! Spread the love