తన నాటకాల ప్రదర్శన గురించి టాల్ స్టాయ్

Spread the love

కళ అన్నది ఒక అంశం, దీనిగురించి టాల్ స్టాయ్ చెప్పినది చాలావుంది. ఉదాహరణకు “షేక్ స్పియర్ నాటకం”, “కళ అంటే ఏమిటి?” అన్న తన రచనలలో టాల్ స్టాయ్ కళఅంటే  ఏమిటో వివరించారు.

            కళ గురించి ఆయన వ్రాసిన రచనలలోగాని, లేక కళ గురించి వ్రాసిన ఇతర వ్యాసాలలోగాని టాల్ స్టాయ్ ఎక్కడా నాటక రంగం గురించి ఉదహరించలేదు.

            60 ఏళ్ల కాలంలో, 5 నాటకాలు, ఒక డ్రెస్  రిహార్సల్ కన్న ఎక్కువ ఆయనేమీ చూడలేదు. రంగస్థలం మీద ఆయన ఎర్మొలో  వాను ఎప్పుడూ చూడలేదు. అందుచేతనే టాల్ స్టాయ్ రచనల్లో ఎర్మొలోవా గురించి ఉదహరించినట్టు మనకు ఎక్కడా కని పించదు. నాటకాలకు టాల్ స్టాయ్ హాజరు కావడం చాలా అరుదు కాబట్టి, ఆయన చూసిన నాటకాలు గురించి క్లుప్తంగా చెప్పడం భావ్యం. దురదృ ష్టవశాత్తూ, తాను హాజరయిన నాట కాల గురించి టాల్ స్టాయ్ తన డైరీలలో అతి క్లుప్తంగా మాత్రమే ఉదహరించారు.

            ఉదాహరణకు 1859 జనవరి 26వ  తేదీన గొగోల్ వ్రాసిన “ఇన్ స్పెక్టర్ – జనరల్ ” నాటకాన్ని ఆయన చూశారు. దీనిని మాలే థియేటర్ నిర్మించింది. దీనిని గురించి ఆయన తన డైరీలో వ్రాసుకున్నది రెండే రెండు ముక్కలు: “ఇన్ స్పెక్టర్-జనరల్”, ష్టెప్కిన్ గొప్పనటుడు”.

            ఆయన తిలకించిన మరో నాటకం గురించి, ఆయన డైరీల్లో మరో 34  సంవత్సరాల తరువాతగాని కనపడదు. ఆయన చూసిన నాటకం గురించి మరింత క్లుప్తంగా  ఇలా వ్రాశారు: “ఫ్రూట్స్ ఆఫ్ ఎన్ లైటెన్ మెంట్” అనే నాటకం చూసాను. ఇది టాల్ స్టాయ్ వ్రాసిన సుఖాంత నాటకం. 1882 జనవరి 7వ తేదీన టాల్ స్టాయ్  మాలే థియేటర్లో ఈ నాటకం చూశారు. పత్రికల్లోగాని, లేఖల్లోగాని, ఇంక ఎక్కడైనా గాని టాల్ స్టాయ్  దర్శించిన ఈ నాటకం గురించిన వివరాలు లభ్యమవుతాయా? వీటి గురించి వెతగ్గా వెతగ్గా కొంత సమాచారం దొరికింది.

                        ఆ రోజుల్లో… వెలుపడే నొవో స్తిద్నాయా అనే దినపత్రిక 1892 జనవరి 13వ తేదీ సంచికలో దీని గురించి ఒక  వ్యాసం ప్రచురితమైంది. ప్రముఖ విమర్శకుడు వ్లాన్ దొరా షేవ్ ఛ్ ఈ వ్యాసం వ్రాశారు.

            టాల్ స్టాయ్ నాటాకానికి వచ్చిన తీరును ఆయన యిలా వర్ణించారు:

            ‘ఒక ముతకకోటు, గొర్రెతోలు టోపీ, ఫెల్ట్ బూట్లతో సామాన్య రైతులా కనిపిస్తున్న ఒక వ్యక్తి, ఒక  యువకుడిని వెంట వెట్టుకుని మాలే థియేటర్ బుకింగ్ ఆఫీసువద్దకు నడిచి వచ్చాడు.

            ‘టిక్కెట్లు అన్ని అమ్ముడయి పోయాయి’ అన్న బోర్డుచూసి ఆ వ్యక్తి  స్టేజీ  వెనక్కు వెళ్లాడు.

            అక్కడవున్న కాపలాదారుడ్ని వుద్దేశించి “మిత్రమా! మేదమ్ ఫెదాతో వాను కల్సుకోవాలి” అన్నాడు.

            ” ఫెదాతో వానా?” అని ఆశ్చర్యంతో ఆ కాపలాదారుడు సామాన్య దుస్తుల్లో వున్న టాల్ స్టాయ్ కేసి ఎగాదిగా చూసి ఇలా అన్నాడు:

            “మీరు ఇప్పుడు ఆవిడను కల్సుకో లేరు. ఒక కౌంట్ (సంస్థానాధీశుడు) రచించిన “ది ఫ్రూట్స్ ఆఫ్ ఎన్ లైటెన్ మెంట్” అన్న నాటకం యీ రోజు రాత్రి ప్రదర్శింపబడుతోంది, ఆ నాటకం హడావుడిలో ఆవిడ మునిగితేల్తూ వుంది.”

            “ఫరవాలేదు, ఆనాటకం రచయిత మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అని వెళ్ళి, ఆవిడకు చెప్పిరా” అని సమాధానం ఇచ్చాడు.

            “ఆ… రచయితా!” అని నోరు వెళ్ల బెట్టాడు కాపలాదారుడు. ఆశ్చర్యంతో టాల్ స్టాయ్ ని ఆపాదమస్తకం పరిశీలించి, ఏదో స్ఫురించిన వాడిలా స్టేజ్  మేనేజర్ దగ్గరకు పరుగెత్తాడు.

            “నాటక రచయిత మేడమ్ ఫేదా తోవాను చూడాలంటున్నారు.”

            స్టేజ్ మేనేజర్ జి.చేర్నెవ్ స్కీ  ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

            ” నాటక రచయితా? ? ఏదీ, ఫ్రూట్స్ ఆఫ్ ఎన్ లై టెన్ మెంట్’ నాటక రచ యితే? నిజమేనా? నువ్వు సరిగ్గా చూసావా? ఆయన ఎలావున్నారు? అని కాపలాదారుడి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు.

            “ఆ వ్యక్తిని చూస్తే  ఎవరైనా ఆయన కౌంట్ అని ఇట్టే చెప్పేస్తారు. ఆయనతో బాటు ముతక దుస్తులు, ముతక, బూట్లు ధరించి దీనంగా కనపడుతున్న మరో సామాన్య రైతు వున్నాడు. ఫెదాలోవాను రచయిత చూడాలను కుంటున్నారని ఆ రైతే చెప్పాడు” అని కాపలాదారుడు గుక్క తిప్పకుండా వర్ణించాడు.

            దీనంగా కనిపించే ఆ రైతు ఎవరో చేర్నెవ్ స్కీ  వెంటనే ఊహించేశారు. గబగబా కాపలాదారుడితో బయటకు వచ్చి, టాల్ స్టాయ్ కు  తనను తాను స్వయంగా పరిచయం చేసుకొని, ఆయనను ఫెదాతోవా డ్రైసింగ్ రూమ్ కి వెంట తీసుకువెళ్లాడు.

            నాటకం చూడటానికి టాల్ స్టాయ్ స్వయంగా వచ్చారన్న వార్త అప్పుడే స్టేజ్ వెనక వున్న మేకప్ రూముల్లో పాకిపోయింది.

            ఇంతటి విఖ్యాత అతిధికి ఎక్కడ స్థలం కేటాయించాలి అన్న పెద్ద సమస్య వారికి ఎదురైంది. ముందువరసలో ఇంకో కుర్చీ అదనంగా వేస్తేనో? ఇలా చర్చలు సాగుతూండగా టాల్ స్టాయ్ వచ్చారన్న వార్త ఆఫీసు వరకూ ప్రాకింది. అక్కడినుంచి తక్షణం ఒక ఉత్తర్వు వచ్చింది డైరెక్టర్ కు కేటా యించిన ప్రదేశంలో టాల్ స్టాయ్ ను  కూచో పెట్టవలసిందిగా. ఆ విధంగా చేస్తే ఆయనను గౌరవించినట్టూ వుంటుంది. ప్రేక్షకులు ఆయన చుట్టూ మూగిపోకుండా ఆయన్ను దూరంగా వుంచినట్టూ వుంటుంది అని అనుకొన్నారు.

            టాల్ స్టాయ్ తో బాటు వచ్చిన యువకుడు ఎవరో కాదు, టాల్ స్టాయ్ కుమారుడే. ఇద్దరూ నాటకాన్ని చివరి వరకూ చూశారు.

            ‘ఆ ప్రదర్శనను టాల్ స్టాయ్ మెచ్చుకున్నారా? అదే ఇంతవరకూ అంతు చిక్కకుండావుంది. ఎందుచేత నంటే ఆయన ఆ నాటక ప్రదర్శన పైన ఎటువంటి వాఖ్యానం చేయలేదు”.

ఆయన నిజంగా ఏమీ వాఖ్యానించలేదా? నాకు బాగా ఆశ్చర్యం వేసింది.ఆ విషయం గురించి తేల్చు కోవాలనుకొన్నాను ఎంతో కృషి చేసి దానికోసం వెతగ్గా వెతగ్గా, అయన వ్యాఖ్యానం చేయకపోలేదు అని తేలింది.

            పుర ప్రముఖుల్లో ఒకరూ, నాటక విమర్శకుడు అయిన అలగ్జాండర్ఇవనోవ్ చ్  వుస్రోవ్ టాల్ స్టాయ్ నాటకంపై సమీక్ష వ్రాశారు. ఆ సమీక్షలో టాల్ స్టాయ్ స్వయంగా చేసిన వ్యాఖ్యానం కూడా వుంది. లెనిన్ లైబ్రరీలోని వ్రాతపతి విభాగంలో “మాస్కోలోనూ, పీటర్స్ బర్గ్ నూ దిపూట్స్ ఆఫ్ ఎన్ లైటెన్ మెంట్ ప్రదర్శన” అన్న పేరుతో అముద్రితమైన సమీక్ష లభ్యమైంది.

            అలగ్జాండర్ ఇవనోవిచ్ తన సమీక్షలో  కౌంట్ లియో టాల్ స్టాయ్ నాటకం మాస్కోలో, పీటర్స్ బర్గ్ లో ఎలా ప్రదర్శించబడింది వివరిస్తూ, కౌంట్ టాల్ స్టాయ్ స్వయంగా నాటక ప్రదర్శన పైన యిలా వాఖ్యానించారు అని కొన్ని వాక్యాలు ఉదహరించారు.

            “ప్రేక్షకులు నాటకంలోని రైతు పాత్రధారుల్ని చూసి నవ్వారు. వాళ్ళ పాత్రలు నవ్వుపుట్టిస్తాయని తాను అసలు భావించలేదు. నాటకంలో వాళ్ల పాత్రలు మాత్రమే గంభీరమైనవి. నాటకాన్ని రక్తికట్టించేది రైతుల పాత్రే. మిగతా పాత్రలు అంత చెప్పుకోదగినవి కావు. గంభీరమైనవిగా చెప్పబడే రైతు పాత్రలే అంత నవ్వు పుట్టించేవిగా వున్నాయంటే అసలు టాల్ స్టాయ్ స్వయంగా తప్పుచేశారని అనుకోవలసివస్తుంది.”

            టాల్ స్టాయ్ స్వయంగా చేశారని చెప్పబడుతున్న ఈ వ్యాఖ్యను సమీక కుడు స్వయంగా టాల్ స్టాయ్ నోటమ్మటినుంచి విన్నారా? లేక టాల్ స్టాయ్ నుంచి కాక మరే ఇతర వ్యక్తి వద్దనుంచైనా విన్నారా అన్న విషయం మాత్రం ఇదమిద్ధంగా లేదు.

            ఇది దృష్టిలో వుంచుకోని, అసలు టాల్ స్టాయ్ కి, అలగ్జాండర్ ఇవనోవిచ్ కి  అసలు ఏమైనా పరిచయం వుందా అన్న విషయం పరిశీలించా. నేను చేసిన పరిశీలనలో వాళ్లిద్దరికి పరిచయం వుంది అని తేలడమేకాక,మాలే థియోటర్లో నాటక గురించి పై వ్యాఖ్యానం టాల్ స్టాయే స్వయంగా చేశారని వెల్లడైంది.

            1909 లో ప్రచురింపబడిన టాల్ స్టాయ్ అంతర్జాతీయదర్శిని చాలా అపూర్వమైన పుస్తకం. దీని, ఒకే ఒక కాపీ మాత్రమే లెనిన్ లైబ్రరీలో వుంది. అదైనా పుటలు అన్నీ లేవు. ఆ పుస్తకం తిరగేస్తోంటే పి.ఎం. చెలినికోవ్ వ్రాసిన డై రినుంచి కొన్ని పుటలు బయటపడింది. 1890 దశకంలో, ఇంపీరియల్ థియేటర్ కు  చెందిన మాస్కో కార్యాలయానికి చెలినికోవ్ మేనేజర్ . “ఫ్రూట్స్ ఆఫ్ ఎన్ లై టెన్ మెంట్”  నాటకం ముగిసిన తరువాత, ఆ నాట కంలో నటన గురించి టాల్ స్టాయ్ తో చర్చించిన వ్యక్తి ఈయనే అని తేలింది. ఆ నాటక ప్రదర్శన గురించి విముఖంగా టాల్ స్టాయ్ చేసిన వాఖ్యలను బయటపెట్టక, రిటైర్ అయిన 18 సంవత్సరాలకు ఈయన “ఒక డైరీ నుంచి కొన్ని పుటలు”  అన్న వ్యాసం వాసి ప్రచురించారు.

   “టాల్ స్టాయ్ వ్రాసిన నాటకాన్ని కేవలం వినోదాత్మకంగానే మాలే థియేటర్ వాళ్ళు పరిగణించారు.ప్రేక్షకుల్ని అస్తమానూ నవ్వించడానికే గంభీరమైన రైతుల పాత్రల్ని అలా సృష్టించారు” అని చెలినికోవ్ తన వ్యాసంలో పేర్కొన్నారు. రైతుల దుస్థుల విషయంలో కూడా చెలినికోవ్ తన అసంతృప్తిని వెల్లడించారు.

                         *   *   *

బి.యెవ్ సియేల్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *