కథా యాత్రలో చాప కింద నీరు సింగరాజు రమాదేవి గారి కథానిక “ఒకవైపు భూమిపై, సహజ వనరులపై సామాన్య బ్రతుకులపై దాడి జరుగుతుంటే.. మరోవైపు మన సంస్కృతి పైన నిరంతర దాడి జరుగుతోంది. వ్యాపారమే ధ్యేయంగా తీసే సినిమాలు రేటింగులే ధ్యేయంగా తీసే సీరియళ్లు రియాల్టీ షోలు. ఎక్కడ ఏ సంబరమైనా ఐటమ్ సాంగ్ లాంటి పాటలు పెట్టి పెద్ద చిన్న తేడా లేకుండా చిందులు. అంతకంతకు పెరుగుతున్న ఆడంబరాల ఆర్భాటాలు యూజ్ అండ్ త్రో వాడకాలు.సెల్ ఫోన్లు ఫేస్బుక్ దాటి సమాజమే తెలియటం లేదు. అసలు దాడి జరుగుతున్న విషయమే తెలియకుండా స్లో పాయిజన్లా చాప కింద నీరులా పాకుతున్న విష సంస్కృతి”.

సింగరాజు రమాదేవి
సింగరాజు రమాదేవి గత పాతికేళ్ళుగా అనేక సాహితీ ప్రక్రియల్లో సృజన చేస్తున్నారు. వరంగల్ వాస్తవ్యులైన వీరు, ముప్ఫై ఏళ్ళ పాటు భారతీయ జీవిత బీమా సంస్థలో పని చేశారు.
పలు ప్రముఖ దిన,వార,మాస పత్రికలలో,వెబ్ పత్రికలలో వీరి కథలు, కవితలు, వ్యాసాలు, అనువాద కథలు ప్రచురితం అయ్యాయి. అనేక కథలు, కవితలకు పోటీలలో బహుమతులు లభించాయి. పలు నాటికలు, గేయాలు, పుస్తక సమీక్షలు కూడా రచించారు.

